Fake CID Officers Arrest in Hyderabad : ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలుకు చెందిన ఓ ఎస్ఐతో పాటు తొమ్మిది మంది నకిలీ సీఐడీ(Fake CID) అవతారమెత్తి కటకటాలపాలయ్యారు. హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో(IT Corridor) సీఐడీ అధికారులమంటూ హల్చల్ చేసి ఓ ఐటీ కంపెనీలో తనిఖీల పేరుతో సోదాలు చేశారు. అనంతరం కంపెనీ డైరెక్టర్‌తో పాటు మరో వ్యక్తిని కిడ్నాప్(Kidnap) చేసి ఓ హోటల్‌కు తీసుకువెళ్లారు. తమను అరెస్టు చేయకుండా ఉండాలంటే రూ.10కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసి రూ.2.3 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నారు. డైరెక్టర్ బయటకి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు నకిలీ సీఐడీ అధికారులను తేలింది. అనంతరం నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
నకిలీ పాస్‌పోర్ట్‌ల కేసులో కీలక పరిణామం - సీఐడీ అదుపులో ఏఎస్ఐ
మాదాపూర్ డీసీపీ వినిత్ తెలిపిన వివరాల ప్రకారం గచ్చిబౌలిలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అజయాడ్ ఐటీ కంపెనీ(Ajayad IT Company)లోకి ఈ నెల 27వ తేదీన గతంలో ఆ కంపెనీ మాజీ ఉద్యోగి రంజిత్, ఏపీలోని కర్నూలుకు చెందిన సబ్ ఇన్‌స్పెక్టర్ సుజన్‌తో కలిపి 9 మంది ఏపీ సీఐడీ అధికారులమంటూ వెళ్లారు. అమెరికాలో మీ కంపెనీపై కేసు నమోదయిందని కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో తనిఖీలు చేపడుతున్నామని కార్యాలయంలోకి చొరబడ్డారు. అనంతరం అక్కడ ఉన్న డీవీఆర్‌ను స్వాధీనం చేసుకున్నారు. సోదాలు నిర్వహించి కంపెనీ డైరెక్టర్ దర్శన్‌తో పాటు మరో వ్యక్తిని బలవంతంగా ఓ హోటల్‌కు తీసుకువెళ్లారు.
నకిలీ నోట్లతో ప్రజలను మోసం చేస్తున్న విదేశీయుల ముఠా అరెస్టు
8 Members Arest in Fake CID Officers Case : ఆ హోటల్లో సంస్థ డైరెక్టర్‌తో అతనని అరెస్ట్ చేయకుండా ఉండాలంటే రూ.10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చివరకు రూ.2.3 కోట్లకు డీల్ కుదిరింది. అక్కడికక్కడే రూ.10లక్షలు వారి బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేయించుకున్నారు. తరువాత నిందితులు ఇద్దరిని వదిలి పెట్టారు. వెంటనే వారు దగ్గరలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేశారు. దీంతో వారు నకిలీ సీఐడీ(Fake CID Officers Case) ఉద్యోగులను తెలుసుకున్నారు. అనంతరం నిందితులను పట్టుకుని అరెస్ట్ చేశామని తెలిపారు. ఇప్పటివరకు 8 మంది నిందితులను అరెస్టు చేశామని పేర్కొన్నారు. పరారీలో మరో ఇద్దరు నిందుతులు ఉన్నారని వెల్లడించారు. గతంలో నిందితులు ఈ తరహా మోసాలకు పాల్పడ్డారనే కోణంలో దర్యాప్తు చేస్తామని వివరించారు.
"రంజిత్ అనే అతడు అజాయాడ్ ఐటీ కంపెనీలో పని చేశాడు. తను ఎస్‌ఐ సుజన్ ప్రణాళిక రచించారు. సీఐడీ ఆఫీసర్లమంటూ వెళ్లి డైరెక్టర్, మరో వ్యక్తిని హోటల్‌కు తీసుకెళ్లారు. రూ.10 లక్షలు బాధితుడి నుంచి తీసుకున్నారు. ఇప్పటివరకు 8 మంది నిందితులను అరెస్టు చేశాం. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. అరెస్టు చేసిన వారిని రిమాండ్‌కు తరలించాం." - వినిత్ , మాదాపూర్ డీసీపీ