ETV Bharat / state

LIVE UPDATES : బడ్జెట్‌పై అసెంబ్లీలో ముగిసిన సాధారణ చర్చ - శాసనసభ సోమవారానికి వాయిదా - TG ASSEMLBLY SESSIONS LIVE UPDATES - TG ASSEMLBLY SESSIONS LIVE UPDATES

Telangana Assembly Session on Budget 2024
Telangana Assembly Session on Budget 2024 (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 27, 2024, 10:13 AM IST

Updated : Jul 27, 2024, 9:46 PM IST

Telangana Assembly Session on Budget 2024 : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఒక్కరోజు గ్యాప్ తర్వాత తిరిగి ఇవాళ ప్రారంభమై, వాడివేడిగా సాగాయి. ఇవాళ్టి సభలో బడ్జెట్​పై చర్చ జరిగింది. చర్చను బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రారంభించారు. ప్రతిపక్ష, విపక్షాల సభ్యుల ప్రశ్నలకు సుధీర్ఘ సమాధానం ఇచ్చిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వందశాతం వాస్తవ బడ్జెట్‌ను ప్రవేశపెట్టామన్నారు. గత ప్రభుత్వం మాదిరి , గొప్పలకు పోలేదని వివరించారు.

LIVE FEED

9:45 PM, 27 Jul 2024 (IST)

  • శాసనసభ సోమవారానికి వాయిదా
  • బడ్జెట్‌పై అసెంబ్లీలో ముగిసిన సాధారణ చర్చ

8:22 PM, 27 Jul 2024 (IST)

గత పదేళ్లలో సాగునీటి సమస్య ఏ మాత్రం తీరలేదు : భట్టి విక్రమార్క

  • సాగునీటి సమస్య తీరాలనే పోరాడి రాష్ట్రం తెచ్చుకున్నాం: భట్టి
  • గత పదేళ్లలో సాగునీటి సమస్య ఏ మాత్రం తీరలేదు
  • రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం నిర్మించినా, ఉపయోగం లేకుండా పోయింది
  • మేడిగడ్డ వద్ద వచ్చిన నీరు వచ్చినట్లే పోతోంది, నిల్వ చేయలని పరిస్థితి ఉంది
  • రూ.లక్ష కోట్లు ఖర్చు చేసినా, కొత్తగా లక్ష ఎకరాలకు కూడా సాగునీరు అందలేదు
  • ప్రాధాన్యత వారీగా సాగునీటి ప్రాజెక్టులను మేం పూర్తి చేస్తాం
  • తక్కువ ఖర్చుతో పూర్తయ్యి నీరు వచ్చే ప్రాజెక్టులను ముందుగా పూర్తి చేస్తాం

8:03 PM, 27 Jul 2024 (IST)

పదేళ్లుగా ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీలు లేవు : డిప్యూటీ సీఎం భట్టి

  • ఓఆర్‌ఆర్‌పై 30 ఏళ్లపాటు వచ్చే ఆదాయాన్ని ఒక్క ఏడాదిలోనే తీసుకున్నారు
  • ప్రభుత్వం దిగిపోయే ముందు ఓఆర్‌ఆర్‌ వేలం వేసుకుని భవిష్యత్‌లో ఆదాయం లేకుండా చేశారు
  • పదేళ్లలో ఆరోగ్యశ్రీపై కేవలం రూ.4320 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు
  • ఈ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కోసం ఒక ఏడాదికే రూ.1063 కోట్లు కేటాయించాం
  • బీఆర్ఎస్​ ప్రభుత్వం రెండు నెలలు ఆసరా పింఛన్లు ఎగ్గొట్టింది
  • పదేళ్లుగా ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీలు లేవు
  • ఈ ప్రభుత్వం 16 వేల మంది టీచర్లకు పదోన్నతులు, బదిలీలు కల్పించింది
  • ఆదిలాబాద్‌ జిల్లాలోని చిన్న నీటిపారుదల ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తాం

7:40 PM, 27 Jul 2024 (IST)

గొప్పల కోసం అయితే మేం కూడా రూ.3.50 లక్షల కోట్ల బడ్జెట్‌ పెట్టేవాళ్లం : ఉపముఖ్యమంత్రి భట్టి

