Kukatpally Fire Accident Today : రాష్ట్రంలో రోజూ ఎక్కడో ఒక దగ్గర అగ్ని ప్రమాదం జరుగుతూనే ఉంది. అసలే వేసవి కాలం కావడం భానుడి భగభగలు కూడా ఈ అగ్ని ప్రమాదాలకు ఒక కారణంగా చెప్పవచ్చు. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరంలో ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఎందుకంటే షాపులు అన్ని దగ్గర దగ్గరగా ఉండడం కూడా కారణం కావచ్చు. అలాగే ఎండ వేడినే కాకుండా, షార్ట్ సర్క్యూట్, మానవ తప్పిదాలు కూడా ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. హైదరాబాద్ తాజాగా కూకట్పల్లి జాతీయ రహదారి పక్కన కూలర్లు అమ్మే దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం : కూకట్పల్లి జాతీయ రహదారి పక్కన కూలర్లు అమ్మే దుకాణంలో విక్రయాలు అయిపోయిన తర్వాత మూసివేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత రాత్రి 11 గంటల సమయంలో ఒక్కసారిగా దుకాణంలో మంటలు చెలరేగాయి. ఈ మంటలు తీవ్రరూపం దాల్చి పక్కకు వ్యాపించాయి. ఆ పక్కనే ఉన్న టైరు పంచర్ దుకాణం, ఆ కూలర్లు షాపు కాలి బూడిదయ్యాయి. ఈ షాపులతో పాటు పక్కనే ఉన్న ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పార్కింగ్‌లో నిలిపి ఉంచిన కొన్ని వాహనాలకు మంటలు అంటుకున్నాయి.
టైలర్ షాప్‌లో ఘోర అగ్ని ప్రమాదం- ఒకే కుటుంబంలోని ఏడుగురు మృతి
తప్పిన భారీ అగ్ని ప్రమాదం : వెంటనే స్థానికులు మంటలను ఆర్పే ప్రయత్నం చేయగా ఎంతకీ ఆరకపోవడంతో ఫైర్ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే రెండు అగ్నిమాపక శకటాలతో వచ్చిన ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో రెండు దుకాణాలు అగ్నికి ఆహుతి అవ్వగా 10 ద్విచక్ర వాహనాలు మంటలకు పూర్తిగా కాలిపోయాయి. అగ్ని మాపక సిబ్బంది వెనువెంటనే స్పందించడంతో భారీ ప్రమాదమే తప్పినట్లు అయింది.
అగ్ని ప్రమాదానికి గల కారణాలు : ఉదయం స్టేషన్‌కు వచ్చిన ట్రాఫిక్ పోలీసులు ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై ఆరా తీశారు. మొత్తం ఎన్ని వాహనాలు కాలిపోయాయని పరిశీలించారు. సంఘటన స్థలంలో మొత్తం 22 ద్విచక్రవాహనాలు పూర్తిగా దగ్ధం కాగా, మరో 15 పాక్షికంగా దెబ్బతిన్నాయని తెలిపారు. ఈ ప్రమాదానికి కారణం కూలర్లు, పంచర్ దుకాణాల వద్ద చెట్లు ఉండటంతో గాలికి పైన విద్యుత్ తీగలకు తగిలి అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. విద్యుత్‌శాఖ సిబ్బంది విద్యుత్ తీగలకు మరమ్మత్తులు చేపడుతున్నారు.
అగ్ని ప్రమాదం సంభవించిందా? - అయితే కంగారు పడకండి - ఇలా చేస్తే సరి! - Fire Mock Drill In Hyderabad