ETV Bharat / state

కరీంనగర్​లో ఎలుగుబంటి అలజడి - ఎట్టకేలకు పట్టుకున్న అటవీశాఖ అధికారులు

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 6, 2024, 7:59 PM IST

Forest Department Officers Catches Bear in Karimnagar : కరీంనగర్​లో భయాందోళనకు గురి చేసిన ఎలుగుబంటిని అటవీశాఖ అధికారులు ఎట్టకేలకు పట్టుకున్నారు. పొదల్లోకి దూసుకెళ్లిన దానికి మత్తుమందు ఇచ్చి పట్టుకున్నారు.

Bear Caught By Karimnagar Forest Officers
Forest Department Officers Catches Bear in Karimnagar

కరీంనగర్​లో ఎలుగుబంటి అలజడి ఎట్టకేలకు పట్టుకున్న అటవీశాఖ అధికారులు

Forest Department Officers Catches Bear in Karimnagar : కరీంనగర్‌ జిల్లా మానకొండూరులో కలకలం సృష్టించిన ఎలుగుబంటిని అటవీశాఖ అధికారులు ఎట్టకేలకు బంధించారు. పొదల్లోకి దూసుకెళ్లిన భల్లూకానికి పక్కా ప్లాన్​తో మత్తుమందు ఇచ్చి పట్టుకున్నారు. ఎలుగుబంటి చిక్కడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

కరీంనగర్ జిల్లా మానకొండూరు చెరువు వద్దకు వచ్చిన భల్లూకం స్థానికుల్ని ( Karimnagar Bear Incident) భయాందోళనకు గురి చేసింది. ఇళ్లలోకి వస్తున్న ఎలుగుబంటిని వీధి శునకాలు వెంటబడి తరిమాయి. పరుగులు తీసిన భల్లూకం ఓ చెట్టుకిపైకి ఎక్కింది. స్థానికులు పోలీసులు, అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. చెట్టుపై ఉన్న ఎలుగుబంటిని చూసేందుకు స్థానికులు భారీగా తరలి వచ్చారు. చాలా సమయం వరకు అది చెట్టుపైనే కూర్చోనే ఉంది. కొంతమంది స్థానికులు దాన్నీ ఫొటోలు తీశారు. చెట్లల్లోకి వెళ్లిన భల్లూకం ఎటూ పారిపోకుండా ఉండేందుకు అటవీ అధికారులు పహారా ఏర్పాటు చేశారు.

BEAR ATTACK: తోటలోకి దూసుకొచ్చి.. 8 మంది రైతులపై ఎలుగుబంటి దాడి

ఎలుగుబంటిని పట్టుకునేందుకు ప్రత్యేకంగా వలలు ఏర్పాటు చేశారు. వరంగల్‌ నుంచి అటవీశాఖ సహాయ సిబ్బందిని రప్పించారు. మత్తు ఇంజిక్షన్‌ ఇచ్చి కిందకు తీసుకురావాలని నిర్ణయించారు. ఇంజిక్షన్‌ ఇచ్చేందుకు ప్రయత్నిస్తుడంగా ఎలుగుబంటి చెట్టుపై నుంచి దిగి పరారైంది. సమీపంలోని పొదల్లోకి వెళ్లడంతో గాలింపు చేపట్టిన అటవీ శాఖ సహాయ సిబ్బంది మత్తు మందు ఇచ్చి ఎట్టకేలకు పట్టుకున్నారు.

ఎలుగుబంటి దాడి.. పశువుల కాపరి పరిస్థితి విషమం

Bear Caught By Karimnagar Forest Officers : కరీంనగర్ శివారులో ఉన్న గ్రానైట్ క్వారీల్లో భారీ పేలుళ్లకు భయపడే ఎలుగుబంట్లు గ్రామాల్లోకి వస్తున్నాయని స్థానికులు అన్నారు. కరీంనగర్‌తో పాటు శాతవాహన వర్సిటీలో పలుసార్లు భల్లూకాన్ని బంధించి అడవులకి తరలించారు. మరోసారి ఎలుగుబంటి రావడం వల్ల స్థానికులు ఆందోళన చెందారు. చివరకు అటవీ అధికారులు బంధించడంతో ఊరట చెందారు. మరోసారి ఎలుగుబంటి రావడంతో స్థానికులు ఆందోళన చెందారు. ఇలాంటి ఘటనలు మరోసారి చోటుచేసుకోకుండా తగిన చర్యలు చేపట్టాలని అటవీ అధికారులను కోరారు. లేకపోతే ప్రాణాలను హానీ అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇది వరకే ఇలాంటి ఘటనలు జరగడం ప్రతిసారి అటవీశాఖ అధికారులు వచ్చి ఎలుగుబంట్లను పట్టుకోవడం జరగడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జిల్లా శివారులో ఉన్న గ్రానైట్​ క్వారీల్లో పేలుళ్లు సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అవి సంతరించే సమయాల్లో ప్రజల ప్రాణానికే హానీ అని పొరాపాటున చిన్నపిల్లలు ఉంటే పరిస్థితి ఎంటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎలుగబంట్లు రాకుండా ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

ఎలుగు బంటి పనస చెట్టు ఎక్కి ఏం చేసిందో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.