ETV Bharat / state

'ఫెయింజల్' ఎఫెక్ట్ - ఆ రెండు జిల్లాలు జలమయం - FEINZEL EFFECT IN ANDHRA PRADESH

ఫెయింజల్ తుఫాను ప్రభావం - నెల్లూరు, వైఎస్సార్‌ జిల్లాల్లో నీట మునిగిన పొలాలు

Fainjal Cyclone in Andhra Pradesh
FEINZEL EFFECT IN ANDHRA PRADESH (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 2, 2024, 12:01 PM IST

Feinzel Typhoon In AP : ఫెయింజల్‌ తుపాన్ ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. రోడ్లపైకి నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నెల్లూరు, వైఎస్సార్‌ జిల్లాల్లో పంట పొలాలు నీట మునిగాయి. మరోవైపు మరో రెండ్రోజులు వర్ష సూచనతో రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.

రైతులను వణికిస్తున్న ఫెయింజల్​ - తీర ప్రాంతాలకు రెడ్ అలెర్ట్

నెల్లూరు జిల్లాలో.. ఫెయింజల్ తుపాన్ తీవ్ర ప్రభావం చూపింది. తీరప్రాంతాల్లోని మండలాల్లో అత్యధికంగా వర్షపాతం నమోదైంది. తుపాన్ ప్రభావంతో కృష్ణపట్నం పోర్టు వద్ద 70మీటర్ల మేర సముద్రం ముందుకు వచ్చింది. మత్స్యకారులకు గత కొద్ది రోజులుగా వేట లేక అవస్థలు పడుతున్నారు. నెల్లూరు నగరంలోని అనేక కాలనీల్లోకి భారీగా వర్షపు నీరు చేరింది. అధికారులు ముందస్తు ప్రణాళికతో రైల్వే అండర్ బ్రిడ్జిల వద్ద నీరు ఎప్పటికప్పుడు బయటకుపోవడంతో నగరంలో ట్రాఫిక్ ఇబ్బందిలేకుండా కొనసాగింది. మంత్రి నారాయణ, ఆనం రామనారాయణరెడ్డి, కలెక్టర్ ఆనంద్ తుపాన్ జాగ్రత్తలపై సమీక్షలు నిర్వహించారు. కొన్నిచోట్ల వర్షాలకు నారుమళ్లు దెబ్బతిన్నాయి. లోతట్టు ప్రాంతాల్లో వేసిన నాట్లు మునిగిపోవడంతో రైతులు నీటిని బయటకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. వర్షాలు ఇలాగే కొనసాగితే నాట్లు పూర్తిగా దెబ్బతింటాయని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

''నెల్లూరు గ్రామీణ నియోజకవర్గం పొట్టెపాళెం వద్ద నెల్లూరు చెరువు కలుజు ప్రమాదకరంగా ఉంది. తుపాన్ ప్రభావంతో చెరువుకు భారీగా ప్రవాహం రావడంతో అప్రోచ్ రోడ్డు రెండు వైపులా కోతకు గురైంది. దీంతో ఐదు మండలాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు''-వాహనదారులు

వైఎస్సార్ జిల్లాలో.. బద్వేలు నియోజకవర్గంలోని కమలకూరు ఆనకట్ట పరిధిలో పంటలు నీటి మునిగాయి. కమలకూరు ఆనకట్టను 2012లో నిర్మించారు. ఇందుకు సంబంధించి కరకట్టల నిర్మాణం పూర్తి కాలేదు. దీంతో ఎగువ నుంచి వస్తున్న నీరు వల్ల పంట పొలాలు ముంపునకు గురవుతున్నాయి. ఇటు వైపుగా వచ్చే వాహనదారులు దీని వలన తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. అంతే కాకుండా సరిగ్గా కోత సమయాల్లో ఇలా వర్షాలు సంభవించటం వల్ల పంటలకు నష్టం వాటిల్లుతుందని వారు వాపోతున్నారు.

రైతులతో మంత్రి నాదెండ్ల: గుంటూరు జిల్లాలో తెనాలిలోని ఐతాన‌గ‌ర్‌లో స్థానిక రైతుల‌తో మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ స‌మావేశ‌మ‌య్యారు. రైతుల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి తెలిపారు. ఆఖ‌రి ధాన్యం బ‌స్తా వ‌ర‌కూ కొనుగోలు చేస్తామని రైతులు ఎవ‌రూ ఆందోళ‌న చెంద‌వ‌ద్దని హామీ ఇచ్చారు. ఒకవేళ ఏ రైస్ మిల్లర్ అయినా ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే వారి లైసెన్సులను రద్దు చేయిస్తామని ఆయన హెచ్చరించారు.

యానాంలో .. కేంద్రపాలిత ప్రాంతం యానాంలో భారీ వర్షానికి ప్రధాన వీధులన్నీ జలమయం అయ్యాయి. పిల్లారాయ వీధి, కూనం రెడ్డీ జంక్షన్, స్టేట్ బ్యాంక్ జంక్షన్, వెంకన్న టెంపుల్ స్ట్రీట్ మార్గాల్లో నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వం రోడ్లు నిర్మిస్తామని చెప్పి వంచించిందని నూతనంగా అధికారాన్ని చేపట్టిన కూటమి ప్రభుత్వమైనా సకాలంలో రోడ్లను పనులను పూర్తి చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేశారు.

ఫెయింజల్‌ తుపాన్ ఎఫెక్ట్ - పలుచోట్ల కురుస్తున్న వర్షాలు

ఎగిసిపడుతున్న రాకాసి అలలు - కోత బారిన తీరప్రాంత గ్రామాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.