Highest Liqour Sales in Warangal : ఉమ్మడి వరంగల్ జిల్లాలో దసరా పండుగ సందర్భంగా మద్యం విక్రయాలు రాష్ట్రంలోనే రికార్డు బద్దలు కొట్టాయి. రాష్ట్రంలోనే పెరుగుదల అధికంగా నమోదైంది. మందు బాబుల వల్ల ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం చూస్తే అబ్బా అనాల్సిందే. వరంగల్ పట్టణ, రూరల్ పరిధిలో 49.88 శాతం, జనగామ జిల్లాలో 89.87 శాతం విక్రయాలు అధికంగా పెరిగాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తంగా 294 వైన్స్, 134 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి.
గతేడాది దసరా పండుగ సందర్భంగా రూ.95 కోట్ల 53 లక్షల అమ్మకాలు జరిగితే ఈసారి అదే 14 రోజుల్లోనే రూ.142 కోట్ల 76లక్షలకు చేరి రికార్డులను బ్రేక్ చేశాయి. దాదాపు రూ.48 కోట్ల 26లక్షలు ఎక్కువగా వచ్చాయి. ఈ నెల చివర్లో దీపావళి ఉండటంతో విక్రయాలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు భావిస్తున్నారు.
బెల్ట్ షాపుల ద్వారా: ఉమ్మడి వరంగల్ జిల్లాలో మద్యం విక్రయాలు ఎక్కువగా పెరగడానికి పలు కారణాలు ఉన్నాయి. అందులో ప్రధానమైంది వైన్ షాపు పరిధిలో ఉన్న బెల్ట్ షాపులు. వాస్తవానికి ప్రతి గ్రామంలో కిరాణ దుకాణాలు, ఇళ్లల్లోనూ మద్యం విక్రయిస్తున్నారు. వీటి నిర్వాహణకు ప్రత్యేక సమయం అని ఏమీ లేదు. కొన్ని ప్రాంతాల్లో 24 గంటలు కూడా మందు దొరుకుతోంది. డిజిటల్ పేమేంట్స్ కూడా విక్రయాలు పెరుగుదలకు కారణంగా ఉంటుందని నిర్వాహకులు భావిస్తున్నారు.
గ్రామాలే టార్గెట్: గ్రామీణ ప్రాంతాలతో పాటు నగర శివార్లలో బెల్ట్ షాపులు ఉండటంతో వారు వైన్స్‌ల నుంచి మద్యం తీసుకొని అధిక ధరలకు విక్రయిస్తున్నారు. మండల కేంద్రంలో సాధారణంగా జనాభాను బట్టి 3 నుంచి 4 వైన్ షాపులను ప్రభుత్వం కేటాయిస్తుంది. టెండరు ద్వారా లాటరీ పొందిన వారు షాపులను నిర్వహిస్తూ బెల్ట్ షాపుల ద్వారా గ్రామాల్లోకి మద్యం చేరవేస్తున్నారు.
వాస్తవానికి మద్యం రోజూ ఏరులై పారేది పల్లెల్లోనే ఇప్పటికీ ఎక్కవగానే ఉంటోంది. సిండికేట్‌గా ఏర్పడి వైన్ షాపుల యజమానులు అధిక లాభార్జన పొందుతున్నారని తెలిసింది. రాష్ట్రానికి ఎక్కువ ఆదాయం సమకూర్చేది కూడా ఎక్సైజ్ శాఖ కావడం గమనార్హం. యువత ఎక్కువగా కొనుగోలు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. విద్యార్థులు, పిల్లలకు మాత్రం విక్రయించలేదని చెప్పారు.
ఫోన్ పే కొట్టు - నచ్చిన బాటిల్ పట్టు - ఏపీలో కళకళలాడుతున్న మద్యం దుకాణాలు
వామ్మో! ఏందిరా సామీ - 11 రోజుల్లో రూ.1057 కోట్ల మద్యం తాగేశారా!