Elephant Group From Maharashtra to Telangana : ఈ నెలలో ఒక ఏనుగు మహారాష్ట్ర నుంచి తెలంగాణలోకి ప్రవేశించి కేవలం 14 గంటల వ్యవధిలోనే ఇద్దరు వ్యక్తులను చంపేసింది. అయితే ఆ తర్వాత ఏనుగును అటవీ శాఖ అధికారులు మహారాష్ట్రలోని దాని స్థావరానికి తిరిగి పంపించేశారు. అయితే ఇప్పుడు ఆ మగ ఏనుగు(Elephant Attack in Telangana) వల్ల పెద్ద తలనొప్పే వచ్చి పడింది. ఇప్పుడు అక్కడి నుంచి ఏకంగా ఒక ఏనుగు గుంపునే తీసుకుని రావడానికి 100 శాతం అవకాశం ఉందని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు.
ఆ ఏనుగుల గుంపు మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా నుంచి రాష్ట్రంలోని కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ అటవీ డివిజన్లో అడుగుపెట్టే అవకాశం ఉందని అటవీశాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఒకవేళ ఆ గుంపే రాష్ట్రంలోకి వస్తే అవి సృష్టించే విధ్వంసం అంతాఇంతా కాదు. దాని తీవ్రత చాలానే ఉంటుందనే నేపథ్యంలో వాటిని నియంత్రించడం ఎలా అనే అంశంపై వారు దృష్టి పెట్టారు. అలాగే వాటి బారి నుంచి ఆ పరిసర ప్రాంతాల ప్రజలను ఏ విధంగా సన్నద్ధం చేయాలి, ఎలా తప్పించుకోవాలనే దానిపై అవగాహన కల్పించనున్నారు.
ఇందుకు అరణ్యభవన్‌లో కొద్దిరోజుల క్రితం అటవీశాఖ ఉన్నతాధికారులు ఈ విషయంపై చర్చించారు. ముఖ్యంగా ఏనుగులను నియంత్రించాలంటే వాటి కదలికలను ఎప్పటికప్పుడు కనిపెట్టడం చాలా కీలకం. అవి ఉదయం పూట ఎక్కువగా సంచరించవు. కానీ రాత్రి పూట మాత్రం ఎక్కువగా సంచరిస్తుంటాయి. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు రాత్రి పూట పని చేసే థర్మల్ కెమెరా డ్రోన్ల(Thermal Camera drones)ను కొనుగోలు చేయనున్నట్లు అటవీశాఖలో కీలక అధికారి ఒకరు తెలిపారు.
మహారాష్ట్రకు వెళ్లిపోయిన ఏనుగు - ఊపిరిపీల్చుకున్న కుమురం భీం జిల్లా ప్రజలు
ఏనుగులకు అనువైన పరిస్థితులు : మహారాష్ట్ర మంద నుంచి తప్పిపోయిన ఓ ఏనుగు రాష్ట్రంలో సంచరించిన ప్రాంతంలో వాటికి అనువైన ప్రాంతం ఉంది. అక్కడ పచ్చని పొలాలు, సమృద్ధిగా నీరుంది. ఈ లక్షణాలు ఏనుగులు స్థిరపడేందుకు అనువైన ప్రాంతం. అయితే ఏప్రిల్ తొలి వారంలో తెలంగాణ అడవుల్లో అడుగుపెట్టిన ఏనుగు, ఆసిఫాబాద్ జిల్లాలోని చింతలమానెపల్లి, పెంచికల్‌పేట మండలాల్లో భయాందోళన సృష్టించింది. ఆ మగ ఏనుగు 14 గంటల వ్యవధిలోనే ఇద్దరు రైతుల్ని బలి తీసుకుంది. ఇలా రాష్ట్రంలో ఏనుగు సంచరించడం ఇదే తొలిసారి.
Elephant Attack in Asifabad : మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో 60-70 ఏనుగులు సంచరిస్తున్నాయి. ఆ ప్రాంతంతో పోలిస్తే ఆసిఫాబాద్‌లో మగ ఏనుగు సంచరించిన ప్రాంతం వాటికి చాలా అనుకూలం. ఈ కారణంతోనే ఆ మగ ఏనుగు ఆ గుంపును తనతో పాటు తీసుకువచ్చే అవకాశాలు 100 శాతం ఉన్నాయని అటవీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఏనుగుల గుంపు వస్తే అవి కలిగించే నష్టంపై ఆయా ప్రాంతాల ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఈ నెల 22న దూలపల్లిలోని అటవీ అకాడమీలో వర్క్‌షాప్ నిర్వహిస్తామని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
ఒడిశాలో పెద్దసంఖ్యలో ఉన్న ఏనుగుల గుంపుల్లో కొన్ని అక్కడ ఆవాసాలు సరిపోక పొరుగు రాష్ట్రాలకు వలస వెళుతున్నాయి. కొన్ని పక్కనే ఉన్న ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లగా అక్కడి నుంచి 60-70 ఏనుగులు మహారాష్ట్రకు తరలివెళ్లి అక్కడే సంచరిస్తున్నాయి. ఆ ప్రాంతం తెలంగాణలోని ఆసిఫాబాద్‌కు అనుకునే ఉంటుంది. ఆ మందలోని ఒక ఏనుగే ఇటీవల తెలంగాణకు వచ్చి విధ్వంసం సృష్టించి వెళ్లింది.
పర్యటకులను హడలెత్తించిన ఏనుగు- ఫొటోలు తీసేసరికి ఆగ్రహంతో దాడి
Couple killed in elephant attack : ఒంటరి ఏనుగు బీభత్సం.. దంపతులు మృతి, మరో యువకుడి పరిస్థితి విషమం