  • గత ప్రభుత్వం గొప్పల కోసం భారీ బడ్జెట్‌లు పెట్టింది : భట్టి విక్రమార్క
  • వాస్తవంలో మాత్రం ఏటా రూ.60 వేల నుంచి రూ.70 వేల కోట్లు ఖర్చు చేయలేదు
  • గొప్పల కోసం అయితే మేం కూడా రూ.3.50 లక్షల కోట్ల బడ్జెట్‌ పెట్టేవాళ్లం
  • మేం వందశాతం వాస్తవ బడ్జెట్‌ను ప్రవేశపెట్టాం
  • మద్యం దుకాణాలకు ఒక ఏడాది ముందే వేలం నిర్వహించారు
  • ఈ ఏడాది అమ్మాల్సిన మద్యం దుకాణాల దరఖాస్తులను గతేడాదే విక్రయించారు
  • కేంద్ర ప్రాయోజిత పథకాలకు నిధులు రూ.10 వేల కోట్లు కూడా రావటం లేదు
  • ఏదైనా అభివృద్ధి చర్యల ఫలాలు ఐదు, పదేళ్ల తర్వాత కనిపిస్తాయి
  • గత పదేళ్లలో హైదరాబాద్‌కు పెట్టుబడులు భారీగా వచ్చాయని బీఆర్ఎస్​ చెప్పుకున్నది
  • అంతకుముందు కాంగ్రెస్‌ చేసిన అభివృద్ధి వల్లే పెట్టుబడులు వచ్చాయి
  • హైదరాబాద్‌లో ఎన్నో భారీ పరిశ్రమలను కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసింది
  • కాంగ్రెస్ ప్రభుత్వ చర్యల ఫలితాలు బీఆర్ఎస్ హయాంలో కనిపించాయి
  • కృష్ణా నది నుంచి హైదరాబాద్‌కు రెండు విడతల్లో సాగునీటి పైపులైన్లు వేసింది కాంగ్రెస్‌ ప్రభుత్వం
  • శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి హైదరాబాద్‌కు పైపులైన్లు వేసింది కాంగ్రెస్‌ ప్రభుత్వం
  • హైదరాబాద్‌కు వచ్చే పైపులైన్‌కు రంధ్రం పెట్టి గజ్వేల్‌కు నీరు తీసుకెళ్లారు

7:38 PM, 27 Jul 2024 (IST)

ప్రతి నియోజకవర్గంలో ఒక అంబేడ్కర్‌ నాలెడ్జ్‌ సెంటర్‌ నిర్మిస్తాం : డిప్యూటీ సీఎం భట్టి

  • ప్రస్తుతం చదువులు ఉద్యోగ అవకాశాలకు సరిపడే విధంగా లేవు
  • ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా యువతలో నైపుణ్యాలు పెంచేందుకు ప్రణాళికలు
  • ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో అత్యాధునిక స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నాం
  • ఐటీఐలను స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రాలుగా మార్చుతున్నాం
  • పోటీ పరీక్షల అభ్యర్థుల కోసం అంబేడ్కర్ నాలెడ్జ్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తాం
  • ప్రతి నియోజకవర్గంలో ఒక అంబేడ్కర్‌ నాలెడ్జ్‌ సెంటర్‌ నిర్మిస్తాం

7:07 PM, 27 Jul 2024 (IST)

రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామంటే బీఆర్ఎస్ నేతలు నవ్వారు : డిప్యూటీ సీఎం భట్టి

  • ఎస్సీ సబ్‌ప్లాన్‌కు రూ.33,124 కోట్లు కేటాయించాం: భట్టి
  • ఎస్టీ సబ్‌ప్లాన్‌కు రూ.17,056 కోట్లు కేటాయించాం: భట్టి
  • బీసీ సబ్‌ప్లాన్‌కు రూ.10,028 కోట్లు కేటాయించాం: భట్టి
  • మైనార్టీల సబ్‌ప్లాన్‌కు రూ.3002 కోట్లు కేటాయించాం
  • గత పదేళ్లలో ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులను ప్రభుత్వం ఖర్చు చేయలేదు
  • ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులను గత ప్రభుత్వం సరిగా ఖర్చు చేయలేదు
  • ఖర్చు చేసి ఉంటే చాలా కుటుంబాలు పేదరికం నుంచి బయటపడి ఉండేవి
  • మహిళలకు వడ్డీ లేని రుణాలను బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు
  • మేం మాత్రం మహిళలకు వడ్డీలేని రుణాల కోసం రూ.20 వేల కోట్లు కేటాయించాం
  • రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామంటే బీఆర్ఎస్ నేతలు నవ్వారు
  • మేం మాత్రం చెప్పింది చెప్పినట్లుగా రూ.2 లక్షల రుణమాఫీ చేసి చూపిస్తున్నాం

