Dilavarpur Ethanol Factory Issue : నిర్మల్ జిల్లాలోని దిలావర్‌పూర్‌లో ఇథనాల్ కంపెనీకి కేంద్ర పర్యావరణ శాఖకు విరుద్ధంగా గత ప్రభుత్వం అనుమతులు ఇచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది. కేంద్రం కేవలం ఫ్యూయల్ ఇథనాల్‌కు మాత్రమే అనుమతినిస్తే, అప్పటి మంత్రివర్గం(కేసీఆర్ క్యాబినేట్) ఇతర ఇథనాల్ ఉత్పత్తులకు అనుమతిచ్చిందని పేర్కొంది. ప్రజాభిప్రాయ సేకరణ తప్పించుకోవడానికి తప్పుడు మార్గాలు అనుసరించడంతో పాటు, స్థానిక సంస్థల నుంచి అనుమతి తీసుకోకుండానే పీఎంకే కంపెనీ ప్రహరీ గోడ నిర్మించినట్లు వెల్లడించింది.
నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్‌లో ఇథనాల్ కంపెనీకి సంబంధించిన అనుమతుల వివరాలను రాష్ట్రప్రభుత్వం బయటపెట్టింది. ఇథనాల్ కంపెనీకి బీఆర్ఎస్ హయాంలోనే అనుమతులు ఇచ్చారని సంబంధిత దస్త్రాలను విడుదల చేసింది. ఇథనాల్ కంపెనీకి అనుమతులు ఇచ్చి ప్రజలను మోసం చేశారని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఫ్యూయల్ ఇథనాల్‌కు మాత్రమే అనుమతి ఇస్తే, వాటిని గత ప్రభుత్వం పట్టించుకోకుండా తుంగలో తొక్కినట్లు పేర్కొంది. పర్యావరణశాఖ అనుమతులను బీఆర్ఎస్ ప్రభుత్వం ఉల్లంఘించి, నిబంధనలు పాటించలేదని వివరించింది.
ఇథనాల్, ఎక్స్‌ట్రా న్యూటల్ ఆల్కహాల్, ఇండస్ట్రియల్ స్పిరిట్స్, అబ్జల్యూట్ ఆల్కహాల్‌కు అనుమతులు ఇచ్చిందని తెలిపింది. ఫ్యూయల్ ఇథనాల్ సాకుతో కంపెనీకి అనుకూలంగా అనుమతులు ఇచ్చానట్లు తెలంగాణ ప్రభుత్వం వివరించింది. మినహాయింపు కోసం ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా కంపెనీ అడ్డదారులు అనుసరించిందని తెలిపింది. కంపెనీ స్వీయ ధ్రువీకరణ ఆధారంగా మినహాయింపు ఇచ్చారని పేర్కొంది. కేంద్రం ఇచ్చిన పర్యావరణ అనుమతి ప్రకారం స్థానిక సంస్థల ఎన్‌వోసీ తప్పనిసరిగా తీసుకోవాలని, కానీ అలాంటిదేమి లేకుండా పీఎంకే డిస్టిలేషన్స్ కాంపౌండ్ వాల్ నిర్మించిందని తెలిపింది.
మంత్రివర్గం ఆమోదం లేకుండానే : బీఆర్ఎస్ ప్రభుత్వ అండతో పీఎంకే డిస్టిలేషన్స్ నిబంధనలు ఉల్లంఘించిందని వివరించింది. 2022 అక్టోబర్ 22న 600 లక్షల లీటర్ల ఇథనాల్, ఇతర ఉత్పత్తుల కోసం గత ప్రభుత్వం లెటర్ ఆఫ్ ఇండెట్ జారీచేసిందని వివరించారు. గత ప్రభుత్వం రాష్ట్ర మంత్రివర్గ ఆమోదం లేకుండానే అత్యవసరం పేరిట ఆదేశాలు జారీ చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం వాటికి సంబంధించిన దస్త్రాలను బయటపెట్టింది. 2022 డిసెంబర్‌లో ఈ నిర్ణయాన్ని ర్యాటిఫై చేసిందని తెలిపింది. 2023 ఫిబ్రవరి 24న కేంద్రం ఫ్యూయల్ ఇథనాల్‌కు అనుమతిచ్చిందని కాంగ్రెస్ ప్రభుత్వం వెల్లడించింది. 2023 జూన్ 15న నీటి కేటాయింపులు, 2023 డిసెంబర్ 7కు ముందే టీఎస్‌ఐపాస్ ద్వారా అనుమతులు ఇచ్చిందని తెలిపింది.
ఇథనాల్ కంపెనీ తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబానికే సంబంధించిందే అని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇథనాల్ కంపెనీకి సంబంధించి అనుమతులు ఇచ్చినప్పుడు మాజీ మంత్రి తలసాని కుమారుడు తలసాని సాయి కిరణ్ డైరెక్టర్‌గా ఉన్నట్లు మంత్రి సీతక్క ఆరోపించారు. దీనిపై స్పందించిన మాజీ మంత్రి అందులో తమకు వాటా ఉందని నిరూపిస్తే అది వారికే రాసిస్తానని సవాల్ విసిరారు.
'ఇథనాల్ కంపెనీకి మాకు సంబంధం ఉందని నిరూపిస్తే వారికే రాసిస్తా'
ఇథనాల్ పరిశ్రమ నిరసనలో తీవ్ర ఉద్రిక్తత - పోలీసులపై ఆందోళనకారుల దాడి