ETV Bharat / state

'డార్లింగ్'​ను చూడాలంటూ - ప్రభాస్ ఇంటి వద్ద అభిమానుల ఆందోళన - FANS HUNGAMA AT PRABHAS RESIDENCE

హైదరాబాద్​లో ప్రభాస్ అభిమానుల హల్​చల్ - ప్రభాస్ బర్త్ డే సందర్భంగా కలవాలని ప్రయత్నించిన ఫ్యాన్స్ - అర్ధరాత్రి ప్రభాస్ ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించిన అభిమానులు - ప్రభాస్​ను కలవాలంటూ అభిమానులు రోడ్డుపై బైఠాయింపు

Prabhas Birth Day
Prabhas Birth Day (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 23, 2024, 1:04 PM IST

Updated : Oct 23, 2024, 2:15 PM IST

Prabhas Birthday 2024 : నార్మల్​గానే ప్రభాస్​ అభిమానులను సైలెంట్​గా ఉంచడం కష్టం. అదీ యంగ్​ రెబల్​ స్టార్​ బర్త్​ డే రోజున ఇంకా కష్టం. ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా వారం ముందు నుంచే సోషల్​ మీడియా వేదికగా రచ్చ రచ్చ చేస్తున్నారు. ఎక్కడ చూసిన పాన్​ ఇండియా స్టార్​ ప్రభాస్​ గురించే ట్రెండింగ్. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రభాస్​ బర్త్​డే(అక్టోబరు 23) రానే వచ్చింది.

ప్రభాస్​కు విషెస్​ చెప్పడానికి ఆయన అభిమానులు అర్ధరాత్రి 12 దాటిన తర్వాత భారీగా డార్లింగ్​ ఇంటి వద్దకు చేరుకున్నారు. తమ అభిమాన హీరో పుట్టిన రోజు సందర్భంగా కలవాలని ప్రయత్నించారు. అర్ధరాత్రి ప్రభాస్​ ఇంటి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోగా, ఆగ్రహించిన ఫ్యాన్స్​ ప్రభాస్​ను కలవాలంటూ రోడ్డుపైనే బైఠాయించారు. దీంతో చేసేదేమీ లేక ఆందోళనకు దిగిన వారందరినీ అక్కడ నుంచి చెదరగొట్టారు.

డార్లింగ్​ మూవీస్​ అప్​డేట్​ గురించి ఎదురుచూపులు : మరోవైపు డార్లింగ్​ బర్త్​ డే కావడంతో కొత్త మూవీస్​ గురించి ఏవైనా అప్​డేట్​ వస్తాయోమోనని అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. రాజా సాబ్​ గురించి ఇప్పటికే వచ్చే ఏడాది ఏప్రిల్​లో రిలీజ్​నని కన్​ఫార్మ్​ అయింది. మరి ఏదైనా కొత్త సినిమా అప్​డేట్​ ఇస్తారా లేక ఉన్నవాటి గురించే అప్​డేట్​ ఇస్తారానని వెయిట్​ చేస్తున్నారు.

బాహుబలి 1,2తో ప్రభాస్​.. ఇప్పుడు దేశం మొత్తం అభిమానులను సొంతం చేసుకున్నారు. అప్పటివరకు తెలుగు సినిమా గురించి ప్రపంచానికి, దేశానికే కొంతే తెలిసిన బాహుబలితో యావత్​ ప్రపంచం చూపు మొత్తం తెలుగు సినిమాపై పడింది. బాహుబలి 1,2తో కలిపి రూ.1000 కోట్లు క్లబ్​లోకి అడుగుపెట్టిన రెబల్​ స్టార్​ ప్రభాస్​. ఆ తర్వాత సాహో, రాధేశ్యామ్​, ఆదిపురుష్​తో వరుస సినిమాలు చేసిన అవి బాక్సాఫీసు వద్ద రాణించలేదు.

ఈ క్రమంలో ప్లాప్​ మూవీస్​ తర్వాత వచ్చిన సలార్​తో ప్రభాస్​ మళ్లీ విజయాల బాట పట్టాడు. సినిమా థియేటర్లలలో ఆడితే రూ.1000 కోట్లు అన్నట్లు సాగింది డార్లింగ్​ మానియా. ఆ తర్వాత వచ్చిన కల్కీ సైతం ఇదే రేంజ్​లో ఆడి మరో రూ.1000 కోట్లను తీసుకొచ్చింది. దీంతో ఒక్కసారిగా ప్రభాస్​పై భారీ అంచనాలు పెరిగి పాన్​ ఇండియా స్టార్​ అయిపోయారు. దీంతో అభిమానులు ప్రభాస్​ సినిమా రిలీజ్​ అయిందంటే అది కచ్చితంగా రూ.1000 కోట్లు కలెక్షన్స్​ రాబడుతుందని అభిప్రాయానికి వచ్చారు. ఇప్పుడు వచ్చే సినిమాలు అన్నింటిపై అభిమానులు ఎక్కువగానే ఆశలు పెట్టుకున్నారు. మరి ఆ సినిమాలు అన్నీ మంచిగా విజయాలను సాధించాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్​డే యంగ్​ రెబల్​ స్టార్​ ప్రభాస్.

ఈటీవీ విన్ స్పెషల్ షోలో బర్త్​డే బాయ్ ప్రభాస్ - ఈ కోడ్ ఉపయోగిస్తే డిస్కౌంట్​తో చూసేయొచ్చు!

'రాజాసాబ్' న్యూ పోస్టర్- డార్లింగ్ శ్వాగ్ లుక్ అదిరిపోయిందిగా

Last Updated : Oct 23, 2024, 2:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.