Drone Port in Hyderabad : డ్రోన్ పైలట్లకు అధునాతన శిక్షణ కోసం ఇస్రోతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్‌తో తెలంగాణ రాష్ట్ర ఏవియేషన్ అకాడమీ ఈ మేరకు ఒప్పందం చేసుకుంది. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ సమక్షంలో ఎన్ఆర్ఎస్సీ డైరెక్టర్ ప్రకాశ్ చౌహాన్, రాష్ట్ర ఏవియేషన్ అకాడమీ సీఈసీ ఎస్.ఎన్.రెడ్డి ఒప్పందాలపై సంతకాలు చేశారు.
CM Order For Droneport In Hyderabad : డ్రోన్ పైలటింగ్, డేటా మేనేజ్మెంట్, డేటా అనాలసిస్‌పై, మ్యాపింగ్, ప్రాసెసింగ్ వంటి అంశాలపై శిక్షణ ఇస్తారు. అన్ని రంగాల్లోనూ డ్రోన్ల వినియోగం పెరిగిపోయిందని, పొలాల్లో ఎరువులు, పురుగుల మందులను చల్లేందుకూ రైతులు డ్రోన్లను వినియోగిస్తున్నారని అధికారులు సీఎంకు వివరించారు. కొన్నిచోట్ల స్వయం సహాయక సంఘాలు డ్రోన్లను ఉపాధి మార్గంగా ఎంచుకున్నారని తెలిపారు. వివిధ స్థాయిల ప్రభుత్వ అధికారులకు డ్రోన్లపై అవగాహన కల్పించేందుకు శిక్షణను ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు. దేశంలోనే వినూత్నంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ శిక్షణ కోర్సు నిర్వహించడం అభినందనీయమని, తమ వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ తెలిపారు.
అమెరికా స్థావరంపై డ్రోన్ దాడి - ముగ్గురు సైనికులు మృతి
CM Review Meeting on Drone Pilot : డ్రోన్ పైలట్ల శిక్షణ కోసం స్థలం కేటాయించాలని తెలంగాణ ఏవియేషన్ అకాడమీ అధికారులు సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. ప్రస్తుతం విమానాశ్రయంలోనే డ్రోన్ పైలట్లకు శిక్షణ ఇస్తున్నామని, అక్కడ రద్దీ వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు. పైలట్ల శిక్షణతో పాటు డ్రోన్ల తయారీ కంపెనీలు తమ ట్రయల్స్ నిర్వహించుకునేందుకు డ్రోన్ పోర్టు ఉపయోగపడుతుందని చెప్పారు. సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డ్రోన్‌పోర్టు కోసం 20 ఎకరాలను ఫార్మా సిటీ వైపు సేకరించాలని అధికారులను ఆదేశించారు. ఏవియేషన్ నిబంధనల మేరకు అభ్యంతరం లేని జోన్లోనే స్థలం కేటాయించాలని సూచించారు.
వరంగల్ విమానాశ్రయం పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పాడైన పాత రన్-వేలను నిర్మించడంతో పాటు అక్కడి నుంచి కమర్షియల్ ఆపరేషన్స్ నిర్వహించేందుకు సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని సూచించారు. కొత్తగూడెం, భద్రాచలం పరిసర ప్రాంతంలో విమానాశ్రయం ఏర్పాటుకు అవకాశాలను పరిశీలించి ఎయిర్ పోర్టు అథారిటీతో సంప్రదించాలని అధికారులను సీఎం ఆదేశించారు.
ఖమ్మం లోక్‌సభ స్థానంపై కాంగ్రెస్‌లో పోటాపోటీ - టికెట్ ఆశిస్తున్న ముగ్గురు మంత్రుల కుటుంబీకులు
సర్కార్ దవాఖానాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తాం : కాంగ్రెస్ మంత్రులు