Farmers Facing Problems on Taking a Agricultural Loans : వ్యవసాయ రుణాల రెన్యువల్ సమయం దగ్గర పడటంతో రైతులు ఆ పక్రియను పూర్తి చేసుకునే ప్రయత్నంలో కొత్త సమస్యలను ఎదుర్కొంటున్నారు. రైతుల పొలాలకు సంబంధించిన 1బీ, అడంగల్ పత్రాలు ఆన్ లైన్లో రాకపోవడంతో అన్నదాతలు ఆందోళనలో పడుతున్నారు. ఏం చేయాలో అర్థం కాక అధికారుల నిర్వాకంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంబంధిత పత్రాలపై రెవెన్యూ అధికారి సంతకం లేకపోతే బ్యాంకులు రుణాలు ఇవ్వాటం లేదు. అలాగే మరికొన్ని గ్రామాల్లో భూ సర్వే కారణంగా సరైన వివరాలు నమోదు కావటం లేదు. దీంతో తిండి, తిప్పలు మాని గంటల కొద్దీ కార్యాలయాల వద్ద నిరీక్షిస్తుమని రైతులు వాపోతున్నారు. జిల్లా ఉన్నతాధికారులు ఈ సమస్యను గుర్తించి స్థానిక తహశీల్దార్లు భూపత్రాలు జారీ చేసే దిశగా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.
సాగునీటి కోసం కావలి నియోజకవర్గ రైతుల ఇబ్బందులు, కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చిన టీడీపీ నేతలు
అనంతపురం జిల్లా ఉరవకొండ, విడపనకల్లు మండలాల రెవెన్యూ అధికారులు కార్యాలయాల్లో అందుబాటులో ఉండటం లేదని రైతులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల కోసం రోజంతా కార్యాలయాల వద్ద నిరీక్షిస్తుమని తెలిపారు. ఏడాదిలోగా రుణాన్ని నవీకరించకపోతే ప్రభుత్వం అందించే పలు రాయితీలు వర్తించవన్నారు. ఉన్నతాధికారులు ఈ సమస్యను గుర్తించి తొందరగా భూపత్రాలు జారీ చేసే విధంగా చర్యలు చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
పంట రుణాలు తీసుకునేందుకు సిద్ధమవుతున్న రైతులు : కొద్ది రోజుల్లో వేసవి కాలం పూర్తయి వర్షకాలం మెుదలౌతున్న సమయంలో పంటలను సాగుచేసేందుకు రైతులు సిద్ధమౌతున్నారు. పంటల పెట్టుబడి కోసం రుణాన్ని తీసుకునేందుకు బ్యాంకులను వెళుతున్నారు. అయితే రైతుల పొలాలకు సంబంధించిన 1బీ, అడంగల్ పత్రాలు ఆన్ లైన్లో సరిగా రావడం లేదు. కొన్ని గ్రామాల్లో భూ సర్వే కారణంగా వాటిలో సరైన వివరాలు నమోదు కాలేదు. మరికొన్ని గ్రామాల్లో ఆ పత్రాలు ఆన్ లైన్లో లభించడం కష్టంగా మారింది. రైతుల వద్ద ఉన్న పత్రాల ఆధారంగా రెవెన్యూ అధికారులు ధ్రువీకరిస్తే అప్పుడు బ్యాంకు అధికారులు రుణాలను నవీకరిస్తారు.
అధికారులు ఎన్నికల విధులకు వెళ్లడంతో రైతులకు అవస్థలు : అనంతపురం జిల్లా ఉరవకొండ, విడపనకల్లు మండలాల్లో రెవెన్యూ అధికారులు కార్యాలయాల్లో అందుబాటులో ఉండడం లేదు. రైతులు గంటల కొద్దీ ఆ కార్యాలయాల వద్ద నిరీక్షిస్తున్నారు. తిప్పలు పడి రైతులు తమ గ్రామాల వీఆర్వోల వద్ద ధ్రువ పత్రాలను రాయించుకుని వచ్చిన అధికారులు లేకపోవడంతో వెనుతిరుగుతున్నారు. ఉన్న అధికారులు సైతం ఎన్నికల విధుల సాకు చెప్పి వివరాలను ధ్రువీకరిస్తూ సంతకాలు చేయలేమని రైతులను వెనక్కి పంపుతున్నారు. ఎన్నికల విధులలో భాగంగా వచ్చినా తహసీల్దార్లుగా వాటిని ధ్రువీకరించడానికి అవకాశాం ఉంది. అయినప్పటికి వారు చొరవ చూపని దాఖలాలు నెలకొన్నాయి.
సమస్యను గుర్తించి పరిష్కరించాలని రైతన్నలు విజ్ఞప్తి : ఏడాదిలోగా రుణాన్ని నవీకరించకపోతే ప్రభుత్వం అందించే పలు రాయితీలు వర్తించవు. దీంతో రైతులు నష్టపోయే అవకాశం ఉంది. ఎన్నికల ప్రక్రియ ముగిసి, శాశ్వత తహశీల్దార్లు రావాలంటే కనీసం మరో రెండు నెలల సమయం పడుతుంది. అప్పటి వరకు రైతులకు 1బీ, అడంగల్స్ జారీ కాకపోతే రుణాలు నష్టపోయే అవకాశం ఉంది. అలాగే ఉరవకొండ తహశీల్దారు కార్యాలయం వద్ద వీఆర్వోల గదిలో ఎన్నికలకు సంబంధించిన సామాగ్రి ఉందంటూ ఆ భవనానికి తాళాలు వేశారు. దీంతో వీఆర్వోలు ఎక్కడ ఉంటారో తెలియక, వారి కోసం వచ్చే రైతులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా ఉన్నతాధికారులు ఈ సమస్యను గుర్తించి స్థానిక తహశీల్దార్లు భూపత్రాలు జారీ చేసే దిశగా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.
రైతులను దోచుకుంటున్న దళారులతో ఉల్లి సాగుకు మద్దతు ధర కరవు
"మూడేళ్లకోసారి చేతికచ్చే పంట - గిట్టుబాటు ధర లేక నష్టపోతున్నాం"