Warangal Pakhal Lake Facilities Issue : వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్ నగర్‌లో పాకాల సరస్సు మంచి ప్రసిద్ధికెక్కింది. ఈ సరస్సు కాలుష్య రహితతో పాటు దట్టమైన అడవి విస్తీర్ణం కలిగి ఉంది. ఈ సరస్సును పరిసర ప్రాంత ప్రజలు పర్యాటకానికి కల్పతరువుగా పిలుస్తారు. దీనిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి పరిచేందుకు ఎకో టూరిజం, అడవి శాఖ ఆధ్వర్యంలో కొంతవరకు పనులు చేసినప్పటికీ అవి మధ్యలోనే నిలిచిపోయాయి.
గతంలో తెలంగాణ టూరిజం శాఖ పాకాల సరస్సులో బోటింగ్ కోసం ఒక పడవను ఒక స్పీడ్ బోటును ఏర్పాటు చేసింది. సరస్సులో విహరించేందుకు అనువైన ధరలు కూడా నిర్ణయించింది. కొన్ని రోజులు సజావుగా సాగినా.. ఆ తర్వాత అటవీశాఖ, పర్యాటక శాఖ మధ్య సమన్వయ లోపంతో సరస్సులో బోటింగ్ ఆగిపోయిందని పర్యాటకులు స్థానికులు వాపోతున్నారు.
అరుదైన బాతులు... పాకాల సరస్సుకు వచ్చాయి
గంతలో ఈ సరస్సును సందర్శించాలంటే ఎలాంటి డబ్బులు వసూలు చేసేవారు కాదు. అయితే, ఇక్కడ అభివృద్ధి పేరుతో కొన్ని కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం సరస్సు సందర్శించాలంటే టికెట్ తీసుకునేలా ఏర్పాట్లు చేశారు. దీంతో పర్యటకులు ఇక్కడికి రావడానికిి ఆసక్తిని కనబరచడం లేదు. పైగా గతంలో వనభోజనాల కోసం ఇక్కడికి ఎక్కువ మంది వచ్చేవారు. అధికారుల ఆంక్షలు, గేటు ఏర్పాటుతో, వాహనాలను లోపలికి అనుమతించకపోవడం తదితర కారణాలవల్ల పర్యాటకుల సంఖ్య తగ్గింది. అశోక్ నగర్ గ్రామస్థులు
అంతకుముందు రుసుము లేక పోవడంతో ఈ ప్రాంతమంతా నిత్యం పర్యాటకులతో జాతరను మర్పించే విధంగా ఉండేదని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకొని సకల వసతులతో పాకాల సరస్సును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలంటున్నారు. దీంతో అభివృద్ధితో పాటు మరో సరస్సును మరో లక్నోవరంగా పర్యాటకులకు ఆధరిస్తారని అంటున్నారు.
గతంలో చాలా సార్లు ఇక్కడికి వచ్చాం. అప్పట్లో ఇక్కడ బోటింగ్ ఉండేది. కానీ, ఈ మధ్య కాలంలో బోటింగ్‌ను రద్దుచేశారు. ఈ సరస్సు ప్రకృతి సిద్ధంగా వెలిసింది. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఈ సరస్సును పునరుద్ధరించాలి. వరంగల్‌లో లక్నవరం సరస్సు తరువాత ఇదే అదిపెద్ద సరస్సు ఈ సరస్సు చూడటానికి ఆయా జిల్లాల నుంచి ప్రజలు ఇక్కడికి వస్తారు. టూరిజం, అటవీ శాఖ సమన్వయలోపం వల్ల సరస్సు ప్రాధాన్యత కోల్పోతుంది. పర్యటకులు
Pakhal Lake Warangal : పాకాల సరస్సుకు జలకళ.. సాగుకు ముస్తాబైన రైతన్న