ETV Bharat / state

Eenadu@50 : నిత్యం ఉషోదయాన సత్యం నినదిస్తున్న సమాచార విప్లవ శంఖారావం 'ఈనాడు' - EENADU Golden Jubilee Celebrations

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 4, 2024, 6:00 AM IST

Updated : Aug 4, 2024, 10:12 AM IST

Eenadu Golden Jubilee Celebrations : ప్రతీ 30 ఏళ్లకు సమాజంలో తరం మారుతుంది. వాళ్ల తాలూకు ఆలోచన మారుతుంది. సినిమా వాళ్లు దాన్ని ట్రెండ్ అంటారు. మామూలు జనం జనరేషన్ అంటారు! ప్రతీ జనరేషన్‌లోనూ కొత్త ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్లే వాళ్లను టార్చ్‌ బేరర్ అంటారు.! తెలుగు పత్రికా ప్రపంచంలో ఆ టార్చ్‌ బేరరే 'ఈనాడు'.! కాలానుగుణంగా కొత్తదనం అద్దుకుని, నిత్యం ఉషోదయాన సత్యం నినదిస్తున్న సమాచార విప్లవ శంఖారావం 'ఈనాడు'.! నాలుగున్నర వేల సర్క్యులేషన్‌తో ప్రస్థానాన్ని ప్రారంభించి, 13 లక్షలకు పైగా సర్క్యులేషన్‌తో నంబర్‌ 1 తెలుగు దినపత్రికగా శిఖరాగ్రంపై సగర్వంగా స్థిరపడిపోయింది. ఈ నెల 10తో 50 ఏళ్ల అక్షర యాత్ర పూర్తి చేసుకుంటున్న ఈనాడు, ఆనాడు ఎలా పుట్టింది? ఏపీలోని విశాఖ సాగర తీరంలో చిరుజల్లులా మొదలై, సమాచార తుఫాన్‌ ఎలా సృష్టించిందో ఇప్పుడు చూద్దాం.

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

EENADU 50 Years Celebrations : 1974 ఆగస్టు 10. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ సీతమ్మధార ప్రాంతంలోని ఓ మూతపడిన షెడ్డు. అందులో నుంచి అచ్చుగుద్దుతున్న శబ్ధం! ఆ క్షణంలో అక్కడేం జరుగుతోందో చుట్టుపక్కల వాళ్లకు అర్థం కాలేదు. ఆ తర్వాత అదే తెలుగునాట సమాచార విప్లవానికి నాంది పలికిన 'ఈనాడు' పుట్టింటి చిరునామా అయ్యింది. చీకటి తెరలు చీల్చుతూ, రేపటి ఉదయాన్ని పాఠకులకు చూపింది ఈనాడు. ప్రాంతీయ పత్రికగా అలా మొదలైన ప్రస్థానం, అత్యధిక సర్క్యులేషన్‌ కలిగిన తెలుగు పత్రికగా శిఖరాగ్రాన్ని అధిష్ఠించి, సగర్వంగా స్వర్ణోత్సవం జరుపుకుంటోంది ఈనాడు.

EENADU 50 YEARS JOURNEY
Eenadu Golden Jubilee Celebrations (ETV Bharat)

50 ఏళ్ల యంగ్‌ ఈనాడులో 35 ఏళ్లు నేనూ ఒక పాత్ర పోషించడం, సంస్థలో బాధ్యతాయుతంగా పని చేయడం గర్వకారణం. సంస్థలో చేరినప్పుడు సంస్థ క్రమశిక్షణ, ఛైర్మన్‌ గారి క్రమశిక్షణ పుణికి పుచ్చుకోవడం వల్ల ఇది సాధ్యమైందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సంస్థలో ఉన్నవారితో పాటు నాకూ అదే క్రమశిక్షణ. దానివల్లే ఈ ప్రయాణం కొనసాగుతోంది. - సీహెచ్‌ కిరణ్‌, ఈనాడు ఎండీ

50 ఏళ్ల క్రితం తెలుగుజాతి కీర్తిపతాకగా ఈనాడును ఎగురవేసింది అక్షర రుషి రామోజీరావు. నిజానికి ఆయనకు పత్రిక పెట్టాలనే ఆలోచనే లేదు. కాకతాళీయంగా అనుకోని ఓ ప్రయాణం, అందులోని ఓ పరిణామం, 'ఈనాడు' దిన పత్రిక ఆవిర్భావానికి నాంది పలికింది. ఒకరోజు రామోజీరావు విమానంలో ప్రయాణిస్తున్నారు. అనుకోకుండా పక్క సీటులో నాటి ఆంధ్రజ్యోతి వ్యవస్థాపకుడు కేఎల్‌ఎన్‌ ప్రసాద్‌ ఉన్నారు. వారితో రామోజీరావు మాటలు కలిపారు. వ్యాపార పనుల నిమిత్తం తాను తరచూ విశాఖ వెళ్తుంటానని, అక్కడికి మీ పత్రిక మధ్యాహ్నం వరకు రావట్లేదని వారి దృష్టికి తెచ్చారు. విశాఖలోనే ఎడిషన్ మీరు ఎందుకు ప్రారంభించకూడదని కేఎల్‌ఎన్‌కు సూచన చేశారు. పేపర్ పెట్టడం అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదంటూ కేఎల్‌ఎన్‌ ఇచ్చిన సమాధానం రామోజీరావును నొప్పించింది. అందుకు కారణమూ లేకపోలేదు.

తెలుగు గడ్డపై తెలుగు పత్రికలు వెనకబడటం ఏంటి? రామోజీరావుకు పరిచయస్థులైన టి.రామచంద్రరావు ఎడ్వర్ టైజింగ్ రంగంలో పని చేసేవారు. ఆయన్ని చూసి రామోజీరావుకు ఎడ్వర్ టైజింగ్ రంగానికి సంబంధించిన మెళకువలు తెలుసుకోవాలని ఆసక్తి కలిగింది. చదువు పూర్తయ్యాక దిల్లీలోని ఒక అడ్వర్ టైజింగ్ ఏజెన్సీలో ఆర్టిస్ట్‌గా ఉద్యోగంలో చేరారు రామోజీరావు. మూడేళ్లు అక్కడ పనిచేశాక తిరిగి హైదరాబాద్ వచ్చారు. ఆ రోజుల్లో తెలుగునాట గోయంకాలకు చెందిన ఆంధ్రప్రభదే అత్యధిక సర్క్యులేషన్‌. తెలుగు వారు స్థాపించిన పత్రికలు తర్వాతి స్థానాల్లో ఉండేవి. తెలుగు గడ్డపై తెలుగు పత్రికలు వెనకబడటం ఏంటి? అని ప్రశ్నించుకున్నారు రామోజీరావు. ఆ కారణంతోనే కేఎల్‌ఎన్‌ ప్రసాద్‌కు సూచన చేశారు. కానీ కేఎల్‌ఎన్‌ అసాధ్యం అనడంతో రామోజీరావులో పట్టుదల పెరిగింది. అసాధ్యాన్ని ఎందుకు సుసాధ్యం చేయలేం? అనే ఆలోచన రేకెత్తింది.

అందరిలో ఒకడిలా కాకుండా : పత్రిక పెట్టడమైతే ఫిక్స్. మరి ఎక్కడ పెట్టాలి? ఎలా మొదలుపెట్టాలి? అప్పట్లో తెలుగు వార్తా పత్రికలన్నీ విజయవాడలోనే అచ్చయ్యేవి. అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు రవాణా అయ్యేవి. విశాఖకు పత్రిక రావాలంటే, విజయవాడ నుంచి వచ్చే రైలే దిక్కు. రైలులో పత్రికలు వచ్చి, పాఠకులకు చేరేలోపే ఏ మధ్యాహ్నమో అయ్యేది. ఉత్తరాంధ్రలోని ఇతర ప్రాంతాలకు సాయంత్రానికి చేరినా గొప్పే. తానూ విజయవాడలో పత్రిక పెడితే అందరిలో ఒకణ్ని అవుతాను, మిగతా పత్రికలకు పోటీదారు అవుతానే తప్ప ప్రత్యేకత ఏముంటుంది? అదే మధ్యాహ్నం వరకు పత్రిక మొహం చూడలేని ఉత్తరాంధ్రలో అయితే తానే మొదటివాడిని అవుతా అనుకున్నారు రామోజీరావు. అసలు పత్రిక ప్రింటింగే లేని విశాఖలోనే మొదటి అడుగు వేయాలని నిశ్చయించుకున్నారు. చైనా యుద్ధతంత్రమైన 'నో మ్యాన్ ల్యాండ్ థియరీ' కూడా అందుకు ప్రేరణ అని చెప్పేవారు రామోజీరావు.

ఆ పదం లేకుండా పేపర్‌ పేరు : విశాఖలో పత్రిక పెట్టడం సాహసోపేతమైతే, దానికి ఎంచుకున్న పేరు సంచలనం. అప్పట్లో పత్రికలన్నీ ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, ఆంధ్ర జనత, ఆంధ్రజ్యోతి, విశాలాంధ్ర ఇలా 'ఆంధ్ర' పదంతో ఉండేవి. అలాంటి పరిస్థితుల్లో ఆంధ్ర పదం లేకుండా ఓ పేపర్‌ పేరు పెట్టడం సాహసోపేతమే. ఒకరిని అనుకరించడం అలవాటు లేని రామోజీరావు, అలాంటి సాహసమే చేశారు. పత్రికకు ఈనాడు అని పేరు పెట్టారు. 'నాడు' అంటే 'ప్రాంతము, రోజు' అని రెండర్థాలు ఉన్నాయి. ఈనాడు అంటే ఈ ప్రాంతం అనైనా అనుకోవచ్చు, ఈ రోజు అనైనా అనుకోవచ్చు.

మాస్ట్ హెడ్ కూడా వినూత్నమే : అలా పేరుతోనే ప్రాంతీయ అనుబంధం పరుచుకుంది 'ఈనాడు'. ఈనాడు పేరే కాదు, మాస్ట్ హెడ్ కూడా వినూత్నమే. మిగతా పత్రికల పేర్లన్నీ గుండ్రటి అక్షరాలతో ఉంటే, వాటికి భిన్నంగా ఉండాలనుకున్నారు రామోజీరావు. తాను స్థాపించిన కిరణ్ యాడ్స్‌లో పని చేసే నార్లకంటి స్వామి అనే ఆర్టిస్ట్‌కు మాస్ట్‌ హెడ్‌ రూపకల్పన బాధ్యతలు అప్పగించారు. నార్లకంటి స్వామి పలకల్లాంటి అక్షరాలతో ఈనాడు లోగో డిజైన్‌ చేయగా, అక్షరాల మధ్య గీతలు పెట్టించి తుది ముద్ర ఖరారు చేశారు రామోజీరావు. ఆ ముద్రే తెలుగు పాఠకుడి గుండెల్లో చెరగని ముద్రైంది.

ఉషోదయానే ప్రజల చేతిలో పేపర్ పెట్టాలనే పట్టుదలైతే ఉంది కానీ, పెట్టుబడే రామోజీరావు దగ్గర లేదు. నిధులు, యంత్ర సమీకరణ వంటి సవాళ్లు చీకట్లలా చుట‌్టుముట్టాలని చూశాయి. వాటన్నింటినీ సంకల్ప బలంతో అధిగమించారు రామోజీ. ఉన్న వనరులతోనే ఉన్నతంగా ఆలోచించారు. విశాఖ సీతమ్మధార ప్రాంతంలోని నక్కవానిపాలెంలో అప్పట్లో మూతపడిన ఓ స్టూడియో షెడ్లను లీజుకు తీసుకున్నారు. వాటిని బాగు చేయించారు. పత్రిక అచ్చువేయడానికి ముంబయిలోని నవ్‌హింద్ టైమ్స్‌ నుంచి సెకండ్‌ హ్యాండ్ డూప్లెక్స్ ఫ్లాట్ బెడ్ రోటరీ ప్రింటింగ్‌ ప్రెస్‌ కొన్నారు.

కార్మికుడితో స్విచ్ఛాన్‌ చేయించి : అప్పట్లోనే దాని ఖరీదు రూ.లక్షా ఐదు వేలు. దాదాపు ఐదారు రోజుల ముందే ట్రైల్‌ రన్‌ వేశారు. అంతా అనుకున్నది అనుకున్నట్లే సిద్ధమైంది. శుభగడియ రానే వచ్చింది. ఎలాంటి హంగూ, ఆర్భాటాల్లేవ్‌. 1974 ఆగస్టు 9న సాయంత్రం అందులో పని చేసే కార్మికుడితో స్విచ్ఛాన్‌ చేయించారు రామోజీరావు. అదే తూరుపు తెలవారక ముందే ముంగిళ్లకు చేరిన ఈనాడు ఫస్ట్ ఎడిషన్‌. అదే ఆగస్టు 10 నాటికి సంచిక. అప్పటి నుంచి ఈనాడు టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌. ఏ గోడ చూసినా 'నిత్యం ఉషోదయాన సత్యం నినదించు గాక' అనే తారకమంత్రమే.

యాజమాన్యాలకు నచ్చింది కాదు, పాఠకులు మెచ్చింది : మధ్యాహ్నం వరకూ న్యూస్‌ పేపర్‌ చూడటం ఎరుగని పాఠకుల మొహాల్లో ఉషోదయ కిరణాలు కనిపించాయి. ఈనాడు చూడగానే పాఠకులకు ఏదో ఆకర్షణ! ఓ కొత్త అనుభూతి. అదేంటో కాదు ప్రాంతీయ పరిమళం. అప్పట్లో తెలుగు వార్తా పత్రికలు ఓ మూస ధోరణిలో వెళ్లేవి. జాతీయ, అంతర్జాతీయ వార్తలు, బహిరంగ సభల్లో నేతల ప్రసంగాల్నే పతాక శీర్షికన అచ్చేసేవి. సగటు పాఠకుడి కోణంలో చూసిన రామోజీరావుకు అవి రుచించలేదు. చప్పగా అనిపించాయి. యాజమాన్యాలకు నచ్చింది కాదు, పాఠకులు మెచ్చింది అందించాలని అప్పుడే ఆయన సంకల్పించుకున్నారు.

ఈనాడు ఆవిర్భావ ఎడిషన్‌లోనే అది ప్రస్ఫుటించింది. ఈనాడు మొదటి సంచికలో వాటర్‌ గేట్‌ కుంభకోణంలో నాటి అమెరికా అధ్యక్షుడు నిక్సన్‌ రాజీనామాను బ్యానర్‌గా ప్రచురించారు. అంతే ప్రాధాన్యంతో ఆ పక్కనే ఆముదాలవలస చక్కెర ఫ్యాక్టరీ సీజనల్‌ కార్మికుల ఇబ్బందులకు అక్షర రూపం ఇచ్చారు. అప్పటి దాకా పత్రికల్లో విదేశీ వార్తలు, రాష్ట్ర రాజధాని వార్తలనే ఎక్కువగా చదువుకున్న పాఠకులు, స్థానిక వార్తలకు సింహాసనం వేస్తే అబ్బురపడ్డారు. ఈనాడు మనది అని అక్కున చేర్చుకున్నారు.

ఈనాడు మీ పత్రిక అని ఛైర్మన్‌ రామోజీరావు గారు అంటే, ఇది మా పత్రిక అని పాఠకులు గుండెల్లో పెట్టుకున్నారు. అది ఈనాడు ఖ్యాతి. ఈనాడు ప్రగతి. అలా ఈనాడు తెలుగు కుటుంబాల్లో ఒక భాగం అయిపోయింది. ఈనాడులో వార్త వస్తేనే నమ్మేలాంటి లక్షల మంది పాఠకులు ఈనాడుకు ఉన్నారు. అలాగే ఈటీవీలో కూడా. మిగతా ఛానల్స్‌లో వార్త వస్తే అది నిజమో కాదో తెలుసుకునేందుకు ఒక్కసారి ఈటీవీ పెట్టమంటారు. ప్రజలకు ఈనాడు మీదున్న నమ్మకం చాలా ముఖ్యమైంది. - ఎం.నాగేశ్వరరావు, ఈనాడు ఆంధ్రప్రదేశ్‌ సంపాదకులు

ఈనాడు రాకముందు పూర్తిగా సంస్కృత పదాలు వాడుతుండేవారు. ప్రజలకు ఆ భాష అర్థంగాక పాఠకులు పత్రికలకు దూరంగా ఉండేవారు. చిన్న చిన్న అక్షరాల్ని కూడబలుక్కుని చదివే వాళ్లకు కూడా ఓహో ఇలా జరుగుతుందా? ఇలా జరిగిందా అనేలా చిన్న చిన్న పదాలను పత్రికా భాషగా మార్చి ఒక మార్పు తెచ్చిన ఘనత రామోజీరావుది. తద్వారా వార్తా సమాచారం ప్రజల్లోకి వెళ్లడం, స్పందించడం, ప్రశ్నించడం జరిగింది. అర్థంకాని పదాలు ఉన్నట్టైతే ప్రజలు ఇప్పటికీ పత్రికలకు దూరంగా ఉండేవారు. - డీఎన్‌ ప్రసాద్, ఈనాడు తెలంగాణ సంపాదకులు

సమస్యలంటే దిల్లీ రాజకీయాలు కాదని, గల్లీల్లో నిస్సహాయ ప్రజలు అనుభవించే కష్టాలే పత్రికల ప్రాధాన్యం కావాలని నమ్మారు రామోజీరావు. 50 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో 'ఈనాడు'ది ఏనాడైనా అదే మాట, అదే బాట.

Last Updated : Aug 4, 2024, 10:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.