ETV Bharat / state

బియ్యం సంచుల తయారీ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం - 7 గంటలు శ్రమించి మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది - Fire Accident

Fire Accident in Tukkuguda : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ప్రాంతంలోని తుక్కుగూడ హార్డ్‌వేర్‌ పార్క్‌ పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బియ్యం సంచుల తయారీ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగి పరిశ్రమ మొత్తం వ్యాపించాయి. అప్పటికే అక్కడ పని చేసే సిబ్బంది మొత్తం బయటకు వచ్చేయడంతో ప్రాణ నష్టం తప్పింది.

Fire Accident at Tukkuguda in Rangareddy
Fire Accident in Tukkuguda (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 25, 2024, 8:05 AM IST

తుక్కుగూడలో భారీగా చెలరేగిన మంటలు - తప్పిన పెను ప్రమాదం (ETV Bharat)

Fire Accident at Tukkuguda in Rangareddy : హైదరాబాద్‌ శివారులోని పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. తుక్కుగూడ పారిశ్రామిక వాడలోని శ్రీనాథ్‌ ఉమెన్‌ ప్యాక్ ప్రైవేట్‌ లిమిటెడ్ సంస్థలో బియ్యం సంచుల మీద ముద్రణ పనులు నిర్వహిస్తున్నారు. ఈ పరిశ్రమలో శుక్రవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు చెలరేగి పరిశ్రమ మొత్తం వ్యాపించాయి. గమనించిన సిబ్బంది పరిశ్రమ నుంచి బయటకు పరుగులు తీశారు.

అప్పటికే మంటలు పెద్ద ఎత్తున వ్యాపించి దట్టంగా పొగలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని 8 శకటాలతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. మంటల ధాటికి పరిశ్రమ ఒకవైపు కుప్పకూలింది. మిగతా భవనం కూడా బీటలు వారి, అది ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.

7 గంటల పాటు శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది : దాదాపు 7 గంటల పాటు శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో పరిశ్రమ పూర్తిగా అగ్నికి ఆహుతయింది. అందులోని సామగ్రి, యంత్రాలు బుగ్గి పాలయ్యాయి. విద్యుదాఘాతం కారణంగానే మంటలు చెలరేగి ఉంటాయని అధికారులు భావిస్తున్నప్పటికీ ఘటనపై విచారణ పూర్తయితే కారణాలు తేలే అవకాశం ఉంది. అయితే పరిశ్రమకు ఆవరణలోనే ఇందులో పని చేసే సిబ్బంది ఉంటున్నప్పటికీ వారంతా ముందుగానే బయటకు వెళ్లడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. పరిశ్రమలో జరిగిన భారీ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

'మేం వచ్చేసరికి మంటలు భారీగా వ్యాపించాయి. షెడ్డు లోపల చాలా మెటీరియల్​ ఉంది. మంటలను అదుపులోకి తెచ్చాం. ఆ మంటల తీవ్రతకు పరిశ్రమ ఒక వైపు కూలిపోయింది. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అదృష్టవశాత్తు అగ్నిప్రమాదం జరుగుతున్న సమయంలో ఎవరూ లేరు. ఆ సమయానికి అందరూ బయటకు వచ్చారు. అగ్నిప్రమాదం కూడా పరిశ్రమలో జరిగింది. బయటకు వ్యాపించలేదు.' - శ్రీధర్‌రెడ్డి, అగ్నిమాపక శాఖ అధికారి

Lorry catches Fire At petrol Bunk : డీజిల్ కోసమని పెట్రోల్​ బంక్​కు వచ్చిన లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఈ నెల 19న జరిగింది. డీజిల్​ నింపడానికి సిద్ధమవుతున్న సమయంలో లారీ ట్యాంక్​ నుంచి ఒక్కసారిగా మంటలు రావడంతో అక్కడున్న వారంతా భయాందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తు బంకు సిబ్బంది వెంటనే తేరుకుని చాకచక్యంగా వ్యవహరించి అగ్నిమాపక పరికరాలతో మంటలను ఆర్పివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ వీడియో కోసం ఇక్కడ క్లిక్​ చేయండి

హార్డ్‌వేర్‌ షాప్‌లో అగ్నిప్రమాదం - మంటల్లో చిక్కుకున్న నలుగురిని రక్షించిన ఫైర్​ సిబ్బంది - Vikarabad Fire Accident Today

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.