Forest Officers Trying Caught Cheetah at Shamshabad Airport : రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో చిరుత ఆనవాళ్లు గుర్తించిన అటవీ శాఖ అధికారులు దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గత 4 రోజులుగా బోన్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. బోన్ దగ్గరకు వచ్చి మళ్లీ వెళ్తుందని అధికారులు తెలిపారు. ఈ విజువల్స్ అన్ని సీసీ కెమెరాలకు చిక్కాయని వెల్లడించారు.
Cheetah Spotted Near Shamshabad Airport : గత నెల 28వ తేదీన తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని గొల్లపల్లి వద్ద ఎయిర్‌పోర్టు ప్రహరీ నుంచి చిరుత దూకినట్లు అధికారులు గుర్తించారు. చిరుత దూకే సమయంలో విమానాశ్రయం గోడకు ఉన్న ఫెన్సింగ్‌కు తగలడంతో అలారం మోగింది. అప్రమత్తమైన ఎయిర్‌పోర్టు అధికారులు వెంటనే సీసీ కెమెరాలను పరిశీలించగా చిరుత సంచరిస్తున్నట్లు నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులకు తెలిజేయగా వారు రంగంలోకి దిగారు.
నార్కట్‌పల్లిలో పులి సంచారం - అబద్ధమని తేల్చిన అటవీ శాఖ
Cheetah CCTV Visuals at Shamshabad : ఆదివారం రోజు నుంచి అటవీ శాఖ అధికారులు చిరుతను బంధించేందుకు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో సుమారు 5 బోన్లు, 25 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అన్ని కెమెరాల్లో చిరుతకు సంబంధించిన విజువల్స్ చిక్కాయి. కలుగులో ఉన్న ఎలుకకు ఉల్లిపాయ ఎర వేసినట్టు దానికి మేకలను ఎరగా వేసి పట్టుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
చిరుత కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ దాదాపు 5 మేకలు ఎర వేశాం. అయితే అది ఎక్కువగా ఒకే ప్రాంతంలో సంచరిస్తూ బోన్ వరకు వచ్చి వెళ్తూ దోబూచులాడుతోంది కానీ లోపలికి మాత్రం వెళ్లడం లేదు. ఈ చిరుత ఇది మహబూబ్‌నగర్ పరిసరాల నుంచి వచ్చి ఉంటుందని అనుకుంటున్నాం. ఈ చిరుతతో పాటు దాని పిల్లలు కూడా ఇదే ప్రాంతంలో సంచరిస్తున్నట్లుగా అనుమానంగా ఉంది. అని అటవీ శాఖ అధికారులు అంటున్నారు.
జనాభా పెరిపోవడం వల్ల అడవుల్లో జంతువుల ఆవాసాలు దెబ్బతినడం, వేట, నీరు దొరకని పరిస్థితి రావడం, ఇలాంటి సందర్భాల్లో చిరుతపులులు జనావాసాల్లోకి వస్తాయని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. ఉద్దేశపూర్వకంగా ఓ జంతువు అడవి నుంచి బయటకు రాదని, అడవిలో మనుషుల ప్రమేయం పెరగడం, బయట ప్రాంత ఒత్తిడి వల్లే ఇలాంటి సందర్భాలు ఎదురవుతున్నాయని అధికారులు తెలిపారు.
ఎట్టకేలకు తల్లి చెంతకు చిరుత పిల్లలు- అటవీశాఖ 10 రోజుల ఆపరేషన్ సాగిందిలా!