ETV Bharat / state

మలక్​పేట మెట్రో స్టేషన్​ వద్ద అగ్ని ప్రమాదం - భారీగా వ్యాపించిన పొగ - MALAKPET METRO FIRE ACCIDENT

హైదరాబాద్​లోని మలక్​పేట మెట్రో స్టేషన్​ వద్ద అగ్ని ప్రమాదం - దట్టంగా వ్యాపించిన పొగతో ఇబ్బంది పడ్డ మెట్రో ప్రయాణికులు

MALAKPET METRO FIRE ACCIDENT
MALAKPET METRO FIRE ACCIDENT (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 6, 2024, 4:40 PM IST

Updated : Dec 6, 2024, 6:10 PM IST

Fire Accident at Malakpet Metro Station : హైదరాబాద్​లోని మలక్​పేట మెట్రో స్టేషన్​ వద్ద అగ్ని ప్రమాదం సంభవించింది. మెట్రో స్టేషన్​ వద్ద వాహనాలకు మంటలు అంటుకున్నాయి. వాహనాలకు మంటలు అంటుకుని పొగ భారీగా వ్యాపించింది. దట్టంగా అలముకున్న పొగతో మెట్రో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. మలక్​పేట మెట్రో స్టేషన్​ వద్ద పార్కు చేసిన 5 బైకులు దగ్ధమయ్యాయి. మలక్​పేట మెట్రో పిల్లర్​ నెంబర్​ 1409 వద్ద ఈ అగ్ని ప్రమాదం జరిగింది. బైకులు తగలబడుతుండటంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ అగ్ని ప్రమాదంతో మలక్​పేట-దిల్​సుఖ్​నగర్​ మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అలాగే చాదర్​ఘాట్​ నుంచి మలక్​పేటకు వెళ్లే వాహనదారులు ట్రాఫిక్​తో ఇబ్బంది పడ్డారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మంటలకు గల కారణాలను పరిశీలిస్తున్నారు.

బైకులలో కొందరు పెట్రోల్​ చోరీ చేస్తుంటారు : ఇలా అక్రమ పార్కింగ్​ వద్ద బైక్​లలో కొందరు పెట్రోల్​ చోరీ చేస్తుంటారని, అది కూడా ప్రమాదానికి కారణం కావచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. పోలీసులు సీసీ కెమెరాల ద్వారా దర్యాప్తు చేస్తున్నారు.

27 గంటలు - వందల సంఖ్యలో వాటర్​ ట్యాంకర్లు - జీడిమెట్లలో ఇంకా అదుపులోకి రాని మంటలు

పెట్రోల్ పోస్తుండగా నిప్పంటించిన ఆకతాయిలు - ఆ తరువాత ఏమైందంటే?

Last Updated : Dec 6, 2024, 6:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.