Father Attempted suicide With Three Children in Abdullapurmet : అబ్దుల్లా పూర్మెట్ పీఎస్ పరిధిలోని ఇమామ్‌గూడా చెరువులోకి ఓ కారు దూసుకెళ్లింది. కారు నీట మునగడం గుర్తించిన స్థానికులు అప్రమత్తమై ప్రాణాలకు తెగించి వారిని కాపాడారు. ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలతో బీఎన్‌రెడ్డినగర్ వాసి అశోక్ ముగ్గురు పిల్లలతో కలిసి కారులో వెళ్తూ ఇనాంగూడ చెరువులోకి మళ్లించాడు. బీఎన్‌రెడ్డి నగర్‌లో కాంట్రాక్టర్‌గా చేస్తున్న అశోక్ ఉదయపు నడక కోసం ముగ్గురు పిల్లలను తీసుకువచ్చాడు. ఈ క్రమంలోనే బలవన్మరణానికి యత్నించాడు.
పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం : బుధవారం ఉదయం అబ్దుల్లాపూర్‌మెట్‌లోని ఇమామ్ గూడా చెరువులోకి కారు దూసుకెళ్లడాన్ని స్థానికులు గుర్తించారు. అందులో ఉన్న నలుగురు నీట మునిగిపోవడం గుర్తించిన స్థానికులు వెంటనే స్పందించారు. అందుబాటులో ఉన్న ట్యూబులు, తాళ్ల సాయంతో చెరువులోకి వెళ్లారు. కారు డ్రైవర్‌తో పాటు ముగ్గురు పిల్లల్ని కాపాడారు. వారిని బయటకు తీసుకు వచ్చిన తర్వాత విషయం తెలిసి షాక్ అయ్యారు. ఆత్మహత్య చేసుకోడానికి చెరువులోకి కారును పోనిచ్చినట్టు ఆ పిల్లల తండ్రి చెప్పడంతో అవాక్కయ్యారు.
భార్యతో విభేదాలు : భార్యతో ఉన్న విభేదాల నేపథ్యంలో పదేళ్లలోపు వయసు ఉన్న ముగ్గురు పిల్లల్ని చంపి తాను చనిపోవాలని భావించిన వ్యక్తి కారుతో సహా చెరువులోకి నడిపినట్టు తెలిపాడని స్థానికులు చెప్పారు. భార్య తన మాట వినడం లేదనే కోపంతో ఆఘాయిత్యానికి పాల్పడాలనుకున్నట్లు తెలిపారు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
తండ్రితోపాటు పదేళ్లలోపు వయసున్న ముగ్గురు చిన్నారులు కారులో ఉన్నారు. పోలీసులు వచ్చేలోగా స్థానికులు ఒక బాలుడు, ఇద్దరు బాలికల్ని ప్రాణాలతో కాపాడారు. ఆ తర్వాత అతణ్ని కూడా రక్షించారు. తండ్రి వెంట కారులో వచ్చిన చిన్నారులు ప్రాణభయంతో కొంతసేపు విలవిలలాడారు. స్థానికులు వేగంగా స్పందించడంతో ప్రాణాలు నిలిచాయి. ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన వ్యక్తిని అబ్దుల్లాపూర్‌మెట్టు పోలీసులు ప్రశ్నించారు. కౌన్సిలింగ్ ఇచ్చేందుకు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రాణాలకు తెగించి కాపాడిన యువకులను పోలీసులు అభినందించారు.
"8 గంటల సమయంలో కారు ఒక్కసారిగా చెరువులోకి దూసుకెళ్లింది. కారు మొత్తం మునిగిపోయింది. దీంతో ముగ్గురు పిల్లలు, తండ్రి కారు పైన కూర్చొని ఉన్నారు. వెంటనే ట్యూబులు, తాళ్ల సాయంతో చెరువులోకి వెళ్లాం. ఒక్కొక్కరిని ఒడ్డుకు తీసుకొని వచ్చి కాపాడాం. " -స్థానికులు
మద్యం మత్తులో చెట్టును ఢీకొని ఇంజినీరింగ్ స్టూడెంట్ మృతి, మరో ఇద్దరికి గాయాలు
ముగ్గురి ప్రాణాలను బలిగొన్న గుంత - మహబూబాబాద్ జిల్లాలో ఘటన - 3 Killed in Auto and Car Collision