Fire Accident in Seven Hills Hospital at Visakha : విశాఖ సెవెన్ హిల్స్ హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదం కలకలం రేపింది. ఐదో అంతస్తులోని హాస్పిటల్ సీఈవో గది అగ్నికి ఆహుతైంది. ఏసీ షార్ట్ సర్క్యూటై మంటలు చెలరేగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. మంటలు చెలరేగిన పరిపాలనా భవనానికి పక్కనే రోగులకు సేవలు అందించే భవనం ఉంది. మంటలు అటువైపు వ్యాపించకుండా అగ్నిమాపకశాఖ సిబ్బంది అదుపు చేశారు. విశాఖలో ఇటీవలే మెడికవర్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం మరువకముందే మరో ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది.
Visakha Police Commissioner Sankhabrata Bagchi: ఈ క్రమంలో విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది స్పందించి ప్రమాదాన్ని అదుపు చేశారని కమీషనర్ తెలిపారు. ఈ ప్రమాదంలో రోగులకు ఏ ముప్పు వాటిల్ల లేదని హాస్పిటల్ యాజమాన్యం తెలిపిందని అన్నారు. విశాఖలో హాస్పిటల్స్ వరుస అగ్ని ప్రమాదాల దృష్ట్యా రెండు వారాలలో అన్ని ఆసుపత్రుల భద్రత అంశాలను పరిశీలించుకోవాలని అన్నారు. అన్ని హోటల్స్ హాస్పిటల్స్ ఫైర్ సేఫ్టీ మీద పున సమీక్ష చేసుకోవాలని కమీషనర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు.
విశాఖ రైలు అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమా? - TRAIN FIRE ACCIDENT
Visakha Fire Department Officer Renukaiah: విశాఖ అగ్నిమాపక శాఖాధికారి రేణుకయ్య మాట్లాడుతూ తమకు సమాచారం అంది వెంటనే ప్రమాద ప్రాంతానికి చేరుకున్న కొద్దిసేపట్లోనే మంటల్ని అదుపు చేశామని అన్నారు. మరింత సూక్ష్మ పరిశీలన కోసం జైంట్ ఫైర్ వెహికల్ని కూడా తీసుకొచ్చినట్లు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు తక్షణమే స్పందించడానికి హాస్పిటల్స్, హోటల్స్‌లలో కాస్త శిక్షణ పొందిన బృందాలు ఉండాలని సూచించారు. అగ్నిమాపక శాఖ వాహనాలు వచ్చేలోపులో అగ్ని జ్వాలలు వ్యాప్తి చెందకుండా కొంత నివారించవచ్చని రేణుకయ్య తెలిపారు.
విశాఖ రైల్వేస్టేషన్ ఘటన- కుట్ర ఉందన్న కోణంలో అధికారుల విచారణ - fire accident in korba express