Fake Cases on TDP Leaders in AP : ఎన్నికల పోలింగ్ రోజు (మే 13న), అనంతరం వైఎస్సార్సీపీ నేతలు చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. అవి చాలవు అన్నట్లు ఇప్పుడు మరొ కొత్త నాటకానికి తెరలేపారు. టీడీపీ నాయకులు తమపై దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వారికి వంత పాడుతూ టీడీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు.
Police Booked Cases on TDP Leaders : కౌంటింగ్ సమయం సమీపిస్తుండటంతో తిరుపతిలో వైఎస్సార్సీపీ నాయకులు కుట్రలకు తెరలేపారు. తెలుగుదేశం నేతలను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా కేసులు బనాయిస్తున్నారు. ఓట్ల లెక్కింపు సమయంలో తెలుగుదేశం ముఖ్యమైన నాయకులు, కార్యకర్తలు అందుబాటులో లేకుండా చేసే ఉద్దేశంతోనే కేసులు పెట్టించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నేతలకు బెయిలు, కార్యకర్తలకు జైలు- రాజకీయ సంగ్రామంలో సామాన్యులే సమిధలు - No Bail
Tirupati District : తిరుపతిలో తెలుగుదేశం శ్రేణులపై వైఎస్సార్సీపీ నాయకుల ఫిర్యాదుతో పోలీసులు ఆఘామేఘాల మీద కేసులు నమోదు చేయడం వివాదాస్పదమవుతోంది. పోలింగ్ తర్వాత పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వద్ద చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం జరిగింది. ఈ ఘటన తర్వాత టీడీపీ నేతలు తమపై దాడులకు పాల్పడ్డారని తిరుపతి నగర శివారు ప్రాంతమైన మంగళం తిరుమల నగర్‌కు చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు ఎస్వీయూ క్యాంపస్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఘటన జరిగిన 12 రోజుల తర్వాత వైఎస్సార్సీపీ నాయకుడి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు తెలుగుదేశం ముఖ్యనేతలతో పాటు 37మందిపై కేసు పెట్టారు.
అనంతపురంలో 144 సెక్షన్- సమస్యాత్మక ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాల నిఘా - Police Monitoring With Drone
ఎన్నికల సమయంలో వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలో చేరిన వారిపై కేసులు పెడుతుండటంపై ప్రస్తుతం చర్చనీయ అంశమైంది. హత్యాయత్నం, కుట్ర వంటి తీవ్ర నేర ఆరోపణలతో కేసులు నమోదు చేశారు. అక్రమ కేసులపై చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి పులివర్తి నాని జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. దాడి ఘటనపై సీసీటీవీ దృశ్యాల్ని పరిశీలించాలని కోరారు.
వైఎస్సార్సీపీ నేత ఫిర్యాదుపై తెలుగుదేశం నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదు దారులు రాళ్లు, కర్రలు, బీరు సీసాలతో దాడికి గురై గాయపడితే ఎక్కడ చికిత్స పొందారని ప్రశ్నిస్తున్నారు. వాస్తవాలను నిర్ధారించకుండానే పోలీసులు కేసులు ఎలా నమోదు చేశారని టీడీపీ నేతలు నిలదీస్తున్నారు.