5:58 PM, 27 Jul 2024 (IST)

అన్నప్రాశన రోజే ఆవకాయ పెట్టినట్లుగా కొందరి వ్యవహార శైలి ఉంది : కూనంనేని

రైతుల నుంచి అభిప్రాయాలు తీసుకొని రైతుభరోసాను అమలు చేయాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరారు. కొత్త ప్రభుత్వానికి కనీసం ఏడాది అయినా సమయం ఇవ్వాలని, విపక్షాలకు సూచించారు. ఈ విషయంలో అన్నప్రాశన రోజే ఆవకాయ పెట్టినట్లుగా కొందరి వ్యవహార శైలి ఉందన్నారు. ఆర్నెళ్లకే అన్నీ చేయలేదు అని ఈ ప్రభుత్వాన్ని అనటం సరికాదని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు ఈ ప్రభుత్వం చేయదని భావిస్తున్నట్లు తెలిపారు. ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు మేలు చేయాలనే కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం దాదాపు రూ.7 లక్షల కోట్ల అప్పు చేసిందని, అప్పు తీర్చేందుకే మరో అప్పు చేయాల్సిన స్థితిలో ఈ ప్రభుత్వం ఉందన్నారు. అప్పులు ఉన్నాయని హామీలు నేరవేర్చలేం అనటం కూడా తప్పే అవుతుందని వ్యాఖ్యానించారు.

5:06 PM, 27 Jul 2024 (IST)

మోదీని పొగిడితే నాకేం రాదు, రాష్ట్ర ప్రయోజనాల కోసమే అలా అన్నాను : సీఎం రేవంత్​రెడ్డి

తెలంగాణకు నిధుల విషయంలో కేంద్రం వివక్ష చూపుతోందని సీఎం రేవంత్​రెడ్డి పునురుద్ఘాటించారు. నిధులన్నీ యూపీ, బిహార్‌, గుజరాత్‌కే కేటాయిస్తున్నారని ఆరోపించారు. అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలని బహిరంగసభపై మోదీకి చెప్పానని ముఖ్యమంత్రి వివరించారు. రాష్ట్రాల పట్ల పెద్దన్నలాగా వ్యవహరించాలని ప్రధాని మోదీని కోరానని, అందుకే ప్రధానిని పెద్దన్న అని సంబోధించినట్లు వివరించారు. అందులో తప్పేముందని సీఎం అన్నారు. రాష్ట్రానికి నిధులు సాధించటం కోసం పెద్దన్న అని సంబోధించానని వివరించారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా తన బాధ్యత సక్రమంగా నిర్వహర్తించానన్నారు. మోదీని పొగిడితే తనకేం రాదని, రాష్ట్ర ప్రయోజనాల కోసమే అలా అన్నట్లు పేర్కొన్నారు.

5:03 PM, 27 Jul 2024 (IST)

అమిత్ షా మీ మిత్రుడు కాబట్టి ఆయనపై ఉన్న కేసును కొట్టివేశారు : అక్బరుద్దీన్‌

ఎన్నికల సమయంలో తనతో సహా ముస్లింలపై తప్పుడు కేసులు పెట్టారని ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్‌ పేర్కొన్నారు. తనది తప్పు కాదని తెలిసి కూడా సీపీ కేసు ఉపసంహరించేది లేదని అన్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మీ మిత్రుడు కాబట్టి ఆయనపై ఉన్న కేసును కొట్టివేశారని సభలో మాట్లాడారు. హైదరాబాద్‌లో శాంతి భద్రతలు క్షీణించాయన్న అక్బరుద్దీన్‌ ఒవైసీ, రాత్రి 10 దాటితే ఇంటి ముందు ఉన్న వారిని కూడా కొడుతున్నారని ఆక్షేపించారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం మంచి అధికారులను నియమించుకోవాలని కోరారు. డ్రగ్స్‌పై పోరాటానికి సీఎం రేవంత్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం చాలా మంచిదని కొనియాడారు.

