Elephant Died Mango Crop in Tirupati District : తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేట పంచాయతీ పరిధిలోని మామిడి తోటలో ఓ ఏనుగు అనుమానాస్పదంగా మృతి చెందింది. మామిడి తోట యజమాని ఏనుగు మృతిపై భాకరాపేట అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు ఏనుగు మృతికి గల కారణాలను అన్వేషిస్తున్నట్లు తెలిపారు. అటవీశాఖ అధికారులు వచ్చి పరిశీలన జరిపారు. గత కొద్ది రోజులుగా చిన్నగొట్టిగల్లు, యర్రావారిపాలెం మండలాల్లో సుమారు 17 ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు తెలిపారు. మృతి చెందింది మగ ఏనుగని వయసు సుమారు పది సంవత్సరాలు ఉంటుందన్నారు. ఏనుగు మృతికి కారణాలపై అన్వేషిస్తున్నట్లు తెలిపారు.
ఆహారం కోసం వచ్చి నదిలో చిక్కుకున్న ఏనుగు- గంటపాటు అవస్థలు - Elephant stuck in river
చిత్తూరు జిల్లాలో ఏనుగు బీభత్సం- దాడిలో రైతు మృతి - ELEPHANT Attack
బంగారం కోసం - కుమార్తె ఇంటి ఎదుట తల్లిదండ్రుల ఆందోళన