ETV Bharat / state

కేంద్ర పూర్తిస్థాయి బడ్జెట్ - తెలంగాణకు కేటాయింపులపై నిపుణుల అభిప్రాయాలు - PRATIDHWANI ON UNION BUDGET 2024 - PRATIDHWANI ON UNION BUDGET 2024

Pratidhwani On Union Budget Allocations : వార్షిక బడ్జెట్ 2024-25 ప్రవేశ పెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వికసిత్ భారత్​ దిశగా అడుగులు వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ బడ్జెట్​లో అన్ని రంగాలకు కేటాయింపులు చేసినట్లు వెల్లడించారు. ఆయా రంగాలను కలుపుకొని ముందుకు సాగుతామని పేర్కొన్నారు. అయితే, కేంద్ర బడ్జెట్​లో తెలంగాణకు ఏ మేరకు లాభం చేకురిందనే అంశంపై నేటి ప్రతిధ్వని కార్యక్రమం.

Union Budget Allocations
Union Budget Allocations (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 24, 2024, 10:43 AM IST

Pratidhwani On Union Budget Allocations : 2024-2025 వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వికసిత్ భారత్ ప్రధాన లక్ష్యమని స్వయంగా ప్రకటించారు. ఆ లక్ష్యాన్ని చేరుకోవడం ఎలా? గత కొది కాలంగా వ్యక్తిగత పన్ను ఊరటలపై చాలా ఆశలు ఉన్నాయి. ఈసారైనా ఆ దిశగా ఏమైనా కీలక నిర్ణయాలు ఉండొచ్చా? అసలు దేశ ఆర్థికవ్యవస్థ స్థితిగతులపై సోమవారం పార్లమెంట్‌ ముందుకు వచ్చిన ఆర్ధిక సర్వే ఏం చెప్పింది? రంగాల వారీగా చూసినప్పుడు నేటి బడ్జెట్‌లో వేటివేటికి ప్రాధాన్యం లభించే అవకాశాలు ఉన్నాయి. కీలకమైన వడ్డీరేట్లు, గుదిబండలుగా మారి చాలాకాలంగా ప్రజలు, వ్యాపార వర్గాలు కూడా ఇబ్బంది పడుతున్నారు.

మరోవైపు ద్రవ్యోల్బణం భయపెడుతునే ఉంది. ప్రజల కొనుగోలు శక్తి అంతకంతకూ పడిపోతోంది. వీటి విషయంలో బడ్జెట్‌ నుంచి ఏం ఆశించవచ్చు. ఒక సామాన్యుడి కోణంలో చూసినప్పుడు బడ్జెట్‌ను పరిశీలించడం అందరికీ ఎందుకు అవసరం? బడ్జెట్‌ను తీసుకునే నిర్ణయాలు ప్రజల ఆర్థిక, రోజువారి జీవితాల్ని ఎలా ప్రభావితం చేస్తాయి? మోదీ నేతృత్వంలోని ఎన్డీయే 3వసారి అధికారంలోకి వచ్చినా ఈసారి సమీకరణాలు అంతగా అనుకూలంగా లేని నేపథ్యంలో సంస్కరణల విషయంలో ఎలాంటి వైఖరి తీసుకోవచ్చు. దిగుమతులు తగ్గించుకోవడం, భారత్‌లో తయారీ, ఎన్డీయే ప్రభుత్వం చాలా ఏళ్లుగా ప్రాధాన్యం ఇస్తున్న ఈ రెండు విషయాల్లో సాధించిన పురోగతి ఎలా ఉంది? ఇంకా ఎలాంటి కృషి, ప్రోత్సాహం అవసరం.

  • విశాఖ ఉక్కు కర్మాగారంతో పోల్చితే తక్కువ దూరంలో బొగ్గు గనులు ఉండి, అనుకూలంగా ఉండే బయ్యారంలో ఉక్కు కర్మాగారాన్ని కేంద్రం మంజూరు చేయడం లేదు.
  • తెలంగాణలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు కోసం చివరికి లోక్‌సభ ఎన్నికలకు ముందు గత డిసెంబరులో దానికి సంబంధించిన బిల్లును ఆమోదించింది. విశ్వవిద్యాలయం స్థాపించడానికి రూ.900 కోట్లు మంజూరు కావాల్సి ఉండగా, నిధుల కేటాయింపులు జరగలేదు.
  • విభజన చట్టంలో తెలంగాణకు ఒక సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే, గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కోరింది. ఈ అంశంపై స్పష్టత లేదు.
  • విభజన చట్టం ప్రకారం హైదరాబాద్‌- వరంగల్, హైదరాబాద్‌-నాగ్‌పుర్‌ పారిశ్రామిక కారిడార్‌లను మంజూరు చేసి నిధులివ్వాలంటూ గత పది సంవత్సరాలుగా రాష్ట్ర కోరుతోంది. ఈసారీ కూడా వాటిని పట్టించుకోలేదు. బెంగళూరు కారిడార్‌లో హైదరాబాద్‌ను జత చేస్తామని ప్రకటించింది.
  • వెనుకబడిన ప్రాంత అభివృద్ధి కోసం కేంద్రం నుంచి నిధులు రావాలి. పదేళ్లుగా అవి విడుదల కాలేదు.
  • 2019-20 నుండి 2023-24 సంవత్సరాల మధ్య రావాల్సిన గ్రాంట్లు రూ.1,800 కోట్లు ఇంకా పెండింగులోనే ఉన్నాయి.

అసలు ఈ బడ్జెట్​లో తెలంగాణకు న్యాయం జరిగిందా? ఎలాంటి కేటాయింపులు చేశారు తదితర అంశాలపై నేటి ప్రతిధ్వని కార్యక్రమం.

కేంద్ర బడ్జెట్‌పై మధ్యతరగతి అశలు - ఎలాంటి వరాలుంటాయో? - PRATIDHWANI ON UNION BUDGET 2024

ఆశలపల్లకిలో వేతనజీవుడు - రానున్న బడ్జెట్‌లోనైనా తీపికబుర్లుంటాయా? - Income Tax Slabs Revision

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.