ETV Bharat / state

రూ. 2.20 కోట్లతో పరారైన బ్యాంకు ఉద్యోగి - నిందితుడిని పట్టుకున్న పోలీసులు - Money Thefting from hdfc ATM - MONEY THEFTING FROM HDFC ATM

Employee Stole 2 Crore 20 Lakh in Rajamahendravaram: రాజమహేంద్రవరంలో ఘరానా చోరీ జరిగింది. ఓ ఉద్యోగి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు నుంచి డ్రా చేసిన రూ. 2.2 కోట్లతో పరారయ్యాడు ఓ వ్యక్తి. ప్రైవేట్ ఏజెన్సీ ఉద్యోగిగా పనిచేస్తున్న నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు.

Employee Stole 2 Crore 40 Lakh From ATM in Rajamahendravaram
Employee Stole 2 Crore 40 Lakh From ATM in Rajamahendravaram (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 26, 2024, 8:42 PM IST

Updated : Jul 26, 2024, 10:38 PM IST

Employee Stole 2 Crore 20 Lakh in Rajamahendravaram: గత కొంత కాలంగా ఆ ఉద్యోగి నమ్మకంగా పని చేస్తున్నాడు. ప్రతిరోజు డబ్బులతో ప్రయాణం చేస్తూ జీవనం గడుపుతున్నాడు. బ్యాంకుల నుంచి విత్​ డ్రా చేసిన డబ్బులను ఏటీఎంలలో నింపుతూ తన జీవన ప్రయాణాన్ని సాఫిగా సాగిస్తున్నారు. ఏ రోజు పరాయి డబ్బుపై అతని కన్నుపడలేదు. కానీ ఓ రోజు దురాశ పుట్టింది. అనుకున్నదే తడవుగా చేతివాటం ప్రదర్శించారు. ఏటీఎంల్లో డిపాజిట్‌ చేయాల్సిన 2.2 కోట్లు డబ్బుతో పరారయ్యాడు. దీంతో ఏం చేయాలో తెలియక బ్యాంకు ఉద్యోగులు తలలు పట్టుకున్నారు. నిందితుడిని పోలీసులు తీవ్రంగా గాలించి పోలీసులు పట్టుకున్నారు.

కావలి సమీపంలో బస్సులో భారీ చోరీ - కేసును ఛేదించిన పోలీసులు - Police Solved Theft Case

ఇదీ జరిగింది : ఏటీఎంలో నింపేందుకు తీసుకున్న రెండు కోట్ల ఇరవై లక్షల నగదుతో ఏజన్సీ ఉద్యోగి పరారైన ఘటన రాజమహేంద్రవరంలో తీవ్ర కలకలం రేపింది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపుం మండలానికి చెందిన వాసంశెట్టి అశోక్ కుమార్ రాజమహేంద్రవరంలోని ఏటీఎంలలో నగదు నింపే హెచ్​టీసీ ప్రైవేటు ఏజన్సీ సంస్థలో తాత్కాలిక ఉద్యోగిగా 2021 నుంచి పనిచేస్తున్నాడు. అతడు నగరంలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సంబంధించిన 11 ఏటీఎంలలో నగదు నింపాల్సి ఉంది. శుక్రవారం మధ్యాహ్నం ఏజన్సీ ఇచ్చిన 2 కోట్ల, 20 లక్షల, 50వేల చెక్కును దానవాయిపేట హెచ్‌డీఎఫ్‌సీ శాఖకు వెళ్లి చెక్కు ఇచ్చి నగదును ఓ ఇనుప బాక్సులో సర్దుకున్నాడు. అనంతరం అతడు బ్యాంకు బయట ఉంచిన తన వ్యక్తి గత కారులో ఆ నగదుతో పరారయ్యడు. ఏజెన్సీ ప్రతినిధులు ఇచ్చిన సమాచారంతో ఒకటో పుట్టణ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలించారు.

తొలుత పోలీసులు అతడి సెల్​ఫోన్​ను ట్రాక్ చేయగా మోడల్ కాలనీ సమీపంలో ఉన్నట్లు గుర్తించారు. అక్కడికి వెళ్లగా ఫోను మాత్రమే పోలీసులుకు లభ్యమయింది. నిందితుడు కారు కోనసీమ జిల్లా కొత్తపేట సమీపంలో వదలి అక్కడి నుంచి ఓ ద్విచక్ర వాహనంపై వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అతని కోసం తీవ్రంగా గాలించిన పోలీసులు, నిందితుడిని స్వగ్రామం కపిలేశ్వరపురం మండలం మాచరమెట్టలో పట్టుకున్నారు.

ఇళ్లకు తాళాలు వేసి ఉంటే వాళ్లకు పండగే- అర్ధరాత్రి ఆరు ఇళ్లలో హవా - Mid Night Robbery In Nellore

మెడికోస్​ హాస్టల్​లో భారీ చోరీ - ₹20 లక్షల విలువైన లాప్​టాప్​లు ఫోన్లు మాయం - Theft in Medical College Hostel

Last Updated : Jul 26, 2024, 10:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.