Discussion in Assembly on Krishna Waters Today : కృష్ణా జలాల విషయంలో బీఆర్ఎస్ హయాంలోనే రాష్ట్రానికి తీరని నష్టం వాటిల్లినట్లు కాంగ్రెస్ సర్కార్ చెబుతోంది. హక్కులను కాలరాసేలా హస్తం పార్టీ ప్రభుత్వమే ముందుకు వెళుతోందని గులాబీ నేతలు శాసనసభలో ఆరోపిస్తున్నారు. ఇవాళ పూర్తి స్థాయి చర్చ చేపట్టాలని నిర్ణయించిన కాంగ్రెస్ గులాబీ పార్టీ విమర్శలను తిప్పికొట్టేందుకు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంది.
Minister Uttam Power Point Presentation on Krishna Waters : అందులో భాగంగానే ఆదివారం సాయంత్రం ప్రజాభవన్‌లో కృష్ణా జలాల నిర్ణయాలపై ఎమ్మెల్యలు, ఎమ్మెల్సీలకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసింది. సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహా తదితర మంత్రులు, నేతలకు కృష్ణా జలాల వాడకంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సాగు నీటి శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy)అధికారులు వివరించారు.
"జగన్‌తో కుమ్మకై తెలంగాణ నీటిని ఆంధ్రప్రదేశ్‌కు ధారాదత్తం చేశారు. నీళ్ల విషయంలో తెలంగాణకు ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయం కంటే, కేసీఆర్ చేసిన అన్యాయమే ఎక్కువ. కృష్ణా జలాలపై జరుగుతున్న ప్రచారాన్ని తిప్పి కొడతాం. నీళ్ల విషయంలో బీఆర్ఎస్ నేతలు అన్ని అబద్ధాలు చెబుతున్నారు. ప్రాజెక్టుల పేరిట లక్షల కోట్లు కేసీఆర్ లూటీ చేశారు."- మహేశ్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ
Krishna Water Disputes 2024 : రాష్ట్ర ఏర్పాటు నుంచి కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టే వరకు కృష్ణా జలాలపై గత సర్కార్ తీసుకున్న నిర్ణయాలను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సమగ్రంగా వివరించారు. నదీ పరివాహక ప్రాంతం, రెండు రాష్ట్రాలకున్న హక్కులు, వాటాలపై అవగాహన కల్పించారు. పదేళ్లలో రెండు ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందాలు వివిధ సందర్భాల్లో నాటి సీఎం కేసీఆర్ (KCR), ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన వీడియో క్లిప్‌లను ప్రదర్శించారు.
కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల ధారాదత్తం అంతా తప్పుడు ప్రచారం : నీటిపారుదల శాఖ
కృష్ణా నదిపై తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రాజెక్టులు, వాటి సామర్థ్యాలు, నీటి కేటాయింపులపై చర్చించినట్లు తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వం వాడుకుంటున్న వాటా ఒకవేళ అధికంగా నీటిని విడుదల చేసుకుంటే అప్పటి సర్కార్ తీసుకున్న చర్యలేమిటనే అంశంలోనూ మాట్లాడినట్లు సమాచారం. ఇరు రాష్ట్రాలకు కలిపి 811 టీఎంసీలుగా ఉన్న నీటిలో తెలంగాణకు 299 టీఎంసీలు మాత్రమే కేటాయించడం వల్ల జరిగిన అన్యాయం దీనికి గత ప్రభుత్వం ఎందుకు అంగీకరించిందనే అంశాలపై సైతం ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించారు. పూర్తి స్థాయిలో వివరాలు తెలుసుకున్న ఎమ్మెల్యేలు అసెంబ్లీలో బీఆర్ఎస్ విమర్శలను సమర్థంగా తిప్పి కొడతామని వెల్లడిస్తున్నారు.
Telangana Assembly Sessions 2024 : పవర్ పాయింట్ ప్రజంటేషన్‌తో పాటు కృష్ణా జలాలపై అవగాహన కలిగిన ఎమ్మెల్యేలతో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని వివరించినట్లు తెలిసింది. ప్రధానంగా శ్రీశైలం బ్యాక్ వాటర్‌ను ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోతున్న తీరు తద్వారా తెలంగాణకు జరుగుతున్న నష్టంపై ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మదన్‌మోహన్‌లు వివరించినట్లు సమాచారం. నీటి కేటాయింపులు, వాడకం విషయంలో అంతర్జాతీయ సహజ న్యాయ సూత్రాలు వాటిని తుంగలో తొక్కిన తీరుపై చర్చ జరిగినట్లు కాంగ్రెస్ నేతలు వెల్లడిస్తున్నారు. డెడ్ స్టోరేజి నీటిని సైతం ఏపీకి తరలించుకుపోతున్న (Krishna Water Disputes) విధానాన్ని సైతం ఎమ్మెల్యేలకు వివరించినట్లు తెలుస్తోంది.
'జల విద్యుత్ కేంద్రాల ఔట్ లెట్లను స్వాధీనం చేయాలంటే ప్రభుత్వం నుంచి ఆమోదం తీసుకోవాల్సిందే'
Congress White Paper on Irrigation Department Today : దాదాపు రెండు గంటల పాటు జరిగిన సమావేశంలో కృష్ణా జలాల విషయంలో నిర్ణయాలపై ఇవాళ శాసనసభ ద్వారా ప్రజలకు వివరించాలని నిశ్చయించుకున్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు సీఆర్పీఎఫ్ బలగాల నుంచి విముక్తి కల్పించడం సహా రాష్ట్ర వాటా తేల్చేవరకు ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించేది లేదంటూ రెండు తీర్మానాలను సభలో ప్రవేశ పెట్టాలని నిర్ణయించింది. సాగునీటి శాఖపై శ్వేత పత్రం విడుదల చేసే అవకాశం ఉంది.
రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖను విధ్వంసం చేసిన ఘనత కేసీఆర్‌దే : ఉత్తమ్ కుమార్‌రెడ్డి
కృష్ణా నదీ జలాల వాడకంలో రాష్ట్రానికి అన్యాయం జరుగుతోంది : జగదీశ్ రెడ్డి