ETV Bharat / state

త్వరలో డీఎస్సీ అనుబంధ నోటిఫికేషన్ - లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ వచ్చేలోపు జారీ! - తెలంగాణ డీఎస్సీ నోటిఫికేషన్​ 2024

DSC Notification Telangana 2024 : రాష్ట్రంలో ఉపాధ్యాయ ఖాళీలు ఉండకూడదన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలతో, మెగా డీఎస్సీకి విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో విద్యాశాఖలో పదవీ విరమణ చేయనున్న వారితో సహా పలు వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది మొత్తం 3, 800 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు పదవీ విరమణ చేయనున్నారు.

Telangana Govt Focusing On DSC Notification 2024
Telangana DSC Notification 2024
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 24, 2024, 9:58 AM IST

DSC Notification Telangana 2024 : లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ వచ్చేలోపు డీఎస్సీ అనుబంధ నోటిఫికేషన్‌ జారీకి కసరత్తు జరుగుతోంది. ఈక్రమంలో విద్యాశాఖలో పదవీ విరమణ చేయనున్న వారితో సహా పలు వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది మెుత్తం 3, 800 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు పదవీ విరమణ చేయనున్నారు.

వాస్తవానికి వారందరూ 2021లోనే పదవీ విరమణ చేయాల్సి ఉండగా ప్రభుత్వం రిటైర్‌మెంట్‌ వయసును మూడేళ్లు పెంచిన నేపథ్యంలో ఇప్పటి వరకు పనిచేస్తున్నారు. మార్చి నెలాఖరు నుంచి పదవీ విరమణలు ప్రారంభం కానున్నాయి. కొత్తగా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాల్సి ఉండటంతో పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే ఆయా గణాంకాలను సేకరించింది.

మెగా డీఎస్సీపై కసరత్తు - ఖాళీల లెక్క తేలుస్తున్న అధికారులు

Telangana Govt On DSC Notification 2024 : గత ఏడాది ఆగస్టులో 5,089 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి విద్యాశాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఖాళీల సంఖ్యను పెంచి మెగా డీఎస్సీ చేపట్టాలని ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయించింది. పాత నోటిఫికేషన్‌కు మరో 5 వేల ఖాళీలను కలిపి అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వనుంది. లోక్‌సభ ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చేలోపే అనుబంధ నోటిఫికేషన్‌ జారీ చేయాలని భావిస్తోంది.

ప్రత్యేక అవసరాల పిల్లల(సీడబ్ల్యూఎస్‌ఎన్‌)కు బోధించేందుకు దాదాపు 1,500 స్పెషల్‌ ఎడ్యుకేటర్‌ పోస్టులను కూడా భర్తీ చేయాలని అనుకుంటున్నారు. ఇప్పటికే పనిచేస్తున్న వారికి పదోన్నతులు తదితర వాటిపై సర్కారు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సీఎం రేవంత్‌రెడ్డి వద్ద మరోసారి చర్చించి తుది ఆమోదం పొందాల్సి ఉందని తాము అంతా సిద్ధం చేసి ఉంచామని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి.

మెగా డీఎస్సీ ద్వారా టీచర్ల భర్తీకి చర్యలు తీసుకోండి : సీఎం రేవంత్​ రెడ్డి

DSC Related Notification In Telangana 2024 : ఈ సంవత్సరం అత్యధికంగా హైదరాబాద్‌లో 370 మంది టీచర్లు పదవీ విరమణ చేయనున్నారు. మేడ్చల్‌లో-260, ఖమ్మం-240, రంగారెడ్డి 210, సంగారెడ్డి-200, నిజామాబాద్‌లో-190 మంది చేయనున్నారు. అతి తక్కువగా నారాయణపేటలో 40 మంది పదవీ విరమణ కానున్నారు. రాష్ట్రంలో మొత్తం మంజూరైన ఉపాధ్యాయ పోస్టులు 1.22 లక్షలు కాగా ప్రస్తుతం 1.03 లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. అంటే పనిచేస్తున్న వారిలో ఈ సంవత్సరం 3.7 శాతం మంది పదవీ విరమణ పొందనున్నారు.

మార్చి నెలాఖరులో 360 మంది రిటైర్ కానుండగా జూన్‌లో అత్యధికంగా 700 మంది విశ్రాంత ఉపాధ్యాయులుగా మారనున్నారు. పదవీ విరమణ చేయనున్న ఉపాధ్యాయుల్లో 80 శాతానికిపైగా పురుషులే ఉండటం విశేషం. ఇప్పుడు పదవీ విరమణ పొందుతున్న వారంతా 30 ఏళ్ల కిత్రం నియమితులైనవారు. ఆ సమయంలో మహిళలు ఉపాధ్యాయ కొలువుల్లో తక్కువగా ఉన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ 1996లో అమల్లోకి వచ్చిందని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.

త్వరలోనే మెగా డీఎస్సీ - 9,800 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ప్లాన్!

Telangana DSC Notification 2023 : 'రెండ్రోజుల్లో.. తెలంగాణ డీఎస్సీ నోటిఫికేషన్'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.