ETV Bharat / state

''పెద్దాపూర్' ఘటన దిగ్భ్రాంతికి గురి చేసింది - ఇక నుంచి గురుకులాలపై ప్రత్యేక దృష్టి' - DY CM visits Peddapur Gurukul

DY CM Bhatti visits Peddapur Gurukul School : జగిత్యాల జిల్లాలో ఉన్న పెద్దాపూర్​ గురుకుల పాఠశాలను ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సందర్శించి తనిఖీ చేశారు. గురుకులంలో ఇటీవల మృతి చెందిన విద్యార్థి తల్లిదండ్రులను భట్టి పరామర్శించి, వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మరోవైపు గురుకులాన్ని భట్టి విక్రమార్క సందర్శించడంపై బీఆర్ఎస్​ నేత కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.

DY CM Bhatti visits Peddapur Gurukul School
DY CM Bhatti visits Peddapur Gurukul School (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 13, 2024, 5:15 PM IST

Updated : Aug 13, 2024, 10:35 PM IST

DY CM Bhatti visits Peddapur Gurukul School : పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో విద్యార్థుల మరణం చాలా బాధాకరమని, వీరి మరణం ప్రభుత్వాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం గురుకులాలపై ప్రత్యేక దృష్టి సారిస్తుందని తెలిపారు. జగిత్యాల జిల్లా మెట్​పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో 15 రోజుల వ్యవధిలో ఇద్దరు విద్యార్థుల మరణంతో పాటు నలుగురు విద్యార్థులు అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రి, మంగళవారం పాఠశాలను సందర్శించారు.

మరణించిన విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు గురుకుల పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశమై మాట్లాడారు. వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ సమయంలో విద్యార్థులను పోగొట్టుకొని పుట్టెడు దుఃఖంతో ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులు డిప్యూటీ సీఎం ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు. కుమారులను కోల్పోయి కంటతడి పెట్టిన తల్లిదండ్రులను భట్టి ఓదార్చారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం పాఠశాల ఆవరణలో కలియ తిరుగుతూ సమస్యలు తెలుసుకుని, పరిష్కరించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు : రాష్ట్రంలోని గురుకుల పాఠశాలలన్నీ పూర్తిగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని భట్టి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. గురుకులాల భవన నిర్మాణాలకు బడ్జెట్​లో రూ.5 వేల కోట్లు కేటాయించామని, పాఠశాలలో విద్యార్థులకు కావాల్సిన మౌలిక వసతులు పూర్తిగా అందిస్తామన్నారు. పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో మరణించిన విద్యార్థుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని, ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇల్లు కింద రూ.5 లక్షలతో ఇల్లు నిర్మిస్తామని, వారిలో ఒకరికి ఔట్​ సోర్సింగ్ ఉద్యోగాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు.

ప్రభుత్వం స్పందించడం సంతోషకరం : మరోవైపు ఉపముఖ్యమంత్రి గురుకుల పాఠశాలను సందర్శించడంపై బీఆర్ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ 'ఎక్స్'​ వేదికగా స్పందించారు. గురుకుల స్కూళ్ల సమస్యల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం సంతోషకరమని తెలిపారు. గురుకులాల్లో అంతా బాగానే ఉందన్న భావనతో కాంగ్రెస్​ సర్కారు ఉందని, తమ ప్రయత్నంతో కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర నుంచి మేల్కొవడం సంతోషకరమని కేటీఆర్​ పేర్కొన్నారు. కేసీఆర్​ ప్రభుత్వ హయాంలో 1000కి పైగా గురుకులాలను ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. గురుకులాల్లో ఆహార నాణ్యతను మెరుగుపరిచి విద్యార్థుల జీవితాలను కాపాడేందుకు ముఖ్యమంత్రి అన్ని రకాల చర్యలు చేపట్టాలని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

వరుసగా అస్వస్థతకు గురవుతున్న విద్యార్థులు - పెద్దాపూర్ గురుకులంలో ఏం జరుగుతోంది? - Peddapur Gurukul Student Died

అనారోగ్యాల బారిన పడుతున్న గురుకుల విద్యార్థులు - ఒక్క రోజులోనే ముగ్గురికి అస్వస్థత - Gurukul Students illnesses

Last Updated : Aug 13, 2024, 10:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.