Drinking Water Problems in NTR District : ఎన్టీఆర్ జిల్లా నందిగామలో తాగునీటి సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టీడీపీ ప్రభుత్వంలో శాశ్వత మంచినీటి పథకం ఏర్పాటుకు రూ. 86 కోట్లు మంజూరు చేసి శంకుస్థాపన చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పథకానికి మళ్లీ శంకుస్థాపన చేసింది. ఈ పనులు కేవలం శంకుస్థాపనకే పరిమితం కావడంతో ప్రజలు తీవ్రంగా నీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. పది రోజులకు ఒకసారి కూడా తాగునీరు రావడం లేదని స్థానికులు వాపోతున్నారు. మున్సిపాలిటీ పాలకులు, అధికారులకు ఎటువంటి ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో వేసవిలో నీటి ఎద్దడితో ఇబ్బంది పడుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
నెల రోజుల నుంచి రాని తాగునీరు - ఖాళీ బిందెలతో మహిళల నిరసన
గత టీడీపీ ప్రభుత్వంలో శాశ్వత మంచినీటి పథకం ఏర్పాటుకు రూ. 86 కోట్లు మంజూరు చేసింది. ఆసియా మౌలిక వనరుల అభివృద్ధి బ్యాంక్ నుంచి ఈ నిధులను మంజూరు చేశారు. ఈ పనులు కేవలం శంకుస్థాపనకే పరిమితమయ్యాయి. దీంతో తాగునీటి సమస్య తీరట్లేదు. మంచినీటి కోసం డబ్బాలు తీసుకొని రక్షిత మంచినీటి పథకం ట్యాంకుల వరకు వస్తున్న అక్కడ నీరు ఉండట్లేదు. పక్కనే ఉన్న మినరల్ వాటర్ ప్లాంట్లో తాగునీరు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
WATER: కోట్లు ఖర్చు పెట్టినా.. తీరని దాహార్తి
'మున్సిపాలిటీ పరిధిలో ఒక్కొక్కరికి ప్రతిరోజు 138 లీటర్ల తాగునీరు సరఫరా చేయాలి. వారం పది రోజులకు ఒకసారి కనీసం 50 లీటర్లు కూడా సరఫరా చేయలేని దుస్థితిలో మున్సిపాలిటీ పాలకవర్గం ఉంది. స్థానిక వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమారులు సైతం తాగునీటి సమస్య పరిష్కారానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. శాశ్వత మంచినీటి పథకం నిర్మాణo గురించి పట్టించుకోలేదు. ఫలితంగా తాగునీటి సమస్య పట్టణ ప్రజలకు శాపంగా మారింది.' -స్థానికులు
తాగునీటి సమస్యను పూర్తిగా పరిష్కరిస్తాం: మంత్రి విశ్వరూప్
మున్సిపాలిటీ పాలకులు, అధికారులకు ఎటువంటి ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్ల వేసవి కాలంలో నీటి ఎద్దడితో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కనీసం పట్టణంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనం. రక్షిత మంచినీటి పథకం బోర్లలో నీరు తగ్గటం వల్ల సమస్య ఏర్పడుతుందని అధికారులు అంటున్నారు. ఇప్పటికైనా తాగునీటి సమస్యపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.