ETV Bharat / state

Eenadu@50 : ప్రజాస్వామిక హక్కుల కోసం - 50 ఏళ్లుగా ఈనాడుది అక్షరాలా ప్రజాపక్షమే - Eenadu Golden Jubilee Celebrations

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 7, 2024, 6:01 AM IST

Updated : Aug 7, 2024, 12:43 PM IST

Eenadu Golden Jubilee Celebrations : సమాజంలో జరిగే మంచిచెడులు విశ్లేషించే బృహత్తర బాధ్యత పత్రికలది! అందులో కొన్ని పత్రికలు ప్రతిపక్ష పాత్ర పోషిస్తే, కొన్ని అధికారపక్షానికి సాగిలాపడతాయి. 50 ఏళ్లుగా ఈనాడుది అక్షరాలా ప్రజాపక్షమే! ఈనాడు ఎవరితోనూ అంటకాగదు! అకారణంగా ఎవర్నీ ద్వేషించదు! ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడితే తిరిగి నిలబెడుతుంది. అరాచకం రాజ్యమేలితే కలబడుతుంది. పాలనా వ్యవస్థలు దారితప్పిన ప్రతిసారీ సంపాదకీయాల్లో మందుగుండు చొప్పించి, పతాక శీర్షికల్లో అక్షర ఫిరంగులు పేల్చిన పోరాట బావుటా 'ఈనాడు'!

Eenadu 50 Years Celebrations
Eenadu Golden Jubilee Celebrations (ETV Bharat)

Eenadu 50 Years Celebrations : 1975 జూన్‌ 25 దేశ చరిత్రలోనే చీకటి అధ్యాయం! అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ అర్ధరాత్రి నుంచి ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ఆకాశవాణి ద్వారా ప్రకటించారు. అప్పటికి పుట్టి ఏడాదైనా కానీ ఈనాడుకు అది పిడుగుపాటే! ప్రజా ప్రయోజనాలకు ఎవరు నష్టం చేసినా, ప్రజల హక్కులను ఎవరు కాలరాసినా రామోజీరావు సహించరు. అవతల ఎంతటి వారైనా కానీ, ఎలాంటి పర్యవసానాలైనా లెక్కచేయక ముందుండి పోరాడే ధీశాలి ఆయన. ఎమర్జెన్సీలో పత్రికలపై సెన్సార్‌షిప్ విధించటాన్ని రామోజీరావు బాహాటంగానే ఎదిరించారు.

రామోజీరావును దెబ్బకొట్టాలని విఫలయత్నం : 50 ఏళ్ల ప్రస్థానంలో ఈనాడుది ఎప్పుడూ ప్రజాపక్షమే! అది గ్రహించిన పాలకులు తప్పులు సరిదిద్దుకుని ముందుకు వెళ్తే, గిట్టని పాలకులు ఈనాడును అణగదొక్కాలని చూశారు. రామోజీరావును దెబ్బకొట్టాలని విఫలయత్నం చేశారు. తప్పుడు కేసులతో వేధించాలని చూసి భంగపడ్డారు. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ కుంభకోణాల్ని ఈనాడు కడిగి పారేసింది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రజల ఆస్తుల్ని అప్పనంగా కొట్టేసిన వ్యవహారాల్ని సాక్ష్యాలతో పాఠకుల ముందుంచింది. నీకిది - నాకది అంటూ వేల ఎకరాల భూములు, సహజ వనరుల్ని కట్టబెడుతున్న పన్నాగాన్ని, తెర వెనుక కుటుంబాల్ని నడిబజార్‌లో నిలబెట్టింది. అవి సహించలేని వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఈనాడుపై అధర్మ యుద్ధానికి దిగారు. ఈనాడు గ్రూపు సంస్థల ఆస్తుల విధ్వంసానికి వ్యూహరచన చేశారు.

ఈనాడు ఏనాడూ తలదించదు : అసైన్డ్‌ భూముల సాకుతో రామోజీ ఫిల్మ్‌సిటీలో షూటింగ్‌ కోసం నిర్మించిన భవనాల్ని కసిగా కూలగొట్టించారు. ఏపుగా పెంచిన చెట్లనూ కూకటివేళ్లతో పెకిలించేశారు. ఫిల్మ్‌సిటీ పరిసర గ్రామాలకు ఉపయోగపడుతున్న రోడ్లనూ జేసీబీలతో తవ్వించారు. అయినా రామోజీరావు వెనకడుగు వేయలేదు. ‌ప్రభుత్వ వేధింపులను చట్టపరంగానే ఎదుర్కొన్నారు. ఓవైపు న్యాయపోరాటం చేస్తూనే, అక్షర సమరం సాగించారు. ఈనాడును ఆదరించిన ప్రజల కష్టం ముందు, తనకు జరిగిన నష్టం ఏపాటిదనే ప్రశ్నే, సవాళ్ల సమయంలో రామోజీరావును మొండి మనిషిగా మార్చింది. అక్షరం రాజీపడటం రాజద్రోహంతో సమానమన్నది రామోజీరావు భావన. అందుకే ఈనాడు ఏనాడూ తలదించదు. తెలుగు జాతిని తలెత్తుకునేలా చేస్తుందే తప్ప తలవంపులు తేలేదు.

