Fake Essential Products in Hyderabad : కాదేదీ కల్తీకి అనర్హం అన్నట్టు పరిస్థితిని బట్టి అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. కల్తీ దందా నిర్వహిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. తాజాగా రాజస్థాన్, బిహార్‌కు చెందిన నిందితులు ప్రముఖ కంపెనీలకు చెందిన వస్తువులను నకిలీగా తయారు చేసి హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో అమ్ముతూ దొరికిపోయారు. కంపెనీలు ఇచ్చిన ధర కంటే తక్కువ ధరకు ఉండటంతో ఎక్కువ లాభాలు వస్తుందని భావిస్తున్న డిస్ట్రిబ్యూటర్స్ వీటిని కిరాణా షాపుల్లో అమ్ముతున్నారు.
Hyderabad Police Arrested Selling Fake Goods Gang : సామాన్య జనాలు గుర్తు పట్టలేనంతగా ఉండటంతో రెండేళ్లుగా నకిలీ వ్యాపారం చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. పక్కా సమాచారంతో రావడంతో వీటిని తయారు చేస్తున్న నాగారం, కాటేదాన్‌లో ఉన్న తయారీ కేంద్రాలపై సోదాలు జరిపి నకిలీ వస్తువులను తయారు చేయడానికి ఉపయోగించే పరికరాలను సీజ్ చేశారు.
3 ఎకరాలు విక్రయం.. 30 లక్షలు ఖర్చు.. ఆహార కల్తీపై అలుపెరుగని పోరాటం
రెడ్ లేబుల్, బ్రూక్ బ్రాండ్ టీ పౌడర్స్, హార్పిక్, లైజాల్, పారచూట్ హెయిర్ ఆయిల్, ఎవరెస్ట్ మసాలా సర్ఫ్ ఎక్సల్ లాంటి బ్రాండెడ్ ప్రోడక్ట్స్ లేబుల్స్ వేసి హానికరమైన రసాయనాలతో తయారు చేసిన ఉత్పత్తుల్ని మార్కెట్లో అమ్ముతున్నట్లు పోలీసుల విచారణలో తేల్చారు. నాగారం, కాటేదాన్‌లో ఉన్న తయారీ కేంద్రాలపై సోదాలు జరిపి దాదాపు రెండు కోట్ల విలువైన నకిలీ వస్తువులను (Fake Products)స్వాధీనం చేసుకున్నామని ఈస్ట్ జోన్ డీసీపీ గిరిధర్ తెలిపారు. నిందితులంతా బీహార్, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన వారని చెప్పారు. వీరిపైనా గతంలో పలు కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. ఈ కేసులో ముగ్గురి నిందితులను అరెస్ట్ చేశామని, మరో ముగ్గురు పరారీలో ఉన్నారని డీసీపీ గిరిధర్ వివరించారు.
"ఈ కేసులో మహేంద్రసింగ్ ప్రధాన నిందితుడు. అతడు తన అనుచరులతో ప్రముఖ కంపెనీలకు చెందిన నిత్యావసరాల వస్తువులకు నకిలీవి తయారీ చేసి విక్రయిస్తున్నాడు. తద్వారా లాభాలను గడిస్తున్నాడు. పక్కా సమాచారం మేరకు పక్కా సమాచారంతో రావడంతో వీటిని తయారు చేస్తున్న నాగారం, కాటేదాన్‌లో ఉన్న తయారీ కేంద్రాలపై సోదాలు జరిపి నకిలీ వస్తువులను స్వాధీనం చేసుకున్నాం. వీటి విలువ రెండు కోట్లు ఉంటుంది." - గిరిధర్, ఈస్ట్ జోన్ డీసీపీ
Police Caught Fake Essential Products : ఈ నకిలీ నిత్యావసరాల వస్తువులను (Necessary Goods )నగర శివారు ప్రాంతాల్లో ఎక్కువగా విక్రయిస్తున్నట్లు గుర్తించామని టాస్క్ ఫోర్స్ డీసీపీ రష్మి పెరుమాల్ వివరించారు. హైదరాబాద్ మొత్తం వీరికి నెట్‌వర్క్ ఉందన్నారు. ఇతర రాష్ట్రాలకు కూడా ఈ ఉత్పత్తుల్ని సరఫరా చేస్తున్నారా? అనే అంశాలపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్, కిరాణా దుకాణదారులు డూప్లికేట్ ప్రొడక్ట్స్ గురించి తెలిసి కూడా ప్రజలకు అమ్ముతున్నారని రష్మి పెరుమాల్ వివరించారు. ప్రజలంతా నిత్యావసర వస్తువుల గురించి జాగ్రత్తగా ఉండాలని పోలీసులు కోరారు. నకిలీ వస్తువులను గుర్తిస్తే వెంటనే తమకు సమాచారమివ్వాలని విజ్ఞప్తి చేశారు.
Food Adulteration In Hyderabad : కెమికల్స్‌తో అల్లం వెల్లుల్లి పేస్ట్.. కాటేదాన్‌లో కల్తీ దందా