Drug Detection Devices in Telangana : రాష్ట్రంలో మాదకద్రవ్యాలపై కఠిన చర్యలు అమలవుతున్నా వాటి వినియోగం అధికమవుతున్న నేపథ్యంలో డ్రగ్స్ వినియోగదారుల్ని నిమిషాల వ్యవధిలో గుర్తించేందుకు తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో(టీఎస్ న్యాబ్) కొంత కాలంగా వినూత్న పరికరాలను వినియోగిస్తోంది. హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగిన డ్రగ్స్ ఫ్రీ హైదరాబాద్(Drug Free Hyderabad) కార్యక్రమంలో భాగంగా వీటిని ప్రత్యేకంగా ప్రదర్శించారు. డ్రగ్స్ పార్టీలో పాల్గొన్నట్లు తెలిసినా, వాడినట్లు అనుమానం వచ్చినా డ్రగ్ డిటెక్షన్ కిట్(Drugs Detection Kit) ఉపయోగించి రెండు నిమిషాల్లో తేల్చొచ్చు.
TSNab Using Drugs Detection Devices : అనుమానితుడి మూత్ర నమూనాలు సేకరించాక కిట్‌లో ఉంచుతారు. రెండు నిమిషాల్లో వ్యక్తి తీసుకున్న మాదకద్రవ్యం ఏంటో పరికరం సూచిస్తుంది. గంజాయి, కొకైన్, హెరాయిన్, ఎల్‌ఎస్‌డీ(Lysergic Acid Diethylamide) సహా 11 రకాల మత్తు పదార్థాలను గుర్తించే వీలు ఉంటుంది. అంతేకాకుండా లాలాజలాన్ని కూడా పరీక్షించవచ్చు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్, రేవ్ పార్టీలు జరిగినప్పుడు వీటిని ఎక్కువగా వాడుతున్నట్లు అధికారులు తెలిపారు. స్మగ్లర్లు మత్తు పదార్థాలను స్వీట్లు, చాకెట్లు, ఇతర పదార్థాల మధ్యలో ఉంచి తరలిస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో మాదకద్రవ్యాల గుట్టు తేల్చేందుకు చిన్న పరికరం ఉపయోగిస్తారు. డ్రగ్స్‌గా అనుమానించిన పదార్థం, పొడిని పరీక్షిస్తే వెంటనే గుర్తిస్తుంది.
పిల్లలపై ఒత్తిడి తేకండి - స్ట్రెస్ తట్టుకోలేకే వారు డ్రగ్స్‌కు బానిసవుతున్నారు : సందీప్ శాండిల్య
చిన్నారుల మనస్తత్వాన్ని గుర్తించే యాప్ : ఈ కార్యక్రమంలో భాగంగా ఓ స్టార్టప్ సంస్థ రూపొందించిన ‘యునైటెడ్ వి కేర్’ యాప్(United We care App) పనితీరును ప్రదర్శించారు. చిన్నారుల ప్రవర్తనలో అసాధారణ మార్పులు వచ్చినా, కొంత భిన్నంగా కనిపించినా మనస్తత్వాన్ని అంచనా వేసేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుంది. ఇది పూర్తిగా కృత్రిమ మేథ(Artificial Intelligence) ఆధారంగా పని చేస్తుంది. పేరెంట్స్ అందులో వచ్చే ప్రశ్నలకు సమాధానాలిస్తే మనస్తత్వాన్ని అంచనా వేస్తుంది. దీని ఆధారంగా కొన్ని సలహాలు సూచనలు ఇచ్చేలా రూపొందించినట్లు వి కేర్ యాప్ ప్రతినిధి సౌరభ్ బెనర్జీ వివరించారు.
Digital Magnifier For Drug Detection : కొన్ని సందర్భాల్లో డ్రగ్స్‌ను వినియోగించిన తర్వాత ఎలాంటి ఆనవాళ్లు లభించవు. మాదకద్రవ్యాలను తీసుకునేందుకు వినియోగించిన కవర్ మాత్రమే ఘటనా స్థలంలో దొరుకుతాయి. ఇలాంటి సమయాల్లో డిజిటల్ మాగ్నిఫయర్ ఉపయోగిస్తారు. ఈ పరికరాన్ని తలకు ధరించి దాని అద్దాల ద్వారా చూస్తే మిల్లీ గ్రాముల పరిమాణంలోని పదార్థం, వాడి పారేసిన రోలింగ్ పేపర్ల మీద ఆనవాళ్లను గుర్తించే వీలుంటుంది. ఘటనా స్థలంలో మాదకద్రవ్యాల ఆనవాళ్లు లేకుండా క్లీన్ చేసినా గుర్తించే అవకాశముంటుందని అధికారులు అంటున్నారు.
డ్రగ్స్ కేసులో గోవా మూలాలు - స్నాప్‌చాట్‌లో చాటింగ్ - కొకైన్ డోర్ డెలివరీ
నేవీ, NCB భారీ ఆపరేషన్- 3,300 కిలోల డ్రగ్స్ సీజ్- విలువ రూ.వెయ్యి కోట్లపైనే