దుర్మార్గాలపై అసాధారణ పోరాటం : పాలకుడు నియంత అయితే, అవినీతి వ్యవస్థీకృతం అవుతుంది. హద్దులు మీరిన అధికార కాంక్ష ప్రజాకాంక్షలను బలిపెడుతుంది. 2019 నుంచి 2024 వరకూ రాష్ట్రంలో జరిగిందదే. నయాఫాసిస్ట్‌ పాదాల కింద ప్రజాస్వామ్యం నలిగిపోతుంటే ఈనాడు సహించలేకపోయింది. 2019 నుంచి 2024 వరకూ జగన్‌ దుర్మార్గాలపై అసాధారణ పోరాటం జరిపింది. ప్రశ్నిస్తే వేధింపులు, అడ్డుకుంటే అరెస్టులతో రాష్ట్రంలో ఓ భయకంపిత వాతావరణంలో విలవిల్లాడుతున్న జనావేదనకు ఈనాడు గొంతుకైంది. ప్రభుత్వ రాక్షసకాండను నిర్భీతిగా ఎండగట్టింది.

Eenadu@50 : నిత్యం ఉషోదయాన సత్యం నినదిస్తున్న సమాచార విప్లవ శంఖారావం 'ఈనాడు' - EENADU Golden Jubilee Celebrations

అక్షరానిదే అంతిమ విజయం : అక్షరానికి, అహంకారానికి హోరాహోరీ యుద్ధం జరిగింది. అందులో సకల రాక్షస గణాలన్నీ ఏకమైనా ఈనాడు ఒక్కటే ఒకవైపు నిలబడి కొట్లాడింది. చివరకు ఈనాడుపై కోపంతో ఆర్థిక క్రమశిక్షణకు మారుపేరైన మార్గదర్శిపైకి సీఐడీని ఉసిగొల్పారు. సోదాలంటూ చందాదారుల్ని భయపెట్టారు. అయినా రామోజీరావు రాజీపడలేదు. కుతికమీద కత్తిపెట్టినంత పని చేసినా అక్షర యుద్ధం ఆపలేదు. 2024 ఎన్నికల్లో అరాచక పాలన నుంచి ఏపీకి విముక్తి ప్రసాదించడంలో తన వంతు పాత్ర విజయవంతంగా పోషించింది. అక్షరానిదే అంతిమ విజయమని చాటింది.

అదీ ఈనాడు అక్షరానికి ఉన్న నిబద్ధత : ఈనాడు శక్తిసామర్థ్యాలు, వార్తల విశ్వసనీయత, అచంచల ప్రజాదరణను గిట్టనివారూ గౌరవించి తీరాల్సిందే! కాంగ్రెస్‌ అప్రజాస్వామిక విధానాల్ని ఎండగడుతున్న ఈనాడు విజయవాడ ఎడిషన్‌ ప్రారంభోత్సవానికి నాటి సీఎం మర్రి చెన్నారెడ్డిని ఆహ్వానించినా ఆయన రాలేదు. అదే చెన్నారెడ్డి తాను నిద్రలేవగానే తన ముందు ఈనాడు పేపర్‌ ఉండాలంటూ ఒకానొక సందర్భంలో చెప్పడం ఈనాడు వార్తా ప్రమాణాల గౌరవానికి నిదర్శనం! వరదలు, తుపాన్ల సమయంలో క్షేత్రస్థాయి పరిస్థితుల్ని ఆకళింపు చేసుకోవడానికి తనకు ఈనాడు ఎంతో సహాయకారిగా ఉందంటూ ఓ సమయంలో మంత్రివర్గ సహచరులు, అధికారులతో చెన్నారెడ్డి చెప్పారు. అదీ ఈనాడు అక్షరానికి ఉన్న నిబద్ధత, విశ్వసనీయత!

