ETV Bharat / state

'నగరంలో గంజాయి ఎక్కడ పట్టుబడినా - దాని మూలాలు ధూల్​పేట్​లోనే​' - Drugs Cases in Telangana

54 KG Drugs Seized in Hyderabad : రాష్ట్రవ్యాప్తంగా మాదకద్రవ్యాలపై స్పెషల్​ ఆపరేషన్​ చేపట్టిన ఎక్సైజ్ పోలీసులు, హైదరాబాద్​లో గంజాయి సరఫరా చేస్తున్న నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి రూ.10 లక్షల విలువ చేసే 54 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టర్ కమలాసన్ మీడియాతో మాట్లాడుతూ పట్టుబడిన గంజాయి మూలాలు ధూల్​పేట్​లోనే బయట పడుతున్నట్లు చెప్పారు. ఆగస్టు 31లోపు ధూల్​పేట్​ను గంజాయి రహిత ప్రాంతంగా మార్చాలని లక్ష్యం పెట్టుకున్నట్లు వివరించారు.

TG Govt Focus on Drugs
Police on Drugs in Telangana (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 27, 2024, 4:42 PM IST

Police on Drugs in Telangana : నెల రోజుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా మాదక ద్రవ్యాలపై స్పెషల్​ ఆపరేషన్​ చేపట్టిన ఎక్సైజ్ పోలీసులు, తాజాగా హైదరాబాద్​లో 54 కేజీల గంజాయి సప్లై చేస్తున్న నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకుని వారిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. గంజాయి విలువ సుమారు రూ.10 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి ఆదేశాలతో డ్రగ్స్ నియంత్రణకు ఎక్సైజ్ శాఖ తీవ్రంగా కృషి చేస్తోందని కమలాసన్ రెడ్డి తెలిపారు. గత కొన్ని రోజులుగా మాదకద్రవ్యాల నిరోధానికి స్పెషల్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నామని, ప్రత్యేక ఆపరేషన్​లో భాగంగా పెద్ద ఎత్తున గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ధూల్​పేట్​లో​ గతంలో నాటు సారా తయారయ్యేదని, దాన్ని పూర్తిగా నియంత్రించినట్లు వివరించారు. ధూల్​పేట్​లో​ నాటు సారా స్థానంలో గంజాయి హబ్​గా మారిందని చెప్పారు.

ధూల్​పేట్​లో పట్టుబడిన 15 మంది నిందితులు : దీంతో కొద్దిరోజులుగా ధూల్​పేట్​లో ఎక్సైజ్​ పోలీసులు, లా అండ్​ ఆర్డర్​ పోలీసులతో ప్రత్యేక సోదాలు నిర్వహిస్తున్నట్లు కమలాసన్ రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు ధూల్​పేట్​లో జరిపిన సోదాల్లో 15 మంది నేరస్థులను గుర్తించినట్లు చెప్పారు. జీహెచ్​ఎంసీ పరిధిలో ఎక్కడ గంజాయి పట్టుబడినా దాని మూలాలు ధూల్​పేట్​లోనే బయట పడుతున్నట్లు గుర్తించామని చెప్పారు. మాదక ద్రవ్యాల నిరోధానికి ప్రత్యేకంగా 1000 మంది పోలీసులతో శిక్షణ ఇచ్చామని తెలిపారు.

పట్టుబడ్డ నిందితులకు శిక్షలు పడేవిధంగా కేసు విచారణ చేస్తున్నామని ఎక్సైజ్ ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి పేర్కొన్నారు. ఆగస్టు 31లోపు ధూల్​పేట్​ను గంజాయి రహిత ప్రాంతంగా మార్చాలని లక్ష్యం పెట్టుకున్నట్లు చెప్పారు. కేవలం అక్కడే కాకుండా సమాంతరంగా మిగతా ప్రాంతాల్లో కూడా దృష్టి పెడుతున్నట్లు వివరించారు. మరోవైపు సోదాలలో భాగంగా పోలీసులు, నార్కోటిక్ బ్యూరో పోలీసుల సహకారం తీసుకుంటున్నామని తెలిపారు.

'ధూల్​పేట్​లో జరిపిన సోదాల్లో 15 మందిని పట్టుకున్నాం. ఎక్కడ గంజాయి పట్టుబడినా దాని మూలాలు ధూల్​పేట్​లోనే బయట పడుతున్నాయి. ఆగస్టు 31లోపు ధూల్​పేట్​ను గంజాయి రహిత ప్రాంతంగా మార్చాలని లక్ష్యం పెట్టుకున్నాం'- కమలాసన్ రెడ్డి, ఎక్సైజ్ ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టర్

ఈ తండ్రీకొడుకులు డ్రగ్ స్మగ్లర్స్ - మధ్యప్రదేశ్ నుంచి హైదరాబాద్​కు 'మత్తు' రవాణా

ఏంటీ?? డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తరహాలో డ్రగ్ టెస్టులా? - అదీ కాలేజీల్లోనా? - DRUG TESTS IN COLLEGES IN TELANGANA

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.