ETV Bharat / state

విద్యుత్ వినియోగంలో హైదరాబాద్​ ఆల్‌టైమ్‌ రికార్డ్ - 4053 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్ నమోదు - Electricity Demand Increased

Electricity Demand Increased In Hyderabad : గ్రేటర్​లో రోజురోజుకు విద్యుత్ డిమాండ్ పెరిగిపోతుంది. గ్రేటర్ పరిధిలో ఇవాళ ఆల్ టైమ్ రికార్డ్ నమోదైంది. తాజాగా గ్రేటర్​లో 4053 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్ నమోదైంది. దీంతో గతేడాది మే నెలలో వినియోగం రికార్డులను ఈ సంవత్సరం ఏప్రిల్​లోనే బద్దలు కొట్టింది. విద్యుత్ అవసరానికి అనుగుణంగా సరఫరాను అందించేందుకు నిరంతరం కృషిచేస్తున్నట్లు ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫారూఖీ పేర్కొన్నారు.

Power Consumption Increased In Hyderabad
Electricity Demand Increased In Hyderabad
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 18, 2024, 8:05 PM IST

Updated : Apr 18, 2024, 8:12 PM IST

Power Consumption Increased In Hyderabad : ఎండలు మండుతున్న వేళ గ్రేటర్ పరిధిలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగిపోతుంది. ఇవాళ గ్రేటర్​లో రికార్డ్ స్థాయిలో విద్యుత్ వినియోగం నమోదైనట్లు ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖి తెలిపారు. గత మూడేళ్ల డిమాండ్​తో పోల్చుకుంటే ఈ ఏడాది 16 నుంచి 20 శాతం విద్యుత్ డిమాండ్ పెరిగిందన్నారు. గ్రేటర్ హైదరాబాద్ నగరంలో విద్యుత్ డిమాండ్ రోజుకు పెరుగుతూ కొత్త రికార్డులను నెలకొల్పుతున్నది.

Power Usage Increased in Hyderabad : జనవరి నెలలో నిర్వహణ పనులు సమర్ధవంతంగా పూర్తి చేయడంతో పాటు, ఆర్టిసన్ నుంచి యాజమాన్యం వరకు నిత్యం అప్రమత్తంగా ఉండటం వల్ల ఇది సాధ్యమైందన్నారు. ఎక్కడైనా సరఫరాలో సమస్యలు ఎదురైతే వాటిని వెంటనే పరిష్కరించడంతో పాటు, ఈ సీజన్​లో అంచనాలకు మించి విద్యుత్ వినియోగం డిమాండ్ పెరిగినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా కొనసాగిస్తామని ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖి ధీమా వ్యక్తంచేశారు.

అప్పుడే పీక్​లో సమ్మర్ హీట్ - విద్యుత్ వినియోగంలో హైదరాబాద్​ ఆల్‌టైమ్‌ రికార్డ్ - Power Usage Increased In Hyderabad

Electricity Demand Increased In Hyderabad : గతేడాది మే 19వ తేదీన 3,756 మెగావాట్ల గరిష్ట డిమాండ్ నమోదు కాగా ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీన 3,832 గా నమోదయి గతేడాది మే నెల రికార్డును అధిగమించింది. గత మూడేళ్లుగా డిమాండ్ పరిశీలిస్తే ప్రతి ఏటా విద్యుత్ డిమాండ్ పెరిగిపోతుంది. 2022లో మార్చ్​లో 2,745 మెగావాట్లు, ఏప్రిల్​లో 3,092 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్ నమోదైంది. 2023లో మార్చ్​లో 2,814 మెగావాట్లు, ఏప్రిల్​లో 3,148 మెగావాట్ల సరాసరి డిమాండ్ నమోదైంది.

2024లో మార్చ్​లో 3,378 మెగావాట్లు, ఏప్రిల్​లో నేటి వరకు 3,655 మెగావాట్ల గరిష్ట డిమాండ్ నమోదైంది. 2023లో మార్చ్​లో 2.51శాతం, ఏప్రిల్​లో 1.81శాతం మెగావాట్లు గరిష్టంగా పెరిగింది. 2024లో మార్చ్​లో 20.04శాతం, ఏప్రిల్​లో నేటి వరకు 16.11శాతం మెగావాట్లు గరిష్టంగా నమోదైంది. 2022లో మార్చి​లో 57.45 మిలియన్ యూనిట్లు, ఏప్రిల్​లో 66.16 మిలియన్ యూనిట్ల గరిష్ఠ డిమాండ్ నమోదైంది. 2023లో ఏప్రిల్​లో 57.84 మిలియన్ యూనిట్లు, ఏప్రిల్​లో 66.80 మిలియన్ యూనిట్ల గరిష్ఠ డిమాండ్ నమోదైంది.

2024లో మార్చ్​లో 72.02 మిలియన్ యూనిట్లు, ఏప్రిల్​లో నేటి వరకు 78.55 మిలియన్ యూనిట్ల గరిష్ఠ డిమాండ్ నమోదైంది. 2023 మార్చ్​లో 0.68శాతం, ఏప్రిల్​లో 0.97శాతం మిలియన్ యూనిట్లు గరిష్ఠంగా నమోదైంది. 2024లో మార్చ్​లో 24.52శాతం మిలియన్ యూనిట్లు, ఏప్రిల్​లో 17.59శాతం మిలియన్ యూనిట్లు నమోదైనట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

మార్చ్ 2022తో పోల్చుకుంటే 2023లో గరిష్ఠ డిమాండ్​ కేవలం 2.5 శాతం పెరుగుదల ఉండగా 2024లో 20.04 శాతం పెరుగుదల నమోదయ్యింది. వినియోగంలో సైతం 0.68 శాతం కాగా, 2024లో 24 .52 శాతం నమోదయ్యింది. ఏప్రిల్ 2022తో పోల్చుకుంటే 2023లో గరిష్ట డిమాండ్​లో కేవలం 1.81 శాతం పెరుగుదల ఉండగా 2024లో నేటి వరకు 16 .11 శాతం విద్యుత్ పెరుగుదల నమోదయ్యింది. వినియోగంలో సైతం 0.97 శాతం కాగా, 2024 లో 17.59 శాతం పెరుగుదల నమోదైనట్లు అధికారులు పేర్కొంటున్నారు.

సమ్మర్​ ఎఫెక్ట్ ​- గిర్రున తిరుగుతున్న కూలర్లు, ఏసీలు - పెరుగుతున్న విద్యుత్​ వినియోగం - Power Demand Increased in Hyderabad

దంచికొడుతున్న ఎండలు - గిర్రుమంటోన్న కరెంట్ మీటర్ - Power Consumption In Telangana

Last Updated : Apr 18, 2024, 8:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.