Fish Andhra Scheme Failed in YSRCP Regime: చేపలు, రొయ్యల వాడకం పెంచుతామంటూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన ‘ఫిష్ ఆంధ్ర’ ప్రాజెక్టు ఘోరంగా విఫలమైంది. ఇతర రాష్ట్రాల్లో మత్స్య ఉత్పత్తుల వినియోగం అంతకంతకూ పెరుగుతుంటే, ఏపీలో ప్రత్యేక ప్రాజెక్టు చేపట్టి, 57 కోట్ల రూపాయలకు పైగా కేంద్ర నిధులు ఖర్చు చేసినా, సాధారణ వృద్ధి కూడా నమోదు కాని దుస్థితి.
చేపలు, రొయ్యలతోపాటు ఫిష్ ఆంధ్ర దుకాణాలు, వాహనాలకు వైఎస్సార్సీపీ రంగులు వేయటంపై చూపిన శ్రద్ధలో పదో వంతు కూడా వాటి వినియోగాన్ని పెంచడంపై పెట్టలేదు. ప్రాజెక్టు ప్రారంభించి నాలుగు సంవత్సరాలు అయినా ఇప్పటికి మూడు హబ్‌లు మాత్రమే ఏర్పాటు చేశారు. అందులో 1.7 కోట్ల రూపాయలతో మార్కెట్ నిధులతో చేపట్టిన పులివెందుల హబ్ ఎప్పుడో మూతపడింది. మొత్తం 5 వేల 635 యూనిట్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా, 2 వేల 199 మాత్రమే ప్రారంభించారు. అందులోనూ 70 శాతానికి పైగా మూతపడ్డాయి. ఇంకా వైఎస్సార్సీపీ వాసనలు వదులుకోకుండా అవే రంగులను కొనసాగిస్తుండటం గమనార్హం.
'ఫిష్ ఆంధ్ర' అన్నారు- మోడ్రన్ ఫిష్ మార్కెట్ భవనాన్ని మూలన పడేశారు - YCP Govt Neglectd Fish Markets
పొరుగు రాష్ట్రాల్లో చేపలు, రొయ్యల వినియోగం గణనీయంగా పెరుగుతుంటే, ఏపీలో మాత్రం నామమాత్రంగా ఉంది. ఒడిశాలో 2019-20లో తలసరి చేపల వినియోగం 13.79 కిలోలుంటే, 2022-23 నాటికి 17.73 కిలోలకు పెరిగింది. అంటే 3.94 కిలోలు పెరిగింది. ఇదే కాలంలో రాష్ట్రంలో వృద్ధి 1.83 కిలోలు మాత్రమే నమోదైంది. ఇది సాధారణ వృద్ధి మాత్రమే. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుతో ఒనగూరిందేమీ కాదని స్పష్టమవుతోంది. ఇతర రాష్ట్రాల్లో ఏపీకంటే ఎక్కువ వృద్ధి నమోదైంది.
బలైన పేద, మధ్యతరగతి వర్గాలు: ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన కింద ‘ఫిష్ ఆంధ్ర’ను వైఎస్సార్సీపీ సొంత కార్యక్రమంలా మార్చేశారు. రోడ్డుపక్క షెడ్డు పెట్టుకొని మాంసం అమ్ముతున్నా, చేపలు, రొయ్యల్ని విక్రయిస్తున్నా గత ప్రభుత్వంలో అధికారులు వారి వద్ద ఫిష్ ఆంధ్ర బోర్డులు పెట్టేశారు. లాంజ్, ఆక్వా హబ్, సూపర్, డెయిలీ, వాహనాల పేరుతో 60 లక్షల రూపాయలు, 30 లక్షలు, 12 లక్షలు, 8 లక్షలు, 4 లక్షల రాయితీ సొమ్మును వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలకు కట్టబెట్టారు.
కొంతమందికి చేపలు, రొయ్యల సరఫరా బాధ్యతలు అప్పగించి, అధిక ధరలు వసూలు చేశారు. అధిక రాయితీ యూనిట్లేమో వైఎస్సార్సీపీ వాళ్లకు, మినీ ఔట్‌లెట్లను మాత్రం పేద, మధ్యతరగతి వర్గాల వారికి కేటాయించారు. ఉత్పత్తుల సరఫరా సక్రమంగా లేకపోవడంతో పాటు నిర్వహణ భారంతో ఆ దుకాణాలు మూతపడ్డాయి. దీంతో పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలు నష్టాల పాలయ్యారు.
Pandugappa Fish: మత్స్యకారులకు పంట.. ఒక్క చేపకు భారీ ధర.. దీని రుచి మాత్రం..!
వాస్తవంగా మత్స్య ఉత్పత్తులు అంతగా అందుబాటులో లేని ప్రాంతాల్లో వాటి అమ్మకాలను పెంచి, అక్కడి ప్రజలకు తక్కువ ధరకు అందేలా చర్యలు తీసుకోవాలి. కానీ మత్స్య ఉత్పత్తులు అధికంగా లభ్యమయ్యే ఏలూరు జిల్లాలో 56 శాతం, ఎన్టీఆర్ జిల్లాలో 55 శాతం, పశ్చిమగోదావరి జిల్లాలో 40 శాతం, మన్యం జిల్లాలో 38 శాతం చొప్పున త్రైమాసిక వృద్ధి నమోదైనట్లు అధికారులు లెక్కలు చూపుతున్నారు.
అనంతపురం జిల్లాలో 3 శాతం, కర్నూలు జిల్లాలో 7 శాతం మాత్రమే వృద్ధి ఉంది. జనవరి నుంచి మార్చి మధ్యలో రాష్ట్ర వ్యాప్తంగా 154 కోట్ల రూపాయల విలువైన 7 వేల 276 టన్నుల అమ్మకాలు జరిగాయని, తర్వాత మూడు నెలల్లో 22 శాతం వృద్ధి నమోదు చేశామని అధికారులు లెక్కల్ని వల్లె వేస్తున్నారు. అంటే సాధారణంగా జరిగే అమ్మకాలను చూపించి తమ ఘనతగా చెప్పుకుంటున్నారు.
వారపు సంతలో అరుదైన చేపలు - ఒక్కొక్కటి ఎంత బరువంటే ! - Huge Fish Sale at Onukudelli in aob