4:36 PM, 27 Jul 2024 (IST)

నాలుగేళ్లలో పాతబస్తీ మెట్రో పనులు పూర్తి చేసే బాధ్యత మాది : సీఎం రేవంత్​రెడ్డి

నాలుగేళ్లలో పాతబస్తీ మెట్రో పనులు పూర్తి చేసే బాధ్యత మాదని సీఎం రేవంత్​రెడ్డి ఉద్ఘాటించారు. పాతబస్తీ మెట్రో నిర్మాణాన్ని గత ప్రభుత్వమే నిర్లక్ష్యం చేసిందని దుయ్యబట్టారు. మెట్రో నిర్మాణంపై ఎల్‌ అండ్‌ టీతో చర్చలు జరుపుతున్నామన్న ఆయన, హైటెక్‌ సిటీ నుంచి ఎయిర్‌పోర్టుకు గత ప్రభుత్వం టెండర్లు పిలిచినట్లు తెలిపారు. ఎయిర్‌పోర్టు వరకు 32 కి.మీ. మెట్రో నిర్మాణానికి టెండర్లు పిలిచిందని, కేవలం స్థిరాస్తి సంస్థలకు మేలు చేసేందుకే ఆ మార్గంలో మెట్రో నిర్మాాణానికి పూనుకున్నట్లు ముఖ్యమంత్రి శ్లాఘించారు. ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్‌ నుంచి ఎయిర్‌పోర్టుకు మంచి రోడ్లు ఉన్నాయన్న ఆయన, మెట్రో అవసరం లేని మార్గాల్లో నిర్మాణానికి టెండర్లు పిలిచారని మండిపడ్డారు. తమ ప్రభుత్వం ఎల్బీనగర్‌ నుంచి ఎయిర్‌పోర్టుకు మెట్రో నిర్మించనుందని తెలిపారు. పాతబస్తీ ప్రజలకు మేలు కలిగేలా చాంద్రాయణగుట్ట మీదుగా మెట్రో నిర్మాణం పూర్తి చేసేందుకు తాము సిద్ధమని, రెండో దశ మెట్రో నిర్మాణానికి నిధులు కోరితే కేంద్రం రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. పాతబస్తీ, ఎయిర్‌పోర్టుకు మెట్రోను కచ్చితంగా నిర్మించి తీరుతామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. రెండో దశ మెట్రో నిర్మాణానికి భూసేకరణను ఇప్పటికే మొదలుపెట్టినట్లు వెల్లడించారు. భూసేకరణకు రూ.2600 కోట్లు అవసరం అవుతుందని తెలిపారు.

4:17 PM, 27 Jul 2024 (IST)

కొత్త రేషన్‌కార్డులు త్వరగా ఇవ్వాలి : అక్బరుద్దీన్ ఒవైసీ

ప్రతి పథకానికి రేషన్‌కార్డులు అడుగుతున్నారని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ తెలిపారు. కొన్నేళ్లుగా ఎవరికీ కొత్త రేషన్‌ కార్డులు ఇవ్వలేదని, వాటిని త్వరగా అందించే కార్యక్రమం ప్రభుత్వం తీసుకోవాలని కోరారు.

2:42 PM, 27 Jul 2024 (IST)

గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిదిద్దే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపైన ఉంది : పాయల్‌శంకర్‌

రాష్ట్ర ప్రభుత్వం ఫసల్‌ బీమా అమలు చేస్తామని చెప్పిందని ఆదిలాబాద్​ ఎమ్మెల్యే పాయల్‌శంకర్‌ తెలిపారు. కానీ జులై ముగుస్తున్న ఇంకా అమలు చేయడం లేదని గుర్తు చేశారు. అదేవిధంగా ఆర్థిక పరిస్థితిపై శాసనసభ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని పాయల్‌శంకర్‌ విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​గా ఉన్నప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కార్పొరేషన్ ద్వారా నిధులు దొరికేవని, పదేళ్లుగా ఎస్సీ ఎస్టీ, బీసీలకు కార్పొరేషనలలో నిధులు లేవని అన్నారు. వాటిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిదిద్దే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపైన ఉందన్నారు. సర్పంచ్ ఎన్నికలను తక్షణమే నిర్వహించాలన్న ఆయన, ఎన్నికలను నిర్వహించకపోతే కేంద్రం నుంచి వచ్చే నిధులు రావని ఎమ్మెల్యే పాయల్‌శంకర్‌ ఉద్ఘాటించారు.

