ETV Bharat / state

కేసీఆర్​ మార్క్​ను కంప్యూటర్ నుంచి తొలగించగలరేమో కానీ - ప్రజల మనసులోంచి కాదు : హరీశ్‌రావు - Harish Rao On Budget

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 27, 2024, 10:54 AM IST

Updated : Jul 27, 2024, 12:06 PM IST

Harish Rao On Budget in TG Assembly : శాసనసభలో బడ్జెట్‌పై సాధారణ చర్చ సందర్భంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్​రావు కీలక వ్యాఖ్యలు చేశారు. అవాస్తవాలతో కూడిన బడ్జెట్ ప్రవేశపెట్టారని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన బాగాలేదని మాటలు చెబితే సరిపోతుందా? అందుకు తగిన ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు.

Harish Rao On Budget
Harish Rao On Budget (ETV Bharat)

Harish Rao Made Key Comments On Budget : బడ్జెట్‌పై శాసనసభలో సాధారణ చర్చ సందర్భంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్​రావు కీలక వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్‌పై చర్చను ప్రారంభించిన ఆయన బడ్జెట్‌ ప్రసంగం ఒక రాజకీయ ప్రసంగంలా ఉందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన బాగాలేదని మాటలు చెబితే సరిపోతుందా? అని ప్రశ్నించారు. రూ.4.5 లక్షల లేని జీఎస్‌డీపీని బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.14 లక్షలకు తీసుకెళ్లిందన్నారు. రామగుండం నుంచి 1400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసినట్లు తెలిపారు. గత ప్రభుత్వ పాలన బాగాలేదని ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వంలో 200 వందల పింఛన్ ఇస్తే బీఆర్ఎస్ పాలనలో రూ.2వేలకు పెంచినట్లు హరీశ్‌రావు తెలిపారు. అధికారంలోకి రాకముందు నాలుగు వేల రూపాయల పింఛన్ ఇస్తామన్నారని గుర్తు చేశారు. అయితే, 4 వేల పింఛన్‌ నాలుక మీదనే ఉందని ఎద్దేవా చేశారు. పల్లెల అభివృద్ధి స్వచ్ఛతపై కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ర్యాంక్​ల్లో టాప్‌ 20లో 14 తెలంగాణకు వచ్చాయని గుర్తు చేశారు.

బీఆర్ఎస్ పనితీరు తెలియకూడదని పదేళ్ల ప్రభుత్వం సమాచారాన్ని తొలగించారని మండిపడ్డారు. రాష్ట్ర బడ్జెట్‌ అవాస్తవాలతో కూడిన బడ్జెట్ అని హరీశ్‌రావు విమర్శించారు. ట్యాక్స్‌ ద్వారా రెవెన్యూ ఎక్కువ వస్తుందని బడ్జెట్‌లో పెట్టారని ఆరోపించారు. ఎలా వస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతలు విధానాల రూపకల్పన కంటే బీఆర్ఎస్ నేతలను తిట్టడంపైనే ఎక్కువ దృష్టిపెట్టారని హరీశ్‌రావు ఆరోపించారు.

బీఆర్ఎస్ శ్రమను, కాంగ్రెస్ ఎనిమిది నెలల డ్రామాలను ప్రజలు చూస్తున్నారని తెలిపారు. గతంలో కరెంట్ పరిస్థితి గురించి రేవంత్‌రెడ్డి మాట్లాడారని, కేశవరావు ఇంటికి సీఎం పోతే కరెంట్ పోయిందని ఎద్దేవా చేశారు. ఆ విషయాన్ని అన్ని పత్రికలు ప్రస్తావించాయని పేర్కొన్నారు. బడ్జెట్‌లో వాస్తవాల విస్మరణ-అవాస్తవాల ప్రస్తావన జరిగిందని హరీశ్‌రావు ఆరోపించారు.

తమ ప్రభుత్వ పనితీరు గురించి సమాచారాన్ని తొలగిస్తున్నారని హరీశ్ రావు ఆరోపించారు. కంప్యూటర్ నుంచి తొలగిస్తారేమో కానీ, ప్రజల మెదడు నుంచి తొలగించలేరని పేర్కొన్నారు. అక్షరాలను తొలగిస్తారేమో కానీ, అనుభవాల్ని తొలగించలేరన్నారు. ఆచరణ సాధ్యం కానీ అవాస్తవాల బడ్జెట్ ఇది అన్నారు. 2014లో రూ.10 వేల కోట్లు ఎక్సైజ్‌ ఆదాయం ఉందని, 2023- 24లో రూ.34 వేల కోట్లకు చేరిందని హరీశ్​రావు తెలిపారు. బడ్జెట్​లో ఈ సంవత్సరం 42వేల కోట్లు రాబడి వస్తుందని బడ్జెట్​లో పేర్కొన్నారని తెలిపారు. తెలంగాణలో బెల్ట్ షాపులద్వారా ఇంకా ఆదాయం పెంచుకోవాలని చూస్తున్నారని హరీశ్​రావు మండిపడ్డారు.

స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ త్వరగా పూర్తి చేయండి - అధికారులకు సీఎం ఆదేశం - CM Revanth on Panchayat Elections

ఆ రెండింటిలో ఏది వాస్తవమో స్పష్టత ఇవ్వండి : కాంగ్రెస్ నేతలకు హరీశ్‌రావు డిమాండ్‌ - harishrao tweet on fasal bhima

Last Updated : Jul 27, 2024, 12:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.