Floating Restaurant in East Godavari District : ఆహ్లాదకర వాతావరణంలో గోదారి అందాల నడుమ రుచుల విందు ఆస్వాదించేలా ఫ్లోటింగ్ రెస్టారెంట్ సిద్ధం అవుతోంది. పర్యాటక శాఖ సౌజన్యంతో ప్రైవేటు వ్యక్తుల నిర్వహణలో గోదావరిపై మొట్టమొదటిసారిగా పూర్తి స్థాయిలో ఇది అందుబాటులోకి రానుంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఉమా మార్కండేయస్వామి ఆలయం సమీపంలోని లాంచీల రేవు నుంచి ఏపీ టూరిజం బోట్‌ల ద్వారా ప్రయాణించి ఫ్లోటింగ్ రెస్టారెంట్‌కు చేరుకునేలా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ అక్టోబర్ 27న (ఆదివారం) ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ దీనిని ప్రారంభిస్తారని నిర్వాహకులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ పురందేశ్వరి తదితరులు పాల్గొంటారని తెలియజేశారు. ఈ ఫ్లోటింగ్ రెస్టారెంట్ కిట్టీ పార్టీలు, పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకునేందుకు సైతం అనువుగా ఉంటుందని యాజమాన్యం తెలియజేసింది.
విజయవాడలో నీటిపై తేలియాడే రెస్టారెంట్ - ఒకేసారి 500 మందికి విందు - FLOATING RESTAURANT ON KRISHNA