12:31 PM, 27 Jul 2024 (IST)

2020 జులై నుంచి పింఛన్ నెల ఆలస్యం అయింది, అదే కొనసాగుతోందని మంత్రి సీతక్క అన్నారు. 2018 ఎన్నికల్లో చెప్పిన 57 ఏళ్ల హామీ మూడున్నరేళ్ల తర్వాత చేశారని తెలిపారు.
గతంలో అనర్హులకు పింఛన్‌ ఇచ్చారని గుర్తుచేశారు.

12:30 PM, 27 Jul 2024 (IST)

"మేం సరిగా చేయలేదు కాబట్టే మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. మీరు అలాగే చేసి ప్రతిపక్షంలోకి వస్తామంటే రండి. సమీక్షించుకోవాలని సీతక్కకు సూచిస్తున్నాం." - హరీశ్‌రావు

12:30 PM, 27 Jul 2024 (IST)

ఫ్లకార్డుల విషయంలో సభ్యులపై చర్యలు తీసుకోవాలి: శ్రీధర్‌బాబు

12:30 PM, 27 Jul 2024 (IST)

కాంగ్రెస్‌ పాలనలో శాంతిభద్రతలు బాగా దెబ్బతిన్నాయి : హరీశ్‌ రావు

రేవంత్ రెడ్డి పాలన చూసి కాళోజీ నా గొడవ పుస్తకం ఎంతగా ఘోషించిందోనని హరీశ్‌రావు అన్నారు. శాంతిభద్రతలు బాగా దెబ్బతిన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 8 నెలల్లో 500 హత్యలు, 1800 రేప్ కేసులు నమోదయ్యాయని అన్న మాజీ మంత్రి ఇలాంటి ఘటనలతో హైదరాబాద్ నగర ప్రతిష్ఠ దెబ్బతింటుందని చెప్పారు.
రాష్ట్రంలో బీఆర్ఎస్‌ ప్రభుత్వం ఎక్కడైనా మీటర్లు పెట్టిందా అని ప్రశ్నించారు. మీటర్లు పెట్టి ఎఫ్ఆర్బీఎం ద్వారా రూ.30 వేల కోట్లు రుణాలు తీసుకున్నామా అని అడిగారు. మైనార్టీల విషయంలో బడే బాయ్ తరహాలోనే చోటా బాయ్ కూడా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. మైనార్టీలకు ఒక్క మంత్రి పదవి, ఎమ్మెల్సీ ఇవ్వలేదని విమర్శించారు. ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాల భర్తీ అన్నారని గుర్తు చేశారు. బేషజాలకు పోకుండా హామీలు అమలు చేయాలని హితవు పలికారు.

12:12 PM, 27 Jul 2024 (IST)

"సభ్యులు మాట్లాడే తప్పును సరిచేసే బాధ్యతను నాకు ఉంది. సభలో అబద్ధాలు మాట్లాడడం సరైన పద్ధతి కాదు. 2018 డిసెంబర్‌లోపల విద్యుత్ మీటర్ల బిగిస్తామని కేసీఆర్‌.. కేంద్రానికి చెప్పారు. అధికారిక లెక్కలు చూసి హరీశ్‌రావు స్పందించాలి. ప్రతిపక్ష నేత రాకపోయినా వారి సభ్యులకు అవకాశం ఇచ్చాం. కేంద్రంతో పోరాడామని పదేపదే చెప్తూ వస్తున్నారు. విద్యుత్ మీటర్ల విషయంలో ఒప్పందాలు చేసుకొని అబద్ధాలు చెప్తున్నారు. 2017 జనవరి 4న ఒప్పందం చేసుకున్నారు. 2017 జూన్‌లోగా మీటర్లు బిగిస్తామని అంగీకరించారు." - రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి

12:03 PM, 27 Jul 2024 (IST)

మహాలక్ష్మి పథకాన్ని అమలు చేయాలి : హరీశ్‌ రావు

మహాలక్ష్మి పథకాన్ని అమలు చేయాలని హరీశ్‌ రావు డిమాండ్ చేశారు. ప్రజాపాలనలో ప్రజలను ప్రతిరోజు సీఎం కలుస్తానని చెప్పారని చెప్పారని అన్నారు.

