DK Aruna Fires On Congress : ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ప్రయత్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరి సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నారు. ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయకపోతే ప్రజలే కాంగ్రెస్ సర్కారును గద్దె దించుతారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ (DK Aruna) అన్నారు. రేవంత్ రెడ్డే మరో ఏక్ నాథ్ షిండే అవుతారేమోనని ఆ పార్టీలోనే చర్చ జరుగుతుంది. ఆ విమర్శల నుంచి తప్పించుకోవడానికి బీజేపీపై రేవంత్ ఆరోపణలు చేస్తున్నారన్నారు.
DK Aruna : 8 మంది ఎమ్మెల్యేలున్న పార్టీ ఆధికారంలో అన్న ప్రభుత్వాన్ని ఎలా టచ్ చేస్తుందో చెప్పాలన్నారు. తెలంగాణలో కేసీఆర్ సర్కారుపై బీజేపీ వ్యతిరేకతను కూడ గడితే అలవికాని హామీలిచ్చి, బీజేపీ- బీఆర్‌ఎస్ ఒక్కటేనని దుష్ప్రచారం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. అయినా ఆ పార్టీ వారిపై వారికే నమ్మకం లేదని అందుకే పదేపదే ప్రభుత్వాన్ని గద్దె దించే అంశాన్ని తెరపైకి తెస్తున్నారని ఆమె తెలిపారు. ప్రధానిని పెద్దన్నగా అభివర్ణించి, కేంద్రం - రాష్ట్రాల మధ్య సహకారం ఉంటేనే అభివృద్ధి సాధ్యమని చెప్పి, బైటకొచ్చి మోడీపై రాజకీయ విమర్శలు చేయడం రేవంత్‌కు తగదని హితవు పలికారు.
నేటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్‌డీఎస్‌ఏ నిపుణుల కమిటీ అధ్యయనం
DK Aruna Comments On CM Revanth Reddy : ఇంకా రేవంత్ ప్రతిపక్షంలోనే ఉన్నట్లుగా భావిస్తున్నారని, భాష మార్చుకోవాలని సూచించారు. 70ఏళ్లలో దేశం, రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని మాట్లాడుతున్న రేవంత్ 60 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉందన్న విషయాన్ని మరచిపోతున్నారన్నారు. కాంగ్రెస్ కూటమిలో రాహుల్‌ను ప్రధాని అభ్యర్ధిగా ఎవరూ అంగీకరించడం లేదని రాహుల్ ప్రధాని ఎలా అవుతారని ప్రశ్నించారు. పార్టీలు మారిన అభ్యర్ధంటూ తనపై చేస్తున్న విమర్శలపై డీకే అరుణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ పార్టీ నుంచి వచ్చారో ముందుగా గుర్తించాలని, ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలే ప్రస్తుతం హస్తం పార్టీలో ఉన్నారన్న అంశాన్ని మరచిపోవద్దన్నారు.
ఖమ్మం గుమ్మంలో రాజకీయ కాక - లోక్‌సభ సమరానికి పార్టీల సన్నద్ధం
Palamuru-Ranga Reddy Lift Scheme : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కృషి ఏమిటో చెప్పాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ డిమాండ్ చేశారు. పాలమూరు ప్రజాదీవెన బహిరంగ సభలో డీకే అరుణను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. ఈ మేరకు మహబూబ్ నగర్ బీజేపీ జిల్లా కార్యాలయంలో ఆమె మాట్లాడారు. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా అంశం తెరపైకి వచ్చినప్పటి డిజైన్లు, అంచనాలను ఎవరు మార్చారని, అలాంటి వారికి కాంగ్రెస్ వత్తాసు పలుకుతోందా చెప్పాలని కోరారు.
DK Aruna Comments On BRS : కాంగ్రెస్ పార్టీకి పాలమూరు మీద నిజంగా ప్రేమ ఉంటే విభజన చట్టంలో ఆ అంశాన్ని ఎందుకు చేర్చలేదని డీకే అరుణ విమర్శించారు. తెలంగాణ ముఖమంత్రి, మంత్రులు కేంద్ర మంత్రుల్ని కలిసినప్పుడు 60శాతం నిధులిస్తామని కేంద్రం స్పష్టం చేసిందని ఆమె గుర్తు చేశారు. ఇంకా ఎలాంటి సహకారం కేంద్రం నుంచి కావాలో చెప్పాలన్నారు. మేడిగడ్డ, కాళేశ్వరంపై సీబీఐ విచారణను ప్రభుత్వం ఎందుకు కోరడం లేదు. ఎవరి మేలు కోసం విచారణ ఆలస్యం చేస్తున్నారో ప్రజలకు వివరించాలన్నారు. డీకే అరుణ ఏ పార్టీలో ఉన్నా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అన్ని నియోజక వర్గాల అభివృద్ధి కోసం పనిచేశానని చెప్పుకొచ్చారు.
ఎల్‌ఆర్‌ఎస్‌ను ఉచితంగా చేయాలని డిమాండ్ - రాష్ట్రవ్యాప్త నిరసనలు చేపట్టిన బీఆర్‌ఎస్
అద్దె ఇళ్లలో నివసించే వారికి ఇక నో టెన్షన్ - గృహజ్యోతి వారికి కూడా వర్తింపు