ETV Bharat / state

'విద్యార్థుల జీవితాలతో కాంగ్రెస్​ చెలగాటం - ప్రభుత్వానికి ఎందుకింత మొండిపట్టు' - KTR on Medical Admissions Issue

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 14, 2024, 1:52 PM IST

KTR on Medical Admissions Issue : రాష్ట్రంలోని మెడికల్​ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ వాయిదా పడటం ప్రభుత్వ వైఫల్యానికి నిలువెత్తు నిదర్శనమని మాజీమంత్రి కేటీఆర్​ విమర్శించారు. ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందన్న ఆయన, జీఓ 33 అమలు కోసం ఎందుకింత మొండిపట్టు అని ఎక్స్​ వేదికగా ప్రశ్నించారు.

KTR about Medical Admissions for local Students
KTR on Medical Admissions Issue (ETV Bharat)

KTR about Medical Admissions for local Students : రాష్ట్రంలో ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్ల ప్రక్రియకు బ్రేకులు పడటం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి నిలువెత్తు నిదర్శనమని బీఆర్​ఎస్​ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్‌ చేశారు. వైద్య విద్యను అభ్యసించాలని కోటి ఆశలు పెట్టుకున్న విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతుందన్నారు. పక్క రాష్ట్రాల్లో అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుంటే తెలంగాణలో మాత్రం ఇంకెంత కాలం సందిగ్ధమని ప్రశ్నించారు.

తెలంగాణ బిడ్డలను నాన్ లోకల్స్​గా మార్చి, ఇతర రాష్ట్రాల విద్యార్థులకు పెద్దపీట వేసే జీఓ 33 అమలు కోసం కాంగ్రెస్ సర్కారు ఎందుకింత మొండిపట్టు పడుతోందని కేటీఆర్ మండిపడ్డారు. స్థానికతను నిర్ధారించే విషయాన్ని ప్రభుత్వం ఎందుకింత వివాదాస్పదం చేయడంతో పాటు రోజురోజుకూ న్యాయపరమైన చిక్కుల్లోకి నెడుతోందని ఆక్షేపించారు. తమ పిల్లల్ని డాక్టర్లుగా చూడాలని కలలు కంటున్న వేలాది మంది తల్లిదండ్రుల ఆకాంక్షలను దెబ్బతీసే గొడ్డలిపెట్టు లాంటి నిర్ణయాలను ప్రభుత్వం ఇకనైనా వెనక్కి తీసుకోవాలని సూచించారు.

డాక్టర్ల ఫ్యాక్టరీగా తీర్చిదిద్దితే కాంగ్రెస్ తూట్లు పొడుస్తోంది : బీఆర్ఎస్ హయాంలో జిల్లాకో మెడికల్ కాలేజీ నినాదాన్ని నిజం చేస్తే, కాంగ్రెస్ సర్కారు రాగానే దారుణంగా నీరుగారుస్తోందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ఎంబీబీఎస్​ను సీట్లను ఏకంగా 8 వేల 915కు పెంచుకుని రాష్ట్రాన్ని డాక్టర్ల ఫ్యాక్టరీగా తీర్చిదిద్దితే ఆ సమున్నత లక్ష్యానికి కాంగ్రెస్ సర్కారు తూట్లు పొడుస్తోందని ధ్వజమెత్తారు. కేసీఆర్ విజన్‌కు కాంగ్రెస్ రూపంలో గ్రహణం పట్టిందని దుయ్యబట్టారు.

మంత్రి రాజనర్సింహ ప్రకటన : మరోవైపు నీట్‌లో ఉత్తీర్ణులై, ఎంబీబీఎస్ సీట్ల కౌన్సెలింగ్ కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ ఇచ్చిన గడువులోగా ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ తప్పకుండా పూర్తి చేస్తామని తెలిపారు. ఈ విషయంపై ఎలాంటి అసత్య ప్రచారాలను నమ్మొద్దని కోరారు. తెలంగాణ విద్యార్థులకే సీట్లు దక్కాలన్నది తమ ఆలోచన అని చెప్పారు. మరో వారం రోజుల్లో కౌన్సెలింగ్ ప్రారంభం అవుతుందని, వెబ్‌ ఆప్షన్ల నమోదుకు విద్యార్థుల సిద్ధంగా ఉండాలని సూచించారు.

మ ఎమ్మెల్యేలను గెలిపించలేదని - హైదరాబాద్‌ ప్రజల మీద రేవంత్ పగబట్టారు : కేటీఆర్ - KTR Slams On Congress Govt

'ఇందిరమ్మ రాజ్యం అంటూ - ఆనాటి ఎమర్జెన్సీ రోజులను అమలు చేస్తున్నారు' - KTR on BRS Leaders House Arrest

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.