ETV Bharat / state

గత ప్రభుత్వం వైఫల్యం - విత్తనాలు, ఎరువులు అందుబాటులో లేక రైతుల ఇబ్బందులు - Farmers Difficulties Kharif Season - FARMERS DIFFICULTIES KHARIF SEASON

Farmers Difficulties Due to Lack of Availability Seeds and Fertilizers in Kharif Season : రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాల ప్రవేశంతో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. త్వరలోనే రైతులు నారు మడుల్లోకి అడుగుపెట్టనున్నారు. గత ప్రభుత్వం ఖరీఫ్​కు సన్నద్ధం చేయకపోవడంతో విత్తనాలు, ఎరువులు అందుబాటులో లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు

farmers_problems_kharif
farmers_problems_kharif (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 12, 2024, 8:49 AM IST

గత ప్రభుత్వం వైఫల్యం - విత్తనాలు, ఎరువులు అందుబాటులో లేక రైతుల ఇబ్బందులు (ETV Bharat)

Farmers Difficulties Due to Lack of Availability Seeds and Fertilizers in Kharif Season : ఖరీఫ్‌కు సన్నద్ధం చేయకుండా గత ప్రభుత్వం చేసిన తాత్సారం రైతుల్లో ఆందోళన పెంచుతోంది. తొలకరి చినుకులు కురిసి రైతులు నారు మడుల్లోకి అడుగుపెట్టనున్న తరుణంలో విత్తనాలు, ఎరువులు అందుబాటులో లేకుండా పోయాయి. సాగునీటి కాలువల్లో పూడిక కూడా పూర్తి స్థాయిలో తీయకపోవడంతో దిక్కుతోచని స్థితిలో రైతాన్నలు ఉన్నారు.

వర్షాలు కురుస్తుండటంతో ఇప్పటికే రాష్ట్రంలో పలు చోట్ల రైతులు విత్తనాలు చల్లుతున్నారు. అక్కడికి 3 వారాలు పూర్తవ్వగానే దుక్కులు ప్రారంభమవుతాయి. గత సంవత్సరం వానల్లేక సీజన్ అస్తవ్యస్తంగా నడిచింది. పంటల సాగు విస్తీర్ణం తగ్గిపోగా, పంట వేసిన రైతులు నష్టపోయారు. ఈ ఏటా రుతుపవనాలు కొంచెం ముందుగా పలకరించడంతో రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. సరిగ్గా ఈ సమయంలో విత్తనాల సమస్య తలెత్తి రైతుల్లో ఆందోళన నెలకొంది. ఎన్నికల హడావుడి నెలకొన్న తరుణంలో అధికార యంత్రాంగం ఖరీఫ్‌కి అవసరమైన ఏర్పాటు చేయడంలో విఫలమయ్యిందని రైతు సంఘాల ప్రతినిధులు విమర్శిస్తున్నారు. సబ్సిడీ విత్తనాల సేకరణ సజావుగా జరగలేదంటున్నారు. వేరుశనగ విత్తనాలు నాసిరకంగా ఉన్నాయని మండిపడుతున్నారు.

పత్తి విత్తనాల కొరత - ఈ ఏడాది 'సాగే'దెలా? - వ్యాపారులతో కుమ్మక్కై అధిక ధరలకు విక్రయాలు - Shortage of Cotton Seeds to Farmers

" ఖరిఫ్​ సీజన్​ ప్రారంభమైన రైతులకు అవసరమైన విత్తనాలు ఇంకా అందలేదు. ఆర్బీకే సెంటర్​ ద్వారా రైతులకు అవసరమైన విత్తనాలు అందుబాటులో ఉన్నాయని గత ప్రభుత్వం ప్రకటించారు. కానీ అక్కడ సరిపడా విత్తనాలు అందుబాలులో లేవు "రాధాకృష్ణ, ఏపీ రైతు సంఘం నాయకుడు

బత్తాయి వ్యాపారుల బడా మోసం- ధర ఉన్నా నాణ్యత సాకుతో కోతలు - Mosambi Farmers Low Price

గత ఏడాది రాయలసీమ ప్రాంతాల్లో కరువు తాండవించింది. మిగతా జిల్లాల్లోనూ కరువు పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం తగ్గింది. ఈ ఏడాది వర్షాలు భారీగా కురుస్తాయని నిపుణులు చెబుతున్నారు. పంటలు బాగా పండాలంటే వర్షాలు కురవడంతో పాటు పంటలకు అవసరమైన సమయంలో సాగునీటిని అందించడం రెండూ ప్రధానమే. సాగునీరు సరఫరా సజావుగా సాగాలంటే కాలువల్లో పూడికను తీయాలి. ఇప్పటికే ఈ పని పూర్తి చేయాల్సి ఉండగా గత ప్రభుత్వం ఆ దిశగా ఖరీఫ్‌కి సన్నద్ధం అవ్వలేదు. సాగునీటి సరఫరా కాలువల మరమ్మత్తు పనులు చేపట్టడంలో నిర్లక్ష్యం ప్రదర్శించారు. కొత్త ప్రభుత్వం విత్తనాలు, ఎరువులు సరఫరా చేయాలని రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు.

ముందస్తు వర్షాలతో అన్నదాత ఆనందం - సాగులో సింహభాగం వేరుశనగదే - GROUDNUT FARMERS HAPPY

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.