ETV Bharat / state

ఐదేళ్లుగా పాలకుల నిర్లక్ష్యం - మురుగు కూపంగా మారిపోయిన నెల్లూరు నగరం - Drainage System in Nellore District - DRAINAGE SYSTEM IN NELLORE DISTRICT

Drainage System in Nellore District : స్వచ్ఛతకు నిలయమైన నెల్లూరు నగరం ఇప్పుడు మురుగు కూపంగా మారిపోయింది. నగరంలోని మురుగు కాలువల్లో చెత్త, పూడికలతో నిండిపోయాయి. దీని వల్ల చిన్నపాటి వర్షానికే నగరం మొత్తం జలమయమవుతున్నాయి. దీంతో నగర వాసులు దోమలతో అనారోగ్యాలకు గురవుతున్నారు. అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని నగర వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

drainage_system
drainage_system (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 16, 2024, 1:27 PM IST

Updated : May 16, 2024, 2:18 PM IST

ఐదేళ్లుగా పాలకుల నిర్లక్ష్యం - మురుగు కూపంగా మారిపోయిన నెల్లూరు నగరం (ETV Bharat)

Drainage System in Nellore District : రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి చెందుతూ స్వచ్చతకు మారుపేరుగా ఉన్న నెల్లూరు నగరం నేడు మురుగు కూపంగా మారిపోయింది. ఆహ్లాదకరమైన నగరాన్ని అందమైన స్మార్ట్‌ సిటీగా మార్చకుండా అధికారులు ఆమడ దూరం విసిరేశారు. నగర ప్రణాళికపై అధికారులకు చిత్తశుద్ది లేకపోవడంతో సింహపురి కాస్త దుర్వాసన నగరంగా మారిపోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
Nellore Urban Development : విశాలమైన నెల్లూరు నగర అభివృద్దిని దృష్టిలో ఉంచుకుని పూర్వీకులు పెన్నానది ఒడ్డున నగరాన్ని నిర్మించారు. వరద నీరు పారుదల కోసం 13 కిలోమీటర్లు కాలువలు నగరం చుట్టూ నిర్మాణం చేశారు. కాలువల పక్కనే రోడ్లు నిర్మాణం చేశారు. ఎంతో సుందరంగా నెల్లూరును మార్చారు. కాలానుక్రమంగా పంటకాలువలు కాస్తా మురుగు కాలువలుగా మారాయి. చెత్త, పూడికలతో నిండిపోవడంతో నగరం మొత్తం దుర్వాసన వ్యాపించింది. అధికారులు, కార్పోరేషన్ పాలకులకు ఆలోచన లేమీ కారణంతో పంటకాలువలన్నీ మురుగుకాలువలు మారాల్సి వస్తున్నాయి.

అధ్వానంగా డ్రైనేజీ వ్యవస్థ - ఇళ్లల్లోకి వస్తున్న మురుగు నీరు, పట్టించుకోని అధికారులు

Bad Drainage System in Nellore : నెల్లూరు నగరంలో ప్రస్తుతం 9 లక్షల మంది ప్రజలు అనారోగ్య వాతావరణంలో జీవనం సాగిస్తున్నారు. వరద కాలువలు పూడిపోవడంతో చిన్నపాటి వర్షపు నీరు బయటకు వెళ్లక నగర శివారులోని కాలనీలను ముంచేస్తోంది. వర్షపు నీటితో కాలనీలు కాస్త చెరువులుగా తయారయ్యాయి. చిన్నపాటి వర్షానికే నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్, సండే మార్కెట్, ఎన్టీఆర్ నగరం, వైఎస్సార్​ కాలనీలు చెరువులుగా తలపిస్తున్నాయి.

ముంచెత్తుతున్న మురుగు, ఓపెన్ నాలాలు- మహానగరంలో కాలనీల పరిస్థితి ఇది

పంటకాలువలు ఆక్రమణలకు గురికావడంతో కార్పొరేషన్​లోని కాలనీలు, నగరంలోని ప్రధాన కూడళ్లను కలిపే అండర్ గ్రౌండ్ వంతెనల్లోకి వర్షపు నీరు ప్రవహిస్తోంది. కాలువలు ఆక్రమించి భవనాలు నిర్మించడంతో నీరుబయటకు పోయే మార్గం లేక నగరం మునకకు గురిఅవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మురుగునీరు నిల్వ ఉండటంతో నగరం దుర్గంధంగా మారిందని స్థానికులు తెలిపారు. దోమలతో అధికంగా ఉండటంతో చాలా మంది అనారోగ్యాల బారిన పడుతున్నారని నగర వాసులు మెరపెట్టుకున్నారు.

భూగర్బ మురుగు కాలువలుగా మార్చాలనే ప్రణాళికను కార్పొరేషన్ అధికారులు అటకెక్కించారని స్థానికులు వాపోయారు. మున్సిపల్‌ అధికారులు స్పందించి వెంటనే చర్యలు చేపట్టాలని నగర వాసులు కోరారు.
ప్రాణాలు తీస్తున్నా మొద్దు నిద్ర వీడని అధికారులు - అధ్వానంగా విజయవాడ డ్రైనేజీ వ్యవస్థ

Last Updated : May 16, 2024, 2:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.