Diwali Celebration in Graveyard in karimnagar District : సాధారణంగా దీపావళి పండుగ రోజున అందరూ దేవుళ్ళను పూజిస్తారు. కానీ కొన్ని సామాజికవర్గాల కుటుంబాలు మాత్రం సమాధుల వద్ద పూజలు, ప్రార్థనలు నిర్వహించి చనిపోయిన తమ పూర్వీకులను గుర్తుచేసుకుంటారు. కానీ! తెలంగాణలోని కరీంనగర్‌లోని ఒక సామాజికవర్గం మాత్రం సమాధుల వద్ద పూజలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగిస్తోంది.
దీపావళి పండుగ రోజు అందరూ ఇళ్ల ముందు దీపాలు వెలిగిస్తే, వీళ్లు మాత్రం శ్మశాన వాటికలకు వచ్చి సమాధుల ముందు దీపాలు వెలిగించి టపాసులు కాల్చి దీపావళి పండుగను ఘనంగా చేసుకుంటారు. చనిపోయిన తమ పూర్వీకులను గుర్తుచేసుకుంటూ వారి సమాధుల వద్ద తినుబండారాలను పెట్టి దీపాలు వెలిగించి టపాసులు కాల్చి వేడుకను జరుపుకుంటారు. ఇలాంటి ఆచారాన్ని ఆరు దశాబ్దాలకు పైగా కొనసాగిస్తోంది కరీంనగర్ జిల్లాలోని ఓ సామాజిక వర్గం.
ఉదయం లక్ష్మీ పూజ చేస్తారు. సాయంత్రం తమ పూర్వీకుల సమాధుల వద్దకు వచ్చి అక్కడ దీపాలు వెలిగించి టపాసులు కాల్చతారు. చనిపోయిన వారికి ఇష్టమైన వంటకాలు, ఇతరత్రా ఏమైనా ఉంటే అక్కడ పెడతారు. ఇలా చెయ్యడం వల్లు వాళ్ల తాతముత్తాలతో పండుగ చేసుకున్నటుంటుందని వారు తెలుపుతున్నారు. ఈ ఆచారం దశాబ్దాలుగా కొనసాగుతుందని చెబుతున్నారు కర్మాన్‌ఘాట్ గ్రామస్తులు.
ఆ ఊరి పేరే దీపావళి - ఇంతకీ ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?
'ప్రతీ సంవత్సరం ఇక్కడే దీపావళి జరుపుకుంటాం. మా చిన్నప్పటి నుంచి ఇలాగే చేస్తున్నాం. ఎక్కడెక్కడో ఉంటున్న వాళ్లు కూడా ఈ రోజు తప్పకుండా ఇక్కడకు వస్తారు. వారం రోజుల ముందు నుంచే మేము సమాధులను అలంకరిస్తాం. సున్నం వేయిస్తాం, వారికి ఇష్టమైన పిండివంటలు చేసి పెడతాం. పువ్వులు, కొవ్వొత్తులతో అలంకరణలు చేస్తాం.' - స్థానికులు
Diwali Celebrations in Burial Ground : ఇటువంటి ఆచారం చాలా ప్రత్యేకమైంది. వీరు తమ సాంప్రదాయంగా ఈ పండుగ జరుపుకుంటున్నారని కార్యక్రమనికి వచ్చిన అధికారులు తెలిపారు. వందలాది మంది ఇక్కడకు వస్తున్నారని, భవిష్యత్తులో వీరికి తగిన సదుపాయాలు కల్పిస్తామని ఛైర్మన్ తెలిపారు. దీపావళి పండుగతో శ్మశానంలో కోలాహలం నెలకొంది.
ఆ గ్రామానికి దీపావళి 70ఏళ్ల దూరం - 'ఎప్పుడూ అలాగే జరుగుతోంది' అంటున్న వృద్ధులు