ETV Bharat / state

ధరలు పెరగడంతో తగ్గిన కొనుగోళ్లు - కుళ్లిపోతున్న కూరగాయలు - రోజుకు రూ.2 కోట్లకు పైగా నష్టాలు - Vegetable prices in Telangana

Vegetable Prices In Telangana : రాష్ట్రవ్యాప్తంగా కూరగాయల ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ధరల పెరుగుదలతో వినియోగదారులు కొనుగోళ్లపై ఆసక్తి చూపించడం లేదు. దీంతో రోజు మార్కెట్​కు వచ్చిన కూరగాయల్లో కేవలం 60 శాతం మాత్రమే అమ్మాకాలు జరుగుతున్నాయి. మిగతా 40 శాతం నిల్వలు మిగిలిపోతున్నాయి. పెరిగిన ధరల కారణంగా రైతులతో పాటుగా వ్యాపారులు నష్టపోతున్నారు.

Vegetable prices in Telangana
Vegetable prices in Telangana (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 29, 2024, 7:09 AM IST

Vegetables Prices In Rythu Bazar : తెలంగాణలో కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కొనుగోళ్లు గణనీయంగా తగ్గుతున్నాయి. ప్రతిరోజూ 40 శాతం మేరకు కూరగాయల నిల్వలు మిగిలిపోతున్నాయి. ఎక్కువ అధికశాతం కుళ్లిపోతుండటంతో వ్యాపారులుకు కూరగాయలను పారబోస్తున్నారు. రోజుకు రూ.2 కోట్లకు పైగా నష్టం వాటిల్లుతున్నట్లు అంచనా. గత రెండు నెలలుగా రాష్ట్రంలో కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. టమాటా, చిక్కుడు లాంటి కూరగాయల ధరలు కిలో రూ.వంద దాటాయి. బీన్స్, పచ్చిమిర్చి రూ.150 వరకు చేరాయి. బెండ, వంకాయ, దొండ తదితర కూరగాయల ధరలు.50 దాటిపోయాయి.

తెలంగాణలో కూరగాయల సాగు ఆలస్యం అయ్యింది. దీంతో అధిక శాతం సరుకు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. అందువల్ల రవాణా ఛార్జీలు, గుత్తేదారుల లాభాలు వంటివాటిని పరిగణనలోనికి తీసుకొని ధరలపై ప్రభావం పడుతుంది. చిరువ్యాపారులు వీటిని కొని విక్రయిస్తున్నారు. కూరగాయలు పండించే రైతులు కూడా అదే ధరలకు అమ్మకాలు జరుపుతున్నారు. తాను రైతుబజార్‌కు బీరకాయలు తెచ్చానని, స్థానికంగా ఉన్న ధర చెబితే వినియోగదారుల కొనడం లేదంటూ రైతు వాపోతున్నారు.

ధర తగ్గించి అమ్మాలంటే వ్యాపారులు ఒప్పుకోవడం లేదని రంగారెడ్డి జిల్లాకు చెందిన రైతు అనే శ్రీనివాస్‌ తన గోడువెల్లబోసుకున్నారు.ధరలు పెరిగినప్పటి నుంచి కొనుగోళ్లు పూర్తిగా తగ్గిపోయాయని తెలిపారు. తెచ్చిన కూరగాయలు తెచ్చినట్లే ఉండిపోతున్నాయని హైదరాబాద్‌ మోండా మార్కెట్‌ కు చెందిన ఓ చిరువ్యాపారి వెల్లడించారు. సాధారణ డిమాండును దృష్టిలో ఉంచుకుని ముందస్తుగా ఇచ్చిన ఆర్డర్ల ప్రకారం కూరగాయలు దిగుమతి అవుతున్నాయని తెలిపారు. కానీ అధిక ధరల వల్ల అమ్మకాలు తగ్గేసరికి నష్టపోతున్నామని వ్యాపారులు వాపోతున్నారు.

ఆ కూరగాయలను పచ్చిగా తింటున్నారా? ఆరోగ్యం డేంజర్​లో పడ్డట్టే! - Eating Raw Vegetables

హైదరాబాద్‌ మోండా మార్కెట్‌లో ధరల పెరుగుదలతో కూరగాయల కొనుగోళ్లపై ప్రభావం పడింది. ప్రధానంగా టమాటా అమ్మకాలు 55 శాతం మేరకు పడిపోయాయి. ఇతర కూరగాయల పరిస్థితీ అలాగే ఉంది. అమ్ముడుపోని కూరగాయలు రెండు రోజులు దాటితే పాడైపోతున్నాయి. దీంతో రైతులు, చిరువ్యాపారులు వాటిని రైతుబజార్లు, మార్కెట్లలోనే పడేస్తున్నారు. జులైలో వర్షాల కారణంగా కూరగాయల కొనుగోళ్లు మరింత తగ్గాయి. టమాటా, వంకాయ, బీర, కాలీఫ్లవర్, బెండ,కీర, క్యారెట్‌ వంటి కూరగాయలను పారేస్తున్నారు. దీంతో మార్కెట్లలో, రైతుబజార్లలో భారీగా వ్యర్థాలు పేరుకు పోతున్నాయి.

తెలంగాణలో జూన్‌ నెలలో 2,42,736 క్వింటాళ్ల కూరగాయలు రైతుబజార్ల వచ్చినట్లు అధికారులు తెలిపారు. 1,30,120 క్వింటాళ్ల విక్రయాలు మాత్రమే జరిగినట్లు పేర్కొన్నారు. ఇతర మార్కెట్లకు సుమారు 4.20 లక్షల క్వింటాళ్లు రాగా 1.20 లక్షల క్వింటాళ్ల కొనుగోళ్లు మాత్రమే జరిగాయని వెల్లడించారు. రైతు బజార్లకు 19,343 క్వింటాళ్ల టామాటాలు తీసుకురాగా 9,102 క్వింటాళ్ల అమ్మకాలు మాత్రమే జరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు.

జులై నెలలో ఇంతవరకు రైతుబజార్లకు 1,86,373 క్వింటాళ్ల కూరగాయలు వచ్చాయి. అందులో కేవలం 90 వేల క్వింటాళ్ల అమ్మకాలు మాత్రమే జరిగాయి. టమాటాలు 17,906 క్వింటాళ్లు రాగా, 10,220 క్వింటాళ్లు అమ్మారు. వంకాయలు 14,943 క్వింటాళ్లకు గాను 8,602, మిర్చి 8,526 క్వింటాళ్లకు గాను 3,502 క్వింటాళ్ల అమ్మకాలు మాత్రమే జరిగినట్లు మార్కెట్ లెక్కలు చెబుతున్నాయి.

కుళ్లిన మాంసం, బూజుపట్టిన కూరగాయలు - మెదక్​ హోటళ్లలో అవాక్కయ్యే నిజాలు - Food Inspections IN medak HOTELS

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.