Drinking Water Problem in Beginning of Summer: వేసవి కాలం ప్రారంభంలోనే తాగునీటి సమస్య తీవ్రమైంది. మంచినీటి కోసం కృష్ణా జిల్లాలోని గ్రామీణ ప్రాంత ప్రజలు అల్లాడిపోతున్నారు. వారానికి ఒకసారి మాత్రమే కుళాయిలకు నీరు వస్తోందని వాపోతున్నారు. గుక్కెడు నీటి కోసం నీటి పంపుల వద్ద గంటల తరబడి ఉండాల్సిన దుస్థితి ఏర్పడిందని స్థానికులు చెబుతున్నారు. తమ గోడు పట్టించుకునే నాధుడే కరవయ్యాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని హామీలు గుప్పించిన వైసీపీ నేతల మాటలు గాలిలో కలిసిపోయాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నీటి కటకట - తాగునీటి కోసం ఒంగోలు వాసుల ఇక్కట్లు
Water Problem in Krishna District: కృష్ణా జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యలు మొదలయ్యాయి. ప్రధానంగా మచిలీపట్నం, అవనిగడ్డ, పెడన, గుడివాడ నియోజకవర్గాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రమైంది. గుక్కెడు నీటి కోసం ప్రజలు అల్లాడిపోతున్నారు. కుళాయిలకు వారానికి ఒకసారి మాత్రమే నీరు విడుదల చేస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. పంచాయితీ, మున్సిపల్ అధికారులకు ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాగునీరు సైతం కొనుగోలు చేయాల్సిన దుస్థితి వచ్చిందని ఆవేదన చెందుతున్నారు.
తాగునీటి సరఫరా బిల్లుల కోసం కాంట్రాక్టర్ల ధర్నా- గొంతెండుతున్న ప్రజలు
తాగునీరు లేక ప్రజలు అవస్థలు: నాలుగు నియెజకవర్గాల్లో వాటర్ ట్యాంకులు ఉన్నా మంచినీరు మాత్రం సక్రమంగా అందడం లేదు. తాగునీరు లేక అవస్థలు పడుతున్నామని వాపోతున్నారు. పనులు వదులుకొని పంపుల వద్ద పడిగాపులు కాస్తున్నామని ఆందోళన చెందుతున్నారు. వదిలిన కొద్దిపాటి నీరు కూడా సరిగా లేక ఆనారోగ్యం బారిన పడుతున్నామని అంటున్నారు. సముద్ర తీర ప్రాంతం కావడంతో బోర్లు వేసినా ఉప్పు నీరుగా వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని వైసీపీ నేతలు హమీలు ఇచ్చి ఐదు సంవత్సరాలు అవుతున్నా ఎటువంటి మార్పు లేదని ప్రజలు చెబుతున్నారు.
రంగు మారుతున్నా రంగంలోకి దిగని అధికారులు.!
నిలిచిపోయిన జలజీవన్ మిషన్ పనులు: కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన జలజీవన్ మిషన్ పథకం తొలివిడత పనులే నియోజకవర్గాల్లో ఇంకా పూర్తి కాలేదని స్థానికులు అంటున్నారు. మచిలీపట్నంలో జలజీవన్ మిషన్లో భాగంగా మొదట రూ.16.26 కోట్లను కేటాయించారు. ఆ నిధులతో మచిలీపట్నం గ్రామీణంలోని వివిధ గ్రామాల్లో 75 పనులు చేపట్టాలని నిర్ణయించారు. అభివృద్ది పనులు ప్రారంభించి సంవత్సరాలు గడిచిపోతున్నా ఇప్పటికీ పూర్తి కాలేదని స్థానికులు విమర్శిస్తున్నారు. మరొ వైపు అవనిగడ్డ, పెడన, గుడివాడ నియోజకవర్గాల్లో వాటర్ ట్యాంకుల నిర్మాణానికి వైసీపీ నాయకులు అర్భాటంగా శంఖుస్థాపనలు చేశారు కానీ పనులు మాత్రం ముందుకు సాగడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇంటింటికి కుళాయిలు ఎక్కడ ? - రోడ్డుపై మహిళల ఆందోళన
పూర్తికాని ట్యాంక్ నిర్మాణ పనులు: గత ప్రభుత్వ హయంలో ప్రతి ఇంటికి నీటి పంపులు ఉండేవని అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం పార్టీకి మద్దతుగా ఉన్నవారికి ఉంచి మిగిలిన వారికి తీసేశారని మండిపడ్డుతున్నారు. ప్రభుత్వం జల జీవన్ మిషన్లో భాగంగా కొన్ని గ్రామాల్లో ఇంటింటికి పైప్ లైన్‌ను వేసినా వాటర్ ట్యాంక్‌లకు కనెక్షన్ ఇవ్వలేదు. దీంతో పైపులు పాడవుతున్నాయని గ్రామస్థులు చెబుతున్నారు. ప్రభుత్వం స్పందించి గ్రామాల్లో వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులు ప్రారంభించి, త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతున్నారు.
ఐదేళ్లయినా పూర్తికాని తాగునీటి పథకం - 60 వేల మందికి అవస్థలు