Double Bedroom Houses Without Facilities in Jagtial : పేద ప్రజల సొంతింటి కల నెరవేర్చాలనే లక్ష్యంతో, బీఆర్ఎస్ ప్రభుత్వం 2018 ఏప్రిల్ 24న జగిత్యాల జిల్లా నూకపల్లిలో 4,520 రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తొలిత పనుల్లో జాప్యంతో నత్తనడకన సాగినప్పటికీ చివరకు 3,722 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. అయితే ఎన్నికల హడావిడిలో పూర్తి చేసిన ఈ ఇళ్లను రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు అక్టోబర్ 03న నాటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్(KTR) చేతుల మీదుగా లబ్దదారులకు పంపిణీ చేశారు.
ఇళ్లు నిర్మించినా రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్, తాగునీరు సౌకర్యం కల్పించలేదు. దీంతో సౌకర్యం లేక ఇళ్లలో ఎవరు ఉండటంలేదు. ఒకరిద్దరు ఉంటున్నా వాళ్లు, నీళ్లను కొనుగోలు(Water Purchase) చేసి నివాసం ఉంటున్నామని చెబుతున్నారు. సౌకార్యాలు కల్పిస్తే ప్రతి ఒక్కరూ ఇక్కడ నివాసం ఉండే అవకాశం ఉందని లబ్దిదారులు పేర్కొంటున్నారు.
నీటి సమస్య తీవ్రంగా ఉంది. ఇందిరమ్మ ఇళ్లు కోసం ఇక్కడ వాటర్ ట్యాంక్ అయితే ఏర్పాటు చేశారు. దాని నుంచి మాకు కనెక్షన్లు సైతం ఇచ్చారు. కానీ నీటిసరఫరా మాత్రం కావటం లేదు. ఇక్కడ మరో ప్రధాన సమస్యం ఏంటంటే రోడ్లు. ఇటీవల డబుల్ బెడ్రూం ఇళ్ల ప్రాంగణంలో సీసీ రోడ్లు నిర్మాణం చేశారు. కానీ వాటికి అనుసంధానంగా మాత్రం రోడ్లు వేయలేదు. దానివల్ల ప్రజలు ప్రయాణాలకు, నడుచుకునే వారికి ప్రధానంగా ఇబ్బంది ఏర్పడుతుంది.-లబ్ధిదారులు
MLA Raghunandan Rao Latest Comments : రంగులు వెలిసిపోయినా.. పేదవానికి ఇళ్లు రావట్లేదు!
Double Bedroom Beneficiaries Facing Problems : అద్దె భారం మోయలేక ఇప్పటికే కొందరు లబ్ధిదారులు గృహప్రవేశం(Homecoming) చేశారు. మౌలిక సౌకర్యాల్లేక ఇబ్బంది పడుతున్నామని వాపోతున్నారు. ఇళ్లు లేని నిరుపేదలకు త్వరగా సౌకర్యాలు కల్పిస్తే ప్రతి నెలా చెల్లించే అద్దె భారం తప్పుతుందని, ఇళ్లు పంపిణీ చేసి తమను పట్టించుకోవటంలేదని లబ్దిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం త్వరగా పనులు పూర్తి చేసి నిరుపేదలను ఆదుకోవాలని, రెండు పడక గదుల ఇళ్ల లబ్దిదారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
మేము అద్దె ఇళ్లలో కిరాయి కట్టలేకనే ప్రభుత్వం ఇచ్చిన ఈ డబుల్ బెడ్రూం ఇళ్లలోకి వచ్చాము. కానీ ఇక్కడ కరెంట్ ఉండటం లేదు. కొన్ని ఇళ్లకు విద్యుత్ మీటర్లు సైతం లేవు. అంతేకాకుండా తాగటానికి నీరు కూడా లేదు. డబ్బులు పెట్టి కొనుక్కునే పరిస్థితి ఉంది. ఇళ్లు ఇచ్చారన్న ఆనందంకన్నా, కనీసం మౌలిక సదుపాయాలు లేకపోవడానికి బాగా ఇబ్బందులు పడుతున్నాం.-లబ్ధిదారులు
Harish Rao Fires on Congress : 'బీఆర్ఎస్ చేసిన అభివృద్ధికి.. కాంగ్రెస్ చెబుతున్న అబద్దాలకు పోటీ'