11:58 AM, 27 Jul 2024 (IST)

కాంగ్రెస్‌ పాలనలో శాంత్రిభద్రతలు సమస్యలు ఉన్నాయి : హరీశ్‌ రావు

ఎన్నికల ప్రచారంలో ఉద్యోగాలు ఇస్తామని రాహుల్‌గాంధీ నిరుద్యోగుల వద్ద మాట్లాడారని హరీశ్‌ రావు గుర్తు చేశారు. కాంగ్రెస్‌ పాలనలో శాంత్రిభద్రతలు సమస్యలు ఉన్నాయని విమర్శించారు

11:57 AM, 27 Jul 2024 (IST)

బీఆర్ఎస్‌ పాలనలో రెండు పింఛన్లు ఇచ్చారు. 2014 నుంచి సమాచారం మా ప్రభుత్వం ఉంది : సీతక్క

11:51 AM, 27 Jul 2024 (IST)

రాహుల్ పరువు తీశారు, సోనియా ప్రతిష్టను దిగజార్చారు : హరీశ్‌రావు

రాహుల్ పరువు తీశారు, సోనియా ప్రతిష్టను దిగజార్చారని హరీశ్‌రావు అన్నారు. 6 గ్యారంటీలకు చట్టబద్ధత అన్నారని గుర్తుచేశారు. శ్వేతపత్రాలతో కాంగ్రెస్‌ కపట నాటకాలు ఆడిందని విమర్శించారు.

11:50 AM, 27 Jul 2024 (IST)

బీఆర్ఎస్ పాలనలో 24 గంటల విద్యుత్ అన్నారని కోమటిరెడ్డి గుర్తుచేశారు. తాను సబ్‌స్టేషన్‌కు వెళ్తే 24 గంటలు ఎప్పుడు రాలేదన్నారని మంత్రి తెలిపారు. కేంద్రం మోసం చేస్తే కేసీఆర్‌ ఒక్క మాట కూడా మాట్లాడలేదని విమర్శించారు.

11:50 AM, 27 Jul 2024 (IST)

రైతు భరోసా త్వరగా ఇవ్వాలి : హరీశ్‌ రావు

గ్యారంటీలు, హామీలు అమలు చేయలేదని ప్రజలకు క్షమాపణ చెప్పాలని హరీశ్‌ రావు డిమాండ్ చేశారు. 6 గ్యారంటీలకు ఓటాన్ అకౌంట్ కంటే తక్కువ పెట్టారన్నారు.
రైతు భరోసా త్వరగా ఇవ్వాలి హరీశ్‌ రావు కోరారు.

11:39 AM, 27 Jul 2024 (IST)

సభను తప్పుదోవ పట్టించే విధంగా ఉంది హరీశ్‌రావు తీరుందని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. 14 గంటల కరెంట్‌ కూడా ఇవ్వలేదని సబ్‌స్టేషన్‌ ఆపరేటర్‌ చెప్పారు తెలిపారు కేసీఆర్‌ వచ్చే ధైర్యం లేకనే హరీశ్‌రావును పంపించారని చెప్పారు. కేంద్రం బడ్జెట్‌లో అన్యాయం చేస్తే కేసీఆర్‌ ఒక్క మాట కూడా మాట్లాలేదన్నారు.

11:37 AM, 27 Jul 2024 (IST)

ఆరు గ్యారెంటీల గురించి అడిగితే సీఎం రేవంత్‌రెడ్ ప్రతిపక్షంపై విమర్శలు చేస్తున్నారు : హరీశ్‌రావు

వందరోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని సోనియాతో లేఖ రాసి పంపిణీ చేశారని మాజీ మంత్రి హరీశ్‌ రావు అన్నారు. ఆరు గ్యారెంటీల గురించి అడిగితే సీఎం రేవంత్‌రెడ్ ప్రతిపక్షంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. గ్రూప్‌- 2 వాయిదా వేయాలని నిరుద్యోగులు అడిగితే విమర్శించారని ఫైర్‌ అయ్యారు.

11:35 AM, 27 Jul 2024 (IST)

కేసీఆర్‌ పాలనలో రంగారెడ్డి జిల్లాలో భూములు అమ్ముకున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. వేల కోట్ల విలువైన భూములు అమ్ముకున్నారని మండిపడ్డారు. బతుకమ్మ చీరలు, గొర్రెల పంపిణీపై విచారణకు సిద్ధంగా ఉన్నారా? రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.

