ETV Bharat / state

మదనపల్లెలో ఘోరం - ప్రియుల మోజులో కన్న తండ్రినే కడతేర్చిన కసాయి కుమార్తె - Madanapalle Father Murder Incident - MADANAPALLE FATHER MURDER INCIDENT

Daughter Kill Father In MAdanapalle : ఇష్టం లేని పెళ్లి చేసుకోమంటున్నారన్న కోపంతో కన్నతండ్రిపైనే దాడి చేసి కడతేర్చింది ఆ కుమార్తె. తన తండ్రి కాలుజారి కింద పడటంతో గాయాలయ్యాయని నమ్నించే ప్రయత్నం చేసింది. పోలీసులు రంగంలోకి దిగడంతో ఆమె గుట్టు బయటపడింది. ఏపీలోని అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఈ దారుణం చేటుచేసుకుంది.

Madanapalle Murder Issue
Daughter Kill His Father in Marriage Issue (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 18, 2024, 3:37 PM IST

Updated : Jun 22, 2024, 9:14 PM IST

Daughter Kill His Father in Marriage Issue : తనను ఇష్టం లేని పెళ్లి చేసుకోమంటున్నారన్న కోపంతో కన్న తండ్రినే హత్య చేసింది ఆ కుమార్తె. ఈ ఘటన ఈ నెల 13న అంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా మదనపల్లెలో చోటుచేసుకుంది. ఈ హత్య కేసు వివరాలను డీఎస్పీ ప్రసాదరెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు.

మదనపల్లె పీఅండ్‌టీ కాలనీకి చెందిన దొరస్వామి (62) దిగువ కురవంకలోని ప్రాథమికోన్నత పాఠశాలలో టీచర్‌గా పని చేస్తున్నారు. ఆయన భార్య లత ఏడాదిన్నర కిందట అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో బీఎస్సీ, బీఈడీ చదివిన తమ ఏకైక కుమార్తె హరితతో కలిసి సొంతింట్లో ఉంటున్న దొరస్వామి కుమార్తె వివాహం కోసం దాచిన మొత్తాన్ని ఆమె బ్యాంకు ఖాతాలోనే జమ చేశారు.

ప్రియుల మోజులో కన్న తండ్రినే కడతేర్చిన కసాయి : తల్లి నగలను సైతం ఆమెకే అప్పగించారు. ఈ నేపథ్యంలో హరిత మదనపల్లెకు చెందిన రమేశ్‌తో సన్నిహితంగా ఉంటూ అతనికి తన బంగారు ఆభరణాలు అప్పగించింది. అతను వాటిని తాకట్టు పెట్టి రూ.11.40 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. రమేశ్‌తో పాటు సాయికృష్ణ అనే మరో యువకుడికి రూ.8లక్షలు ఇచ్చిన హరిత, ఆ ఇద్దరు యువకులు మాత్రమే గాకుండా హరీశ్‌రెడ్డి అనే మరో వ్యక్తితోనూ సన్నిహితంగా ఉంటోంది అని డీఎస్పీ ప్రసాదరెడ్డి తెలిపారు.

ఇరుగుపొరుగు వాళ్ల ద్వారా కూతురు వ్యవహారాలు తెలుసుకున్న హరిత తండ్రి దొరస్వామి ఆమెకు మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. వివాహానికి హరిత నిరాకరించగా ఈ విషయమై నెల రోజులుగా తండ్రీ, కుమార్తెల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈ నెల 13న క్షణికావేశానికి గురైన హరిత ఇంట్లోని చపాతీ కర్ర, పరీక్షలు రాసే అట్ట, తాళంకప్ప, కర్రతో విచక్షణా రహితంగా తండ్రి దొరస్వామి తలపై దాడి చేసిందని, తీవ్రగాయాల పాలైన ఆయన మృతి చెందారని డీఎస్పీ వెల్లడించారు.

Madanapalle Father Murder Incident : అరుపులు విని చుట్టుపక్కల వారు వెళ్లి చూడగా, దొరస్వామి రక్తపు మడుగులో పడి ఉన్నాడు. తన తండ్రి కాలుజారి కింద పడటంతో గాయాలపాలయ్యారని హరిత వారికి చెప్పడం గమనార్హం. తరువాత పోలీసులకూ అదే విషయాన్ని తెలిపింది. పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు చేసి హరితే హత్య చేసినట్లుగా నిర్ధారించారు. నిందితురాలిని సోమవారం అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.

కుమార్తెపై అత్యాచారం - కేసు పెట్టాడని తండ్రిపై పగ - బెయిల్​పై వచ్చీరాగానే!

నిజామాబాద్​లో దారుణం - నాలుగేళ్ల కుమార్తె గొంతు నులిమి చంపిన తండ్రి - man Killed Daughter in Nizamabad

Last Updated : Jun 22, 2024, 9:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.