ETV Bharat / state

మద్యం దుకాణాల కేటాయింపులో సిండికేట్లకు సహకరిస్తే కఠిన చర్యలు: మంత్రి కొల్లు రవీంద్ర - MINISTER KOLLU ON LIQUOR POLICY

చివరి 2 రోజులు ఎక్కువ దరఖాస్తులు వచ్చే అవకాశం - రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా షాపుల కేటాయింపు

minister_kollu_on_liquor_policy
minister_kollu_on_liquor_policy (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 9, 2024, 10:05 PM IST

Minister Kollu Ravindra Review on New Liquor Policy: మద్యం పాలసీని అత్యంత పారదర్శకంగా అమలు చేయాలని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా అవకతవకలకు తావివ్వకుండా చూడాలని అధికారులకు సూచించారు. నూతన మద్యం పాలసీ, మద్యం దుకాణాలకు దరఖాస్తుల ప్రక్రియపై మంత్రి సమీక్ష నిర్వహించారు. మద్యం సిండికేట్లు వ్యవహారంపై అధికారుల నుంచి వివరణ కోరారు. దరఖాస్తు దాఖలు చేసేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, బెదిరిస్తున్నారనే అంశాన్ని మంత్రి ఖండించారు. ఎక్సైజ్ అధికారులు ఎవరైనా సిండికేట్లకు సహకరిస్తే ఉపేక్షించొద్దని ఉన్నతాధికారుల్ని ఆదేశించారు.

దరఖాస్తుల దాఖలు నుంచి షాపుల కేటాయింపు వరకు పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. లక్ష దరఖాస్తులు లక్ష్యంగా నిర్దేశించుకోగా 56 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయని వచ్చే 2 రోజుల్లో లక్ష్యాన్ని సాధించేలా చూడాలని ఆదేశించారు. చివరి 2 రోజుల పాటు ఎక్కువ దరఖాస్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో సర్వర్ సమస్యలు తలెత్తకుండా చూడాలని అన్నారు. కొన్ని జిల్లాల్లో నిర్దేశించుకున్న లక్ష్యాన్ని మించి దరఖాస్తులు రావడం పట్ల సిబ్బందిని అభినందించారు. అదే స్ఫూర్తితో ప్రతి ఒక్క జిల్లాలో దరఖాస్తుల దాఖలుపై అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు. అక్టోబరు 16వ తేదీ నుంచి కొత్త దుకాణాలు, కొత్త మద్యం విధానం అమల్లోకి రావాలని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు.

AP Wine Shop Tenders 2024 : రాష్ట్రంలోని మద్యం షాపులకు ఇప్పటి వరకూ 50 వేల ధరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వానికి రూ.1000 కోట్ల అదాయం వచ్చింది. అక్టోబరు 11 వరకు మద్యం షాపుల దరఖాస్తుల గడువు పెంపునకు అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. అన్ లైన్​లో సహా అన్ని విధానాలలో దరఖాస్తులకు అదే రోజు సాయంత్రం 7 గంటల వరకు అవకాశం ఉంది. అక్టోబరు 12, 13 తేదీలలో దరఖాస్తుల పరిశీలన చేయనున్నారు. 14వ తేదీన అయా జిల్లాలలో కలెక్టర్ల పర్యవేక్షణలో మద్యం షాపుల కోసం లాటరీ వేయనున్నారు. అక్టోబరు 16వ తేదీ నుంచి నూతన మద్యం విధానాన్ని అనుసరించి ప్రైవేటు మద్యం షాపులు నడవనున్నాయి.

50 వేలు దాటిన దరఖాస్తులు - 14న మద్యం షాపులు కేటాయింపు

మద్యం టెండర్లకు మరో రెండు రోజులు - గడువు పెంచిన ప్రభుత్వం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.