Farmer Died in Elephant Attack in Komaram Bheem : తెలంగాణలో మొదటిసారి ఏనుగుల దాడిలో ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన జరిగింది. కుమురం భీం జిల్లా చింతలమానేపల్లి మండలంలో ఏనుగు బీభత్సం సృష్టించింది. రైతుపై దాడి చేయడంతో అక్కడికక్కడే అతను మృతి చెందాడు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన చింతలమానేపల్లి మండలంలోని అటవీ ప్రాంతం నుంచి ఓ ఏనుగు బూరేపల్లి గ్రామ శివారులోకి ప్రవేశించింది. అక్కడే ఉన్న మిర్చితోటలోకి ప్రవేశించిన ఏనుగు ఆ తోటలో పని చేస్తున్న అన్నూరి శంకర్ అనే రైతుపై దాడి చేసింది. ఈ దాడిలో రైతు శంకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే స్థానికులు అటవీశాఖ అధికారులకు, పోలీసులు సమాచారం అందించారు. గ్రామ శివారులోకి ఏనుగు రావడంతో స్థానికులందరూ భయాందోళనలకు గురయ్యారు. రైతు మృతి చెందడంలో అతని కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఇంకా ఈ విషయంపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Minister Konda Surekha Response on Elephant Attack : ఆసిఫాబాద్ జిల్లా కర్జెల్లి వద్ద ఏనుగు దాడిలో మృతిచెందిన అల్లూరి శంకర్ కుటుంబానికి అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ పది లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు పది లక్షల రూపాయలు మృతుడి కుటుంబానికి అందిస్తామన్నారు. ఘటనపై మంత్రి కొండా సురేఖ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
నిద్రపోతున్న వృద్ధురాలిపై ఏనుగు దాడి- వెంటనే పక్కింటికి వెళ్లి!
రైతు కూలీలపై ఏనుగు దాడి- త్రుటిలో తప్పించుకొన్న వ్యక్తి- లైవ్ వీడియో