ETV Bharat / state

రూపుదిద్దుకుంటున్న తెలుగు కీర్తి పతాక రామోజీ విగ్రహం - తుది మెరుగులు దిద్దుతున్న శిల్పి రాజ్‌కుమార్‌ వుడయార్‌ - Ramojirao Statue - RAMOJIRAO STATUE

Eenadu Group Chairman Ramojirao Statue: ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీ రావు విగ్రహాన్ని డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ జిల్లా కొత్తపేటకు చెందిన ప్రముఖ శిల్ఫీ రాజకుమార్ వుడయార్ రూపొందించారు. విజయనగరం ఎంపీ అప్పలనాయుడు విగ్రహాన్ని తయారు చేయాలని చెప్పడంతో కేవలం నాలుగు రోజుల్లోనే ఏడున్నర అడుగుల రామోజీ విగ్రహాన్ని సిద్ధం చేశారు.

ramoji_statue
ramoji_statue (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 15, 2024, 7:11 AM IST

Updated : Jun 15, 2024, 12:32 PM IST

Eenadu Group Chairman Ramojirao Statue : మీడియా దిగ్గజం, ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు విగ్రహం కోనసీమ జిల్లా కొత్తపేటలో రూపుదిద్దుకుంటోంది. విజయనగం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కోరిక మేరకు దీనిని ప్రముఖ శిల్పి రాజకుమార్‌ వుడయర్‌ తయారు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రతిమ తుది మెరుగులు దిద్దుతున్నారు. విశాఖలో ఈ విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని ఎంపీ అప్పలనాయుడు తెలిపారు.

రూపుదిద్దుకుంటున్న తెలుగు కీర్తి పతాక రామోజీ విగ్రహం - తుది మెరుగులు దిద్దుతున్న శిల్పి రాజ్‌కుమార్‌ వుడయార్‌ (ETV Bharat)

ఆయన ఆలోచనలు, ఆశయాలు మా వెంటే ఉన్నాయి - మేమంతా వాటిని కాపాడాలి: రామోజీరావు మనవరాలు కీర్తి సోహన - Ramoji Rao Grand Daughter Interview

Ramoji Rao Statue Making in Konaseema District : ఈ నెల 8న ( జూన్​ 8న) పరమపదించిన అక్షర సూర్యుడు, ఈనాడు గ్రూప్‌ సంస్థల అధినేత రామోజీ రావు విగ్రహం రూపుదిద్దకుంటోంది. ఆంధ్రప్రదేశ్‌ ఆస్థాన శిల్పి రాజ్‌కుమార్‌ వడయార్‌ కోనసీమ జిల్లా కొత్తపేటలో విగ్రహానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. అనేక చిత్రాలు పరిశీలించి చివరికి 60 ఏళ్ల వయసులో రామోజీరావు ఎలా ఉన్నారో అలాంటి మూర్తి తయారీకి ఉపక్రమించారు. ఏడున్నర అడుగుల ఈ విగ్రహానికి కేవలం నాలుగు రోజుల్లోనే పూర్తి రూపు తీసుకొచ్చారు. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు విగ్రహాన్ని పరిశీలించారు.

"రామోజీరావు బహుముఖ ప్రజ్ఞాశాలి. ఎంతో మందికి మార్గదర్శకత్వం చేసిన గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తి విగ్రహాన్ని తయారు చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. సిల్వర్​ నమోనాలో తయారు చేస్తున్నాం. నవంబరు 16న ఆయన పుట్టినరోజు సందర్భంగా రామోజీరావు విగ్రహాలను పెట్టాలని అనుకుంటున్నాం. సుమారు 25 వరకు రూపొందిస్తున్నాం. నగరాల్లో, ఇతర రాష్ట్రాల్లో కూడా పెట్టాలనే సంకల్పం ఉంది"_ రాజ్​కుమార్​ వడయార్​, ప్రముఖ శిల్పి

తాతయ్య చిన్న ప్రశంస ఏళ్ల పాటు ఇంధనంలా పని చేస్తుంది : రామోజీరావు మనవరాలు బృహతి - RAMOJI RAO Grand Daughter Interview

MP Appalanaidu Made Ramajirao Statue : తెలుగువారి స్ఫూర్తి ప్రదాత రామోజీరావు విగ్రహం తయారు చేసే భాగ్యం తనకు దక్కడం అదృష్టమని శిల్పి రాజ్‌కుమార్‌ వుడయార్‌ తెలిపారు. విగ్రహాన్ని ఈనాడు పత్రిక స్థాపించిన విశాఖలో ప్రతిష్టిస్తామని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు.

"రామోజీరావు తెలుగు ప్రజలకు చేసిన సేవకు గుర్తుగా ఆయన విగ్రహాన్ని రూపొందిస్తున్నాం. ప్రధానంగా ఏపీలోని విశాఖపట్నంలో ఏర్పాట్లు చేస్తున్నాం. అక్కడ నుంచే ఈనాడు ప్రజలకు అండగా నిలబడడం మొదలైంది. విగ్రహాలను రానున్న రోజుల్లో మరిన్ని ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం"_ కలిశెట్టి అప్పలనాయుడు

"ప్రతీ ఉద్యోగి ఓ సమర్థ నిబద్ధ సైనికుడై కదలాలి" - రామోజీరావు బాధ్యతల వీలునామా - Will and testament of Ramoji Rao

Last Updated : Jun 15, 2024, 12:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.