11:11 AM, 27 Jul 2024 (IST)

లక్షల కోట్ల విలువైన ఓఆర్‌ఆర్‌ను రూ.7 కోట్లకు అమ్మారు : సీఎం రేవంత్

లక్షల కోట్ల విలువైన ఓఆర్‌ఆర్‌ను రూ.7 కోట్లకు అమ్మారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. రూ.700 కోట్లు గొర్రెల పంపిణీ పథకంలో అవినీతి జరిగిందని అన్నారు. అప్పుల లెక్కలు చెప్పిన హరీశ్‌రావు అమ్మకాల లెక్కలు చెప్పట్లేదని పేర్కొన్నారు. కేసీఆర్‌కు పాలమూరు జిల్లా ప్రజలు ఏం అన్యాయం చేశారుని సీఎం ప్రశ్నించారు. పాలమూరు జిల్లా ప్రాజెక్టుల పదేళ్లలో పూర్తి చేయలేదని విమర్శించారు. కేసీఆర్‌ పాలనలో రంగారెడ్డి జిల్లాలో భూములు అమ్మకున్నారని ఆరోపించారు.

11:05 AM, 27 Jul 2024 (IST)

'మా అప్పుల గురించి చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం మేము సృష్టించిన ఆస్తుల గురించి చెప్పట్లేదు'

దేశంలో అనేక రాష్ట్రాల్లో విద్యుత్‌ సంస్కరణలు అమలు చేసిన నిధులు తెచ్చుకున్నారని వాస్తవాలు తీసుకుని సరిచేసుకుంటే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని హరీశ్‌ రావు సూచించారు. మా అప్పుల గురించి చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం మేము సృష్టించిన ఆస్తుల గురించి చెప్పట్లేదని హరీశ్‌ రావు విమర్శించారు.

11:01 AM, 27 Jul 2024 (IST)

మేము అప్పులు చేసింది ఆస్తుల కల్పన కోసం : హరీశ్‌ రావు

"గత కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను మేము కొనసాగించాం. కేసీఆర్‌ కిట్‌ లాంటి పథకాలు పేర్లు మార్చి పంపిణీ చేసినా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. రూ.7 లక్షల కోట్లు అప్పులు చేశామని విమర్శించారు. మేము అప్పులు చేసింది ఆస్తుల కల్పన కోసం చేశాం." - హరీశ్‌ రావు

10:55 AM, 27 Jul 2024 (IST)

ప్రభుత్వం ఆలస్యం చేసి వడ్డీ భారాన్ని రైతులపై మోపుతున్నారు : హరీశ్‌ రావు

మీ మాటపై గౌరవం ఉంటే భూములు అమ్ముకునే ప్రతిపాదన ఉపసంహరించుకోవాలి హరీశ్ రావు డిమాండ్ చేశారు. సాధ్యం కాని తరహాలో ఆదాయం ఎక్కువ చూపారు తప్పనిసరి ఖర్చులను తక్కువ చేసి చూపారని అన్నారు. ఏకకాలంలో రుణమాఫీ అన్నారు బడ్జెట్‌లో రూ.26 వేల కోట్లు మాత్రమే వస్తోందన్న ఆయన ఆలస్యం అయిందని వడ్డీ రైతు నుంచి వసూలు చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం ఆలస్యం చేసి వడ్డీ భారాన్ని రైతులపై మోపుతున్నారని తెలిపారు.

10:39 AM, 27 Jul 2024 (IST)

2014లో రూ.10 వేల కోట్లు ఎక్సైజ్‌ ఆదాయం ఉంది, 2023- 24లో రూ.34 వేల కోట్లు ఉంది. ప్రజలపై భారం లేకుండా చేసి మద్యాన్ని ప్రోత్సహించకూడదు. నాన్‌ ట్యాక్స్‌ రెవెన్యూలో రూ.35 వేల కోట్లు వస్తుందని బడ్జెట్‌లో పెట్టారు. గతంలో రుణమాఫీ కోసం భూములు అమ్మితే భట్టి, శ్రీధర్‌బాబు విమర్శించారు. ఇప్పుడు రూ.10 వేల కోట్లు భూములు అమ్మి నిధులు సమీకరిస్తామని చెప్పారు. రూ.24 వేల కోట్లు అదనంగా ఎలా తీసుకువస్తారో చెప్పాలి. : హరీశ్‌ రావు

10:37 AM, 27 Jul 2024 (IST)

ప్రతిపక్షం చెప్పే ప్రతి విషయాన్ని మా ప్రభుత్వం వింటుంది : భట్టి

అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్‌ పెట్టామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. హరీశ్‌రావుకు బడ్జెట్‌ అంటే కంటగింపులా ఉందని చెప్పారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. ప్రతిపక్షం చెప్పే ప్రతి విషయాన్ని తమ ప్రభుత్వం వింటుంది అని భట్టి వివరించారు.