రామోజీరావు క్షమాపణ చెప్పాలంటూ : పత్రికా స్వేచ్ఛపై రామోజీరావు రాజీలేని పోరాటమే ఈనాడుకు చెక్కుచెదరని ఆత్మస్థైర్యం. దానికి నిదర్శనమే 1983 మార్చి 9న శాసన మండలిలో తలెత్తిన వివాదం. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల రద్దుపై 'పెద్దల గలభా' శీర్షికతో ఈనాడు వార్త ప్రచురించింది. రామోజీరావును అప్రతిష్ట పాలు చేయాలని కుట్ర పన్నిన కొన్ని స్వార్థ శక్తులు, రామోజీరావు సభకు వచ్చి క్షమాపణ చెప్పాలంటూ మంకుపట్టు పట్టాయి. ఇంగ్లీష్‌లో ఎల్డర్స్ అంటే తెలుగులో పెద్దలు అని, తాను ఎలాంటి క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదని రామోజీరావు తేల్చి చెప్పారు. అయితే రామోజీరావును సభకు పిలిపించి మందలించాల్సిందేనంటూ 1984 ఫిబ్రవరి 27న సభా హక్కుల సంఘం సిఫారసు చేసింది.

రాజ్యాంగ సంక్షోభాన్ని సృష్టించే ప్రయత్నం : రామోజీరావును అరెస్ట్‌ చేయాలని శాసనమండలి నాటి హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ విజయరామారావును ఆదేశించింది. మండలి ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వగా, అరెస్ట్ చేయాల్సిందేనని మండలి సభ్యులు పట్టుబట్టారు. ఏ వ్యవస్థ గొప్పదో తేలాలంటూ కాంగ్రెస్‌ ఎమ్మెల్సీలు రాజ్యాంగ సంక్షోభాన్ని సృష్టించే ప్రయత్నం చేశారు. ఈ సందిగ్ధంపై రాష్ట్రపతి సలహా కోరిన నాటి సీఎం ఎన్టీఆర్‌, అప్పటిదాకా రామోజీరావును అరెస్టు చేయొద్దని విధాన పరిషత్‌కు విజ్ఞప్తి చేశారు. అయినా విధాన పరిషత్‌ ఛైర్మన్‌ ఒత్తిళ్లతో 1984 మార్చి 28న నాటి హైదరాబాద్‌ సీపీ విజయరామారావు ఈనాడు కార్యాలయానికి వెళ్లారు. వారెంట్‌ అందించారు.

Eenadu@50 : నలుచెరుగులా ఈనాడు జైత్రయాత్ర – ఇది తెలుగు ప్రజల గుండెచప్పుడు - Eenadu Golden Jubilee Celebrations

తేల్చిచెప్పిన రామోజీరావు : అది తీసుకున్న రామోజీరావు సుప్రీంకోర్టు స్టే ఉత్తర్వుల్ని రివర్స్‌లో విజయరామారావుకు అందించారు. దాన్ని చూసిన పోలీస్‌ కమిషనర్‌ మీరు రావాలనుకుంటే రావొచ్చని, రావడం ఇష్టం లేకపోతే అరెస్టు చేయనని రామోజీరావుతో చెప్పారు. అరెస్ట్‌ చేసి తీసుకెళ్తే తప్ప తనకు రావాల్సిన అవసరం లేదని రామోజీరావు తేల్చి చెప్పారు. అలా విజయరామారావు అక్కడి నుంచి ఉత్తచేతులతో వెనుదిరిగారు. ఈ పరిణామం జాతీయ స్థాయిలో పత్రికా స్వేచ్ఛపై విస్తృత చర్చకు దారి తీసింది.

అమ్ముడు పోని అంకుశాలు ఈనాడు అక్షరాలు : 1987లో ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియాగా రామోజీరావు బాధ్యతలు స్వీకరించడం ఈనాడుకు దక్కిన గౌరవం. ఆ సమయంలో ప్రభుత్వాల నుంచి పత్రికా స్వేచ్ఛకు వాటిల్లిన పెను విపత్తులకు వ్యతిరేకంగా పోరాడారు. జాతీయ స్థాయిలో తన పేరుతో పాటు ఈనాడు గౌరవాన్నీ కొత్త శిఖరాలకు చేర్చారు. ఈనాడుకు కలమే బలం. ఆ కలం ఎవరికీ గులాం చేయదు. అకారణంగా ఎవర్నీ ద్వేషించదు. ప్రజాస్వామ్య హక్కుల కోసం పిడికిళ్లు బిగిస్తుంది. అక్రమార్కులపై త్రివిక్రమిస్తుంది. వేధించే కొద్దీ పదును తేలుతాయే తప్ప, అమ్ముడు పోని అంకుశాలు ఈనాడు అక్షరాలు.

Eenadu@50 : నిన్నన్నది చరిత్ర - రేపన్నది భవిష్యత్ - నేడన్నదే నిజం - అదే ఈనాడు గమనం, గమ్యం - EENADU GOLDEN JUBILEE CELEBRATIONS

Last Updated : Aug 7, 2024, 12:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.