Fire Accident In Sangareddy : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారం పారిశ్రామిక వాడలో మంగళవారం సాయంత్రం సీఎంహెచ్ పరిశ్రమలో రియాక్టర్ బ్లాస్ట్ అయింది. అయితే అదే సమయంలో పరిశ్రమలో 15 మంది కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. ఒక్కసారిగా బ్లాస్ట్ అవ్వడంతో ఆ పరిశ్రమతో పాటు పక్కనే ఉన్న వనమాలి ఫార్మా పరిశ్రమలో కూడా మంటలు వ్యాపించి రెండు పరిశ్రమల్లో అగ్ని ప్రమాదం(Fire accident) చోటుచేసుకుంది. ఈ ఘటనలో పరిశ్రమలో విధులు నిర్వహిస్తున్న మోటు మాలిక్, దత్తు కులకర్ణి, కాలేశా పఠాన్, గోయదరావత్లు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం ఇస్నాపూర్‌లోని కాకతీయ ఆసుపత్రి, పటాన్‌చెరులోని ధ్రువ ఆసుపత్రులకు చికిత్స నిమిత్తం తరలించారు.
చిలీ కార్చిచ్చు బీభత్సం- 112కు చేరిన మృతుల సంఖ్య- 20వేల ఎకరాలు బూడిద!
Massive Fire Incident In Patancheru : పటాన్చెరు, పాశమైలారం పారిశ్రామిక వాడకు చెందిన ఐదు అగ్నిమాపక శకటాలు తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చాయి. మంటలు అదుపులోకి తెచ్చేందుకు సాయపడిన కార్మికులు రసాయనాల ఘాటు పీల్చడంతో అస్వస్థతకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి కాస్త విషమంగానే ఉందని వైద్యులు చెబుతున్నారు.
స్కూల్ హాస్టల్లో మంటలు- 13 మంది మృతి- ఫ్యాక్టరీలో పేలుడుకు 8 మంది బలి
పటాన్‌చెరులో భారీ అగ్ని ప్రమాదం : ఆర్డీవో రవీందర్ రెడ్డి అగ్ని ప్రమాదం జరిగిన ఘటనాస్థలిని పరిశీలించి ప్రమాదంపై ఆరా తీశారు. పటాన్చెరు ధ్రువ ఆసుపత్రిలో అస్వస్థకు గురైన కార్మికులను పరిశీలించి వారి వివరాలు తీసుకున్నారు. వారికి శ్వాస పీల్చుకోవడం కష్టంగా ఉందని, పరిస్థితి సీియస్గానే ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు చెప్పారు.
"మంగళవారం సాయంత్రం పాశ మైలారం ఫేజ్ 2లో ఉన్నటువంటి రెండు కెమికల్ ఫ్యాక్టరీల్లో భారీ ప్రమాదం జరిగింది. సీఎంహెచ్ పరిశ్రమలో రియాక్టర్ బ్లాస్ట్ అయ్యింది. ఘటనలో జరిగిన సమయంలో 15 మంది కార్మికులు ఉన్నారు. బ్లాస్ట్ అయ్యినప్పుడు వనమాలి ఫార్మా పరిశ్రమలో మంటలు వ్యాపించాయి. మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చాం." - శ్రీనివాస్, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి, సంగారెడ్డి
దిల్‌సుఖ్‌నగర్ ఆర్టీసీ డిపోలో అగ్నిప్రమాదం - రెండు బస్సులు దగ్దం
జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రైవేట్ బస్సు బోల్తా - మహిళ సజీవదహనం