ETV Bharat / state

డ్రైవింగ్ లైసెన్స్ పాత పద్ధతిలోనే - ఆర్టీఏ నయా రూల్స్​కు స్పందించని రాష్ట్ర ప్రభుత్వం! - Driving License same as old system - DRIVING LICENSE SAME AS OLD SYSTEM

Driving License New Rules Update : కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్​కు అప్లై చేయాలనుకుంటున్న వారికి బిగ్ అలర్ట్. శనివారం (జూన్​ 1) నుంచి అమల్లోకి రావాల్సిన కొత్త డ్రైవింగ్ లైసెన్స్​ రూల్స్ విషయంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర ప్రభుత్వ ప్రకటనకు ఇక్కడి ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో పాత విధానంలోనే లైసెన్సులు జారీ చేయాలని కేంద్రం నిర్ణయించింది.

Driving Licence same as old system
Driving License New Rules Update (eenadu.net)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 2, 2024, 4:28 PM IST

Driving Licence Same As Old System : డ్రైవింగ్‌ లైసెన్సులను పాత పద్ధతిలో యథావిధిగా రవాణాశాఖ ఆఫీస్​ల్లోనే జారీ చేయనున్నారు. డ్రైవింగ్‌ లైసెన్సింగ్‌ విధానాన్ని మరింత సరళతరం చేస్తున్నట్లు గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ మేరకు జూన్‌ 1 నుంచి కొత్త మార్గదర్శకాలు అమల్లోకి రానున్నట్లు తొలుత భావించినప్పటికీ, అందుకు తగినట్లు ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో పాత విధానంలోనే లైసెన్సులు జారీ చేయనున్నారు.

ట్రాన్స్​పోర్ట్ డిపార్ట్​మెంట్ వర్గాలు కూడా ఇదే స్పష్టం చేస్తున్నాయి. పాత పద్ధతిలోనే తొలుత లెర్నర్‌ లైసెన్సు కోసం స్లాట్‌ బుక్‌ చేసుకొని రాత పరీక్షకు సంబంధిత ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది. తర్వాత నిర్ణీత గడువులో లైసెన్సు కోసం డ్రైవింగ్‌ టెస్టులో పాల్గొని పాసైతేనే, పూర్తి లైసెన్సు అందించనున్నారు. కేంద్రం తొలుత జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారమైతే డ్రైవింగ్‌ లైసెన్సు కోసం ఆర్టీవో కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు.

Driving Licence New Rules Update : అందుకోసం ఈ బాధ్యతలను ప్రైవేటు డ్రైవింగ్‌ స్కూళ్లకు కట్టబెడుతున్నట్లు కేంద్రం గతంలో ప్రకటించింది. అందుకు ఆయా డ్రైవింగ్‌ స్కూళ్లు ఆర్టీఏ వద్ద రిజిస్ట్రేషన్‌ చేసుకొని లైసెన్సులు తీసుకోవాలి. ఆయా స్కూళ్లలో తొలుత నోటిఫికేషన్ అప్లై చేసుకొని టెస్టులో ఉత్తీర్ణత సాధిస్తే, సంబంధిత స్కూళ్లు వారికి ధ్రువపత్రాన్ని జారీ చేస్తాయి. వాటితో ఆర్టీవో కార్యాలయంలో లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకోవాలి.

లైసెన్సు లేని స్కూళ్లలో వాహన డ్రైవింగ్‌ నేర్చుకుంటే మాత్రం టెస్టుకు ఆర్టీఏ వద్ద హాజరుకావాల్సిందే. కొత్త మార్గదర్శకాలను అనుగుణంగా ఆయా స్టేట్ గవర్నమెంట్స్ నిబంధనలను నోటిఫై చేయాల్సి ఉంటుంది. కాగా ఇంతవరకు రేవంత్ సర్కార్ నుంచి ఎలాంటి నోటిఫికేషన్‌ రాలేదని ఆర్టీఏ అధికారులు తెలిపారు. ప్రైవేటు స్కూళ్ల కోసం ఎవరూ అప్లై చేయలేదని పేర్కొన్నారు. ప్రెజెంట్ లైసెన్సు తీసుకోవాలంటే పాత విధానమే అందుబాటులో ఉందని చెప్పారు.

Penalties on New Traffic Rules : కొత్త నిబంధనల ప్రకారం, దాదాపు 9 లక్షల పాత ప్రభుత్వ వెహికల్స్​ను దశలవారీగా తొలగిస్తారు. పర్యావరణ కాలుష్యం తగ్గించడమే దీని ప్రధాన లక్ష్యం. ఎవరైనా ర్యాష్ డ్రైవింగ్ చేస్తే రూ.1000 నుంచి రూ.2000 వరకు జరిమానా విధిస్తారు. మైనర్లు వాహనం నడుపుతూ పట్టుబడినట్లయితే రూ.25 వేలు పెనాల్టీ విధిస్తారు. అంతేకాదు సదరు వాహన యజమాని డ్రైవింగ్ రిజిస్ట్రేషన్ కార్డును కూడా రద్దు చేస్తారు. పట్టుబడిన మైనర్​కు 25 ఏళ్ల వయస్సు వచ్చేంత వరకు డ్రైవింగ్​ లైసెన్స్ సైతం జారీ చేయరు.

మీ పిల్లల చేతికి బైక్‌ ఇస్తే ఖతమే - నేటినుంచి కొత్త డ్రైవింగ్ రూల్స్‌ అమలు! - Driving Licence New Rules

అలర్ట్ : డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో కొత్త ట్విస్ట్ - మీకు తెలుసా?! - Driving Licence New Rules Update

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.