10:28 AM, 27 Jul 2024 (IST)

మా పని తీరు కంప్యూటర్ నుంచి తొలగిస్తారేమో కానీ, ప్రజల మెదడు నుంచి తొలగించలేరు : హరీశ్‌ రావు

ట్యాక్స్‌ రెవెన్యూ ఎక్కువ వస్తుందని బడ్జెట్‌లో పెట్టారన్న ఆయన విధానాల రూపకల్పన కంటే మమ్మల్ని తిట్టడంపైనే ఎక్కువ దృష్టిపెట్టారని చెప్పారు. పదేళ్ల మా శ్రమనా మీ ఎనిమిది నెలల డ్రామానా? అని ప్రశ్నించారు. గతంలో కాంగ్రెస్ పాలనలో కరెంట్ పరిస్థితి గురించి రేవంత్‌రెడ్డి మాట్లాడారన్న ఆయన కేశవరావు ఇంటికి సీఎం పోతే కరెంట్ పోయిందని ఎద్దేవా చేశారు. బడ్జెట్‌లో వాస్తవాల విస్మరణ అవాస్తవాల ప్రస్తావనని హరీశ్‌ రావు అన్నారు. మా పనితీరు తెలియకూడదని పదేళ్ల ప్రభుత్వం సమాచారాన్ని తొలగించారని మండిపడ్డారు. కంప్యూటర్ నుంచి తొలగిస్తారేమో కానీ, ప్రజల మెదడు నుంచి తొలగించలేరని అన్నారు. అక్షరాలను తొలగిస్తారేమో కానీ అనుభవాల్ని తొలగించలేరని తెలిపారు. ఆచరణ సాధ్యం కానీ అవాస్తవాల బడ్జెట్ ఇదని విమర్శించారు.

10:22 AM, 27 Jul 2024 (IST)

రాష్ట్ర బడ్జెట్‌ అవాస్తవాలతో కూడిన బడ్జెట్‌: హరీశ్‌ రావు

బీఆర్ఎస్‌ ప్రభుత్వ పాలనలో రూ.200 పింఛన్‌ను రూ.2వేలకు పెంచామని హరీశ్‌ రావు గుర్తు చేశారు. రూ.4 వేల పింఛన్‌ నాలుక మీదనే ఉందని ఎద్దేవా చేశారు. పల్లెల్లో టాప్‌ 20లో 14 తెలంగాణకు వచ్చాయని తెలిపారు. పదేళ్ల పాలనలో ఉన్న సమాచారాన్ని తొలగించారని మండిపడ్డారు.

10:22 AM, 27 Jul 2024 (IST)

బడ్జెట్‌ ప్రసంగం రాజకీయ ప్రసంగంలా ఉంది : హరీశ్‌ రావు

బడ్జెట్‌ ప్రసంగం ఒక రాజకీయ ప్రసంగంలా ఉందని ఎమ్మెల్యే హరీశ్‌ రావు అన్నారు. రూ.4.5 లక్షల లేని జీఎస్‌డీపీని రూ.14 లక్షలకు తీసుకెళ్లింది బీఆర్ఎస్‌ ప్రభుత్వమని గుర్తు చేశారు. 1400 మెగావాట్లు రామగుండం నుంచి వచ్చిందని తెలిపారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలన బాగాలేదని మాటలు చెబితే సరిపోతుందా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్‌ ప్రభుత్వ పాలన బాగాలేదని ఆధారాలు చూపించాలని డిమాండ్‌ చేశారు.

10:11 AM, 27 Jul 2024 (IST)

మేము మాట్లాడేటప్పుడు స్క్రీన్లు తిప్పొద్దు

  • మేము మాట్లాడేటప్పుడు స్క్రీన్లు తిప్పొద్దు
  • బడ్జెట్ మొత్తం 4 రోజులే పెట్టాం
  • బడ్జెట్‌ ప్రసంగం ఒక రాజకీయ ప్రసంగంలా ఉంది

Last Updated : Jul 27, 2024, 9:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.