ETV Bharat / state

'ఎమ్మెల్యే బ్యాంకు లాకర్​లో 1.2 కిలోల బంగారు బిస్కెట్లు - 100కు పైగా రియల్ ఎస్టేట్ డాక్యుమెంట్లు' - MLA Gudem Mahipal Reddy bank locker - MLA GUDEM MAHIPAL REDDY BANK LOCKER

Patancheru BRS MLA Mahipal Reddy : పటాన్‌చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, అతని సోదరుడు మధుసూదన్ రెడ్డి చుట్టూ ఈడీ ఉచ్చు బిగిస్తోంది. ఇప్పటికే అక్రమ మైనింగ్ కేసులో విచారణ చేపట్టిన ఈడీ, తాజాగా వారి బ్యాంక్​ లాకర్లను తెరిచింది. భారీ మొత్తంలో బంగారంతో పాటుగా రియల్ ఎస్టేట్​కు సంబంధించిన పేపర్లను స్వాధీనం చేసుకుంది.

Patancheru BRS MLA Mahipal Reddy
Patancheru BRS MLA Mahipal Reddy (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 4, 2024, 12:45 PM IST

BRS MLA Gudem Mahipal Reddy bank locker : మైనింగ్‌లో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, అతని సోదరుడు మధుసూదన్ రెడ్డిపై కేసు నమోదు చేసిన ఈడీ దర్యాప్తును ముమ్మరం చేసింది. కేసులో భాగంగా వీరిద్దరినీ పలుమార్లు విచారించిన ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్, పటాన్‌చెరులోని యాక్సిస్ బ్యాంక్‌లో ఆయనకు సంబంధించిన బ్యాంకు లాకర్లను తెరిచింది. అందులో భారీ మొత్తంలో బంగారం, రియల్ ఎస్టేట్ పేపర్లు ఉన్నట్లు ఈడీ గుర్తించింది.

ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పేరుతో రిజిస్టరైన సుమారు రూ.కోటి విలువైన 1.2 కిలోల బంగారు బిస్కెట్లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు 100కు పైగా రియల్ ఎస్టేట్ డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇవన్నీ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, కుమారుడు విక్రమ్ రెడ్డి, మధుసూదన్ రెడ్డితో పాటు పలువురు బినామీల పేర్లపై ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అక్రమ మైనింగ్ ద్వారా నిందితులు సుమారు రూ.300 కోట్లు సంపాదించినట్టు ఈడీ పేర్కొంది.
బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే - ఆయన బంధువుల ఇళ్లల్లో ఈడీ సోదాలు - ED Raids MLA Mahipal Reddy house

ఇదీ జరిగింది : సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డికి చెందిన సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్ క్వారీలో అవకతవకలపై ఈడీ దృష్టి సారించింది. అందులో భాగంగా జూన్ 26 తేదీన ఏకకాలంలో ఇద్దరి ఇళ్లపై ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. సోదాలు నిర్వహించిన సమయంలో కొన్ని దస్త్రాలను ఈడీ తీసుకెళ్లింది. అలాగే ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డి, ఎమ్మెల్యే కుమారుడు విక్రమ్ రెడ్డిలకు చెందిన ఐదు చరవాణిలను స్వాధీనం చేసుకుని తీసుకెళ్లారు.

ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డితో ఫోన్​ లాక్​లను తెరిపించారు. అందులో ఉన్న వివరాలు సేకరించారు. తాజాగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని కార్యాలయానికి పిలిచి అధికారులు విచారించారు. పటాన్‌చెరు యాక్సిస్ బ్యాంకులో ఉన్న వారి లాకర్లను తెరిచారు. అలాగే బ్యాంకు ఖాతా లావాదేవీలు కూడా తనిఖీ చేశారు. అలాగే ఎస్​బీఐ లాకర్లను కూడా తెరిచి క్షుణ్నంగా తనిఖీలు చేశారు. అయితే యాక్సిస్ బ్యాంకులో వారికి కీలకమైన పత్రాలు లభించినట్లు ఈడీ అధికారులు పేర్కొన్నారు.

అక్రమ మైనింగ్ కేసు - ఈడీ ఎదుట హాజరైన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.