ETV Bharat / state

వాట్సాప్​లో ఫొటోలు డిలీట్​ చేశారని - ఇద్దరు యువకుల దారుణ హత్య - DOUBLE MURDER IN KADTHAL VILLA - DOUBLE MURDER IN KADTHAL VILLA

Two People Murder in Ranga Reddy : వాట్సాప్​లో ఫొటోలు డిలీట్​ చేశారని ఏకంకా ఇద్దరి యువకులను కత్తులతో నరికి చంపారు కొందరువ్యక్తులు. పక్కా ప్లాన్​ ప్రకారం ఈ తతంగమంతా నడిపించారు. ముందుగా మందు తాగించి, ఆ తర్వాత గొడవ పెట్టుకుని మరీ అతి కిరాతకంగా చంపేశారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కడ్తాల్​లో జరిగింది.

Two People Killed for Deleting Photos on WhatsApp
Two People Killed for Deleting Photos on WhatsApp (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 7, 2024, 12:08 PM IST

Two People Killed for Deleting Photos on WhatsApp : వాట్సాప్​లో ఫొటోలు తొలగించారనే నెపంతో పాటు వ్యక్తిగత కక్షల కారణంగా ఇద్దరు యువకులను హత్య చేయడం కలకలం రేపింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కడ్తాల్​లోని ఓ విల్లాలో బుధవారం రాత్రి జరిగింది. మృతుడి సోదరుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆరుగురిని అరెస్టు చేసినట్లు సమాచారం. కడ్తాల్​ పోలీస్​ స్టేషన్​కు చేరుకొని మృతుల కుటుంబ సభ్యులు నిందితులను అరెస్టు చేయాలంటూ హైదరాబాద్​-శ్రీశైలం జాతీయ రహదారిపై ధర్నా చేశారు. కాసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.

పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం : రంగారెడ్డి జిల్లా కడ్తాల్​ మండలం గోవిందాయపల్లికి చెందిన శేషుగారి శివగౌడ్​ కారు డ్రైవర్​గా పనిచేస్తున్నాడు. మరోవైపు గుండెమోని శివగౌడ్​ హైదరాబాద్​లోని ఒక చికెన్​ దుకాణంలో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వారు అప్పుడప్పుడు స్వగ్రామానికి వెళ్లేవారు. అయితే వీరిద్దరికి అదే గ్రామానికి చెందిన బీజేపీ నేత జల్కం రవి సహా కొందరితో వ్యక్తిగత విభేదాలుండేవి. జల్కం రవి స్థిరాస్తి వ్యాపారం చేసేవాడు. ఆయన వ్యాపారం కోసం కడ్తాల్​లోని బటర్​ ఫ్లై సిటీలో ఓ విల్లాను అద్దెకు తీసుకున్నాడు.

Two People Killed for Deleting Photos on WhatsApp
శేషుగారి శివగౌడ్‌, గుండెమోని శివగౌడ్‌ (ETV Bharat)

ఈ క్రమంలో జూన్​ 4వ తేదీన రవి పుట్టినరోజు కావడంతో స్థానిక బీజేపీ నాయకులు, మిత్రులతో కలిసి విల్లాలోనే వేడుకలు చేసుకున్నారు. వేడుకల్లో దిగిన ఫొటోలను, పేర్లను వాట్సాప్​ గ్రూపుల్లో పోస్ట్​ చేశారు. ఇదే గ్రూపునకు అడ్మిన్​గా ఉన్న శేషుగారి శివగౌడు, గుండెమోని శివగౌడు ఆ ఫొటోలను డిలీట్​ చేశారు. అప్పటికే వీరితో కక్ష పెంచుకున్న జల్కం రవి ఇద్దరు శివలు తమ ఫొటోలు డిలీడ్ చేయడంతో మరింత ఆగ్రహానికి లోనయ్యాడు. ఈ క్రమంలోనే ఎలాగైనా వారిని చంపాలని సన్నిహితులతో కలిసి ప్లాన్​ వేశాడు. ఈ పథకంలో భాగంగా వారిద్దరిని హైదరాబాద్​ నుంచి బుధవారం కడ్తాల్​లోని విల్లాకు రప్పించాడు.

కత్తులతో ఇద్దరి యువకులపై దాడి : ఆ విల్లాలోనే వీరిద్దరితో పాటు తన స్నేహితులతో కలిసి మద్యం సేవించారు. తాగిన మత్తులో ఉన్న సమయంలో వాట్సాప్​లో ఫొటోలు డిలీట్​ చేసిన వ్యవహారం ప్రస్తావనకు వచ్చింది. దీంతో ఇద్దరితో మిగిలినవారంతా వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ముందుగా ప్లాన్​ చేసుకున్నట్లు వారి వెంట తెచ్చుకున్న కత్తులతో రవి తన స్నేహితులతో కలిసి ఇద్దరినీ హతమార్చాడు. తన సోదరుడు ఇంటికి రాకపోవడంతో మృతుల్లో ఒకరి సోదరుడు కరుణాకర్ విల్లాకు వెళ్లి చూశాడు. అక్కడ రక్తపు మడుగులో ఇద్దరి మృతదేహాలు కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు.

ఫ్రెండ్​ సోదరి దగ్గర రూ.2000 చోరీ- తిరిగి ఇవ్వాలని అడిగినందుకు దారుణ హత్య! - Student Murder Case In Bengaluru

వరంగల్​ జిల్లాలో దారుణం - భూ తగాదాలతో అన్నదమ్ముల దారుణ హత్య - Bothers killed